Weight lose : ఈ డ్రింక్ తో ఈజీగా బరువు తగ్గొచ్చు తెలుసా…!!
Weight lose : ప్రస్తుత కాలంలో ఉబకాయ సమస్య అనేది ఎంతో మందిని వేధిస్తుంది. అయితే అన్ని రకాల ఎంతో ప్రమాదకరమైన వ్యాధులకు అధిక బరువే మూల కారణం అని వైద్యులు అంటున్నారు. అయితే ఉబకాయ సమస్య అనేది గుండె జబ్బులకు కూడా దారి తీస్తుంది. కాబట్టి బరువును కంట్రోల్ లో ఉంచుకోవాలి అని అంటున్నారు నిపుణులు. అయితే స్థూలకాయ సమస్యతో ఇబ్బంది పడేవారు మన వంట గదిలో కొన్ని దినుసుల ద్వారా కూడా అధిక బరువును […]
Weight lose : ప్రస్తుత కాలంలో ఉబకాయ సమస్య అనేది ఎంతో మందిని వేధిస్తుంది. అయితే అన్ని రకాల ఎంతో ప్రమాదకరమైన వ్యాధులకు అధిక బరువే మూల కారణం అని వైద్యులు అంటున్నారు. అయితే ఉబకాయ సమస్య అనేది గుండె జబ్బులకు కూడా దారి తీస్తుంది. కాబట్టి బరువును కంట్రోల్ లో ఉంచుకోవాలి అని అంటున్నారు నిపుణులు. అయితే స్థూలకాయ సమస్యతో ఇబ్బంది పడేవారు మన వంట గదిలో కొన్ని దినుసుల ద్వారా కూడా అధిక బరువును నియంత్రించవచ్చు. అయితే అలాంటి వాటిలో వాము కూడా ఒకటి. అయితే ఈ వాములో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. ఈ వాములో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. ఈ వాము అనేది జలుబు మరియు మైగ్రేన్ తలనొప్పికి కూడా మంచి మందు అని చెప్పొచ్చు. అయితే ఈ వాము పొడిని ఒక గుడ్డలో కట్టుకొని నెమ్మదిగా వాసన పిలిస్తే సమస్య అనేది తీరిపోతుంది.
అలాగే అస్తమాతో ఇబ్బంది పడే వారు కూడా వామును మరియు బెల్లాన్ని కలిపి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అలాగే ఈ వాము గుండె సమస్యలు రాకుండా నివారించడంలో కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు… ఉబకాయ సమస్యతో ఇబ్బంది పడేవారు ఈ వామును నీళ్ళ లో వేసి కొద్దిసేపు మరిగించి పడుకునే ముందు తీసుకున్నట్లయితే ఒక వారంలోనే మీరు బరువు తగ్గుతారు అని అంటున్నారు. అలాగే రాత్రి పూట ఎంతో మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతుంటారు. ఈ సమస్య కూడా బరువు పెరిగేందుకు దారితీస్తుంది. దీంతో కడుపుకు సంబంధించిన ఎన్నో సమస్యలను మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. దీనికి పరిష్కారం మాత్రం వాము నీరే అని అంటున్నారు నిపుణులు.
ఈ వాము గింజలను నీళ్లలో మరిగించి తీసుకోవటం వలన ఎంతో మేలు జరుగుతుంది. ఇది పొట్టను క్లీన్ చేయడమే కాక ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలను నయం చేయడంలో మేలు చేస్తుంది. ఈ వాము నీరు అనేది శరీరంలో ఉన్నటువంటి కొవ్వును కూడా కలిగిస్తుంది. ఇది కేలరీలను బర్న్ చేయడం వలన బరువును నియంత్రించడంలో మేలు చేస్తుంది… మరిగించినటువంటి వాము నీరు తీసుకోవడం వలన కడుపులోని ఆహారము అనేది తొందరగా జీర్ణం అవుతుంది. ఇది మీ నిద్రకు ఎటువంటి భంగం కలిగించదు. అలాగే నిద్రలేమి సమస్యతో బాధపడే వారికి ఇది మంచి హోమ్ రెమిడీ అని చెప్పొచ్చు. అలాగే శరీరం అనేది డిటాక్సి ఫై కూడా అవుతుంది. ఈ వాము నీరు అనేది వ్యర్ధాలను కూడా బయటికి పంపించగలదు. అలాగే శరీరం అనేది డిటాక్సి ఫై అయినప్పుడు చర్మం కూడా మెరుస్తుంది. ఇంకా మొటిమలు మరియు దద్దుర్లు లాంటి వాటిని తగ్గించి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో మేలు చేస్తుంది…