Weight Loss : 21 రోజులలో బరువు తగ్గే సూపర్ డైట్…!
Weight Loss : అధిక బరువు అనేది ఈ కాలంలో చాలా మందికి సమస్యగా మారింది. దీనికి కారణం ఆహార విషయంలో అదుపు లేకపోవడం, శరీరానికి శ్రమ లేకపోవడం వంటి కారణాలు ఈ అధిక బరువుకు కారణమైనప్పటికీ కొన్ని సూత్రాలను పాటించడం ద్వారా ఈ అధిక బరువు సమస్య నుంచి బయటపడవచ్చు అని అంటున్నారు వైద్యనిపుణలు.. కొన్ని కీలక సూత్రాలను పాటించడం వలన ఈ అధిక బరువుకి చెక్ పెట్టవచ్చు. ఇంతకీ ఆ కీలక సూత్రాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మంచినీళ్లు అధికంగా తాగాలి. తినడానికి అరగంట ముందు నీళ్లు తాగితే జీర్ణ ప్రక్రియ మేరుగవుతుంది.. దాని ఫలితంగా బరువు కంట్రోల్లో ఉంటుంది. ఉదయం తిని అల్పాహారం మన ఆరోగ్యంలో కీలకపాత్ర పోషిస్తుంది. అందుకే బ్రేక్ఫాస్ట్ కాస్త అధికంగా తింటే అధిక కొవ్వు కరిగి బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు.
బ్రేక్ ఫాస్ట్ మానేస్తే మొదటికే మోసం వస్తుందట. అలాగే రాత్రివేళ కాస్త తక్కువగా తింటూ త్వరగా తినాలి. భోజనం తిన్న వెంటనే చిరితిల్లు అస్సలు తినకూడదు. ఇంట్లో చేసిన పదార్థాలైన కాస్త గ్యాప్ ఇచ్చి తినడం వలన బరువు కంట్రోల్లో ఉంటుంది. వ్యాయామం ఏరోబిక్స్ లాంటివి చేస్తే బరువు తగ్గొచ్చు. ప్రతిరోజు ఇలా చేయడం వల్ల శారీరిక మానసిక ఉల్లాసం మీ సొంతం. కార్బోహైడ్రేట్ ఎక్కువగా ఉండే ఆహారం తగ్గించాలి. కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకుంటే శరీరానికి మంచిది. జీర్ణ ప్రక్రియ సులువుగా ఉంటే అధిక బరువు సమస్య దరిచేరదు. మధ్యాహ్నం భోజనంతో పాటు ఉడకబెట్టిన బంగాళదుంపలను తీసుకోవాలి. దీంతో అధికంగా తీసుకునే ఆహారాన్ని మనకు తెలియకుండానే నియంత్రించుకుంటాం.
రాత్రి సమయంలో ఆలస్యంగా నిద్రించే వారిలో స్థూలకాయం బారిన పడే అవకాశం ఉంది. కాబట్టి త్వరగా నిద్రించడం వల్ల బరువు తగ్గడానికి పాత్ర పోషిస్తుంది. చక్కెర తింటూ ఉంటారు ఈ చక్కెర బరువు పెరగడానికి ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే ఒక్కొక్కరు రోజుకి రెండు లేదా మూడు సార్లు టీ తాగుతారు మన రక్తంలో చక్కెర శాతం ఎక్కువైతే మనకి మధుమేహం వస్తుంది. మీరు చక్కెరకి బదులుగా బెల్లం లేదా బెల్లం మరియు రాక్ సుగర్ చక్కెర ఇచ్చే తీయదనం ఇస్తాయి. మరియు ఇందులో మినరల్స్ అధికంగా ఉన్నాయి. మనం సాధారణంగా టేబుల్ సాల్ట్ వాడుతూ ఉంటాం.
ఈ టేబుల్ సాల్ట్ బరువు పెరగడానికి దోహదపడుతుంది. కావున దీని ప్లేస్ లో రాక్ సాల్ట్ ని వాడుకుంటే అధిక బరువుకి చెక్ పెట్టవచ్చు. మరియు దీని వాడటం వల్ల జీర్ణశక్తి కూడా బాగా పెరుగుతుంది కూల్ డ్రింక్స్ లో ఎక్కువగా చక్కర వేస్తారు కాబట్టి బరువు పెరుగుతారు. అందుకే వాటిని సాధ్యమైనంత వరకు దూరంగా ఉంచడం మంచిది…