Cholesterol : ప్రతి రోజు 30 నిమిషాల పాటు ఇలా చేస్తే… కొలెస్ట్రాల్ ఈజీగా నియంత్రించవచ్చు…!
ప్రధానాంశాలు:
Cholesterol : ప్రతి రోజు 30 నిమిషాల పాటు ఇలా చేస్తే... కొలెస్ట్రాల్ ఈజీగా నియంత్రించవచ్చు...!
Cholesterol : ప్రస్తుత కాలంలో మనం ఎన్నో రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ సమస్యలలో ఒకటి కొలెస్ట్రాల్ కూడా. అయితే కొలెస్ట్రాల్ సమస్య గుండెపోటు మరియు స్ట్రోక్ సమస్యలకు కూడా కారణం అవుతుంది. అయితే ఓంట్లో కొలెస్ట్రాల్ పెరుగుతుంది అనే విషయం చాలా మందికి అసలు తెలియదు. అందుకే దీనిని సైలెంట్ కిల్లర్ అని అంటూ ఉంటారు. అలాగే ప్రతి ఆరు నెలలకు ఒకసారి బ్లడ్ టెస్ట్ లు కచ్చితంగా చేయించుకోవాలి. ప్రతినిత్యం తనిఖీ చేసుకుంటూ ఉండాలి. అప్పుడే మొదటి దశలోనే ప్రమాదాన్ని పసికట్టవచ్చు. అయితే అధిక కొలెస్ట్రాల్ కు కేవలం మందులు వాడడం వలన కొలెస్ట్రాల్ కంట్రోల్ లో ఉండదు…
కొలెస్ట్రాల్ పెరిగితే ఆహారంపై కూడా ఎంతో ప్రత్యేక శ్రద్ధ చూపించాలి. వీలైనంతవరకు బయట ఆహారాలను తీసుకోవటం మానేయాలి. అయితే వైద్యుల అభిప్రాయ ప్రకారంగా చూసినట్లయితే, ఈ కొలెస్ట్రాల్ ను కంట్రోల్ లో ఉంచుకోవాలి అనుకుంటే కచ్చితంగా వ్యాయామం చేయాల్సి ఉంటుంది.అలాగే ప్రతి నిత్యం కూడా మందులు తీసుకోవడం వలన తక్కువ నూనె మరియు మసాలాలు ఉన్న ఆహారాలను కూడా తీసుకోవాలి. అంతేకాక కేవలం జిమ్ కి వెళ్లడం వలన అధిక బరువు మరియు కొలెస్ట్రాల్ ను తొందరగా నియంత్రించలేము. దీనికి బదులుగా ఈ కింది ఇచ్చిన ఐదు జాగ్రత్తలు మీరు పాటించాలి. ప్రతినిత్యం 30 నుండి 40 నిమిషాల పాటు కచ్చితంగా నడవాలి. అయితే అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం చూసినట్లయితే, రోజు వారి నడక గుండె సమస్యల ప్రమాదాలను తొందరగా నియంత్రిస్తుంది. అలాగే ఉదయం నడవలేకపోతే కనీసం రాత్రి టైం లో అయినా నడవటం అలవాటు చేసుకుంటే మంచిది.

Cholesterol : ప్రతి రోజు 30 నిమిషాల పాటు ఇలా చేస్తే… కొలెస్ట్రాల్ ఈజీగా నియంత్రించవచ్చు…!
వాకింగ్ తో పాటుగా జాగింగ్ కూడా చేయాల్సి ఉంటుంది. అంతేకాక రన్నింగ్ చేయడం వలన కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా తొందరగా నియంత్రిస్తుంది. అలాగే ఆకస్మాత్తుగా, వేగంగా పరిగెత్తడం లాంటివి అస్సలు చేయకూడదు. నెమ్మదిగా వేగాన్ని పెంచుకుంటూ పోవాలి. అలాగే సైక్లింగ్ చేయడం వలన కూడా కొలెస్ట్రాల్ స్థాయి అనేది అదుపులో ఉంటుంది. మీరు రోజులో ఎప్పుడైనా ఇంటి చుట్టూ సైకిల్ ను తొక్కటం లాంటివి చేయండి. ఇది కండరలా నిర్మాణాన్ని కూడా ఎంతో బలోపెతం చేయగలదు. అలాగే మానసిక ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. అంతే స్విమ్మింగ్ చేయటం కూడా మంచి అలవాటే. అయితే స్విమ్మింగ్ అనేది ఆరోగ్యాన్ని ఎంతో మెరుగుపరుస్తుంది. అలాగే కండరాలను కూడా ఎంతో బలంగా తయారు చేస్తుంది. ఇలా చేయడం వలన శరీరంలో రక్త ప్రసరణకు కూడా ఎంతో మేలు చేస్తుంది. ఈ వ్యాయామం అనేది కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తుంది. అలాగే అస్తమా సమస్యలను కూడా తొందరగా నియంత్రిస్తుంది. మీరు జిమ్ కి వెళ్లే బదులుగా ప్రతిరోజు ఉదయాన్నే యోగా సాధన చేయటం వలన మంచి ఫలితం దక్కుతుంది. ఈ యోగ వలన కొలెస్ట్రాల్ తో పాటుగా షుగర్ మరియు రక్త పోటు మరియు బరువు కూడా అదుపులో ఉంటుంది…