Fruit Juice : ఆ సమయంలో ఫ్రూట్ జ్యూస్ తాగితే విష పదార్ధాలు అన్నీ మాయం..!
ప్రధానాంశాలు:
Fruit Juice : ఆ సమయంలో ఫ్రూట్ జ్యూస్ తాగితే విష పదార్ధాలు అన్నీ మాయం..!
Fruit Juice : ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే రోజువారీ ఆహారంలో పండ్లు తప్పనిసరిగా ఉండాలన్న విషయం తెలిసిందే. అయితే కొందరు పండ్లు నేరుగా తినడం కంటే వాటి రసాన్ని తాగడానికే ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. కానీ సమయం, పద్ధతి పాటించకుండా పండ్ల జ్యూస్‌లను తీసుకోవడం వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.వైద్యుల సూచనల ప్రకారం పండ్ల రసం తాగడానికి సరైన సమయం చాలా కీలకం. ముఖ్యంగా ఉదయం సమయం జ్యూస్ తీసుకోవడానికి ఉత్తమంగా పరిగణిస్తారు. రాత్రి నిద్ర తర్వాత శరీరం కొంత బలహీనంగా ఉంటుంది. ఈ సమయంలో తాజా పండ్ల రసం తాగితే వెంటనే శక్తి లభిస్తుంది. ఉదయం ఖాళీ కడుపుతో లేదా తేలికపాటి అల్పాహారంతో పాటు జ్యూస్ తీసుకోవడం వల్ల శరీరంలో చేరిన విషపదార్థాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది.
Fruit Juice : ఆ సమయంలో ఫ్రూట్ జ్యూస్ తాగితే విష పదార్ధాలు అన్నీ మాయం..!
Fruit Juice : ఆ సమయంలో ఫ్రూట్ జ్యూస్ తాగితే విష పదార్ధాలు అన్నీ మాయం..!
అలాగే వ్యాయామం చేసిన తర్వాత అరగంటలోపు పండ్ల రసం తాగడం చాలా ప్రయోజనకరమని నిపుణులు చెబుతున్నారు. వర్కౌట్ సమయంలో ఖర్చైన శక్తిని తిరిగి పొందేందుకు జ్యూస్ సహకరిస్తుంది. అంతేకాకుండా ఉదయం జ్యూస్ తీసుకోవడం వల్ల శరీరంలోని ఎలక్ట్రోలైట్ స్థాయిలు సమతుల్యంగా ఉండి అలసట తగ్గుతుంది.అయితే రాత్రి పడుకునే ముందు పండ్ల రసం తాగడం మంచిది కాదని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. జ్యూస్‌లో ఉండే సహజ చక్కెర (ఫ్రక్టోజ్) రక్తంలో చక్కెర స్థాయిని పెంచి నిద్రకు ఆటంకం కలిగించవచ్చు. అలాగే రాత్రిపూట జీర్ణక్రియ నెమ్మదిగా సాగుతుండటంతో జ్యూస్ తాగడం వల్ల అజీర్ణం, గ్యాస్ వంటి సమస్యలు రావచ్చని హెచ్చరిస్తున్నారు.
భోజనంతో పాటు జ్యూస్ తీసుకోవడం కూడా మంచిది కాదని నిపుణుల సూచన. ఇది జీర్ణక్రియపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అంతేకాదు జ్యూస్‌లో అదనపు చక్కెర కలపడం మానుకోవాలి. మార్కెట్‌లో లభించే ప్యాకెట్ జ్యూస్‌ల కంటే ఇంట్లో తాజాగా తయారుచేసిన జ్యూస్‌లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే జ్యూస్‌లలో ఫైబర్ పరిమాణం తక్కువగా ఉండటంతో, సాధ్యమైనంత వరకు పండ్లను నేరుగా తినడమే ఉత్తమమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేస్తే పండ్లలోని అన్ని పోషకాలు సంపూర్ణంగా శరీరానికి అందుతాయి.