Fruit Juice : ఈ పండ్ల రసాలను రోజుకు ఒక గ్లాస్ తాగితే చాలు… జ్ఞాపకశక్తి అమాంతం పెరుగుతుంది… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Fruit Juice : ఈ పండ్ల రసాలను రోజుకు ఒక గ్లాస్ తాగితే చాలు… జ్ఞాపకశక్తి అమాంతం పెరుగుతుంది…

Fruit Juice : మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవాలలో మెదడు కూడా ఒకటి. అయితే మెదడు ఆరోగ్యంగా ఉండాలి అంటే పోషకాలు అనేవి ఎంతో అవసరం. అయితే ఈ లోపాల వలన కూడా చిత్త వైకల్యం వచ్చే ప్రమాదం ఉన్నది. అయితే జ్ఞాపక శక్తిని సక్రమంగా ఉంచుకోవడానికి ముఖ్యమైన ఆహారాలు తీసుకుంటే మంచిది. అలాగే మెదడు ఆరోగ్యాన్ని రక్షించుకునేందుకు మరియు అభిజ్ఞ పనితీరును కూడా మెరుగుపరిచేందుకు ఈ పండ్ల రసాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. అయితే […]

 Authored By ramu | The Telugu News | Updated on :2 August 2024,8:00 am

Fruit Juice : మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవాలలో మెదడు కూడా ఒకటి. అయితే మెదడు ఆరోగ్యంగా ఉండాలి అంటే పోషకాలు అనేవి ఎంతో అవసరం. అయితే ఈ లోపాల వలన కూడా చిత్త వైకల్యం వచ్చే ప్రమాదం ఉన్నది. అయితే జ్ఞాపక శక్తిని సక్రమంగా ఉంచుకోవడానికి ముఖ్యమైన ఆహారాలు తీసుకుంటే మంచిది. అలాగే మెదడు ఆరోగ్యాన్ని రక్షించుకునేందుకు మరియు అభిజ్ఞ పనితీరును కూడా మెరుగుపరిచేందుకు ఈ పండ్ల రసాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. అయితే ఈ అభిజ్ఞ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే కొన్ని ముఖ్యమైన పండ్ల రసాలు కూడా ఉన్నాయి. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం…

నారింజ రసం అనేది రక్తంలో ఎర్ర రక్త కణాల పరిమాణాన్ని పెంచగలదు. అదే టైమ్ లో మెదడు ఆరోగ్యాన్ని కూడా ఎంతగానో మెరుగుపరుస్తుంది. అలాగే నారింజ మెదడు పనితీరుకు కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇది శోథ నిరోధక లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. ఇది మొత్తం ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఈ నారింజ రసంలో విటమిన్ సి అనేది అధికంగా ఉంటుంది. ఈ రసం అనేది మెదడు ఆరోగ్యాన్ని ఎంతగానో మెరుగుపరుస్తుంది. ఈ నారింజ రసం అనేది మెదడు లోని న్యూరోట్రాన్స్ మీటర్ ఉత్పత్తిని పెంచడానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ రసం అనేది మెదడులోని ఆక్సీకరణ ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది…

Best fruit juice to brain health

Best fruit juice to brain health

అలాగే అధిక రక్తపోటు ఉన్నవారికి బీట్ రూట్ రసం అనేది ఎంతో ఉపయోగంగా ఉంటుంది. అలాగే బీట్ రూట్ రసం అనేది మెదడుకు రక్త ప్రసరణను పెంచేందుకు మేలు చేస్తుంది. ఈ జ్యూస్ మెదడు కణాలకు పోషకాలను మరియు ఆక్సికరణ ను ఇస్తుంది. అలాగే మెదడు పని తీరును కూడా మెరుగుపరుస్తుంది. అలాగే నల్ల ద్రాక్ష రసంలో ఎంతో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మెదడు పనితీరును మరియు జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయి. అయితే ఈ ద్రాక్ష రసం అనేది న్యూరోడెజెనరేటివ్ సమస్యల ప్రమాదాలను కూడా నియంత్రిస్తుంది. అలాగే చెర్రీ జ్యూస్ లో యాంటీ ఆక్సిడెంట్లు మరియు యాంటీ ఇన్ఫ్లమెంటరీ గుణాలు ఉన్నాయి. ఇవి అబిజ్ఞ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇది మెదడు పనితీరుకు కూడా మేలు చేస్తుంది. అలాగే ఆక్సీకరణ ఒత్తిడిని మరియు వాపులను కూడా తగ్గిస్తుంది. అలాగే జ్ఞాపక శక్తిని కూడా ఎంతో మెరుగుపరుస్తుంది…

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది