stomach : ఇవి తింటే వారం రోజుల్లో మీ పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు మొత్తం మాయం…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

stomach : ఇవి తింటే వారం రోజుల్లో మీ పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు మొత్తం మాయం…!

 Authored By aruna | The Telugu News | Updated on :6 June 2023,8:00 am

Stomach : అధిక బరువు ఉండేవాళ్ళు బరువు తగ్గడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎన్ని చేసినా బరువు మాత్రం తగ్గరు. నేను ఏం తినకపోయినా బరువు మాత్రం తగ్గడం లేదు ఇంకా పెరుగుతూనే ఉన్నాను అని కూడా అంటూ ఉంటారు. వంశపారంపర్యంగా వచ్చిన ఈ బరువుని ఇక తగ్గించుకోలేం అని ఫిక్స్ అయిపోతారు. నిజానికి వంశపారంపర్యంగా వచ్చిన అధిక బరువును సైతం మనం తగ్గించుకునే అవకాశాలు ఉన్నాయి. మీరు గట్టిగా నమ్మితే ఏడంటే ఏడు రోజుల్లో కూడా మీరు ఎంతో కొంత బరువు తగ్గే గొప్ప అవకాశాలు బోలెడు ఉన్నాయి. కేవలం 7 రోజుల్లో ఎలా సాధ్యమవుతుంది అని ఆశ్చర్యపోతున్నారా.. ఏడు రోజుల్లోనే మీరు కోరుకున్న బరువు అంతా తగ్గిపోతారు. ఈ ఏడు రోజుల డైట్ ప్లాన్ కనుక మీరు పాటిస్తే బరువు తగ్గడం ప్రారంభమవుతుంది. బరువు తగ్గడానికి తీసుకోవాల్సిన డైట్ ప్లానెట్ మళ్ళీ మనం వెయిట్ గైన్ అవ్వకుండా అంటే మల్లి మనం బరువు పెరగకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలు కూడా ఈ పూర్తిగా తెలుసుకుందాం.. ఏ పని చేసిన ఆ పని పట్ల పూర్తి అవగాహన ఉంటే ఆ పనిని మనం సక్రమంగా పూర్తి చేయొచ్చు.

అవగాహన లేకుండా ఏ పని ప్రారంభించిన అదే అసంపూర్తిగానే మిగిలిపోతుంది. అంటే వేలకాని వేల భోజనాలు చేయడం. అలాగే వంటల్లో ఆయిల్ ఎక్కువగా తీసుకోవడం, శరీరానికి సరిపడా నీటిని తీసుకోకపోవడం, నచ్చిన ఫుడ్డు కనపడగానే డైట్ ని పక్కన పెట్టేయడం ఇటువంటి పనులన్నీ చేస్తూ వెయిట్ తగ్గాలి అనుకుంటే అది ఎలా సాధ్యమవుతుంది. అయితే కేవలం వ్యాయామంతోనే కాకుండా మనం తీసుకునే ఆహారంలో కొన్ని మార్పులు చేయడం ద్వారా కూడా మంచి ఫలితాన్ని పొందవచ్చు. దీనికోసం నెలలో తరబడి డైటింగ్ కూడా చేయాల్సిన అవసరం లేదు.. ఏడు రోజులు పాటు ప్రత్యేకమైన డైట్ ప్లాన్ పాటిస్తే సరిపోతుంది. ఆరోగ్యకరమైన రుచికరమైన ఆహారం తింటూనే శరీరంలోని కొవ్వు కరిగించుకోవచ్చు. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన కొన్ని ముఖ్య విషయాలు ఏమిటంటే మీరు రెగ్యులర్గా తీసుకుని ఆయిల్స్ ని కూడా తగ్గించాల్సి ఉంటుంది.

If you eat these you will lose all the fat around your stomach within a week

If you eat these, you will lose all the fat around your stomach within a week

అలాగే సాల్ట్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రెండు కూడా మీరు డైట్ ప్లాన్ లో ఉన్నంతవరకు మాత్రమే కాకుండా మీరు అధిక బరువు సమస్యను ఎదుర్కొన్నప్పటి నుంచి కూడా ఈ ఆయిల్ విషయంలో కానీ గొప్ప విషయంలో కానీ చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. కాబట్టి మీరు తీసుకున్న ఆహారానికి తగినట్టుగా మీ శారీరక శ్రమ ఉండేలా చూసుకోవాలి. అలాగే చాలామంది చేసే మరో మిస్టేక్ ఏంటంటే రైస్ పూర్తిగా మానేయడం తన ప్లేసులో చపాతీలు తీసుకోవడం కూడా చేస్తూ ఉంటారు. ఇది కూడా అవగాహన లేని దే చెప్పొచ్చు చాలామంది రాత్రుల్లో చపాతీలు ఆలూ కర్రీస్ వేసుకొని కడుపు నిండా తింటారు. దీని డైట్ అని మనం ఎలా చెప్పగలం. ఎక్కువగా వాటర్ కంటెంట్ ఉండే కూరగాయలను మీరు తీసుకుంటూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది.

అంటే ఆనపకాయ, బీరకాయ, గుమ్మడికాయ ఇటువంటివి చక్కగా వాటర్ కంటెంట్ ఉంటుంది. కాబట్టి ఈ కూరలను మీరు చక్కగా తీసుకోవచ్చు. అలాగే అధికంగా వాటర్ కంటెంట్ తీసుకోవాలి. అంటే పుచ్చకాయ గాని బెర్రీస్, ఆపిల్, కర్బూజా ఇటువంటి పళ్ళ ల్లో ఎక్కువగా వాటర్ కంటే ఉంటుంది. అలాగే పీచు కూడా ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి మీ పొట్టని శుభ్రం చేస్తుంది. ప్రతిరోజు మీరు పప్పుని ఆహారంగా తీసుకోండి. పప్పులో మంచి ప్రోటీన్ ఉంటుంది. మీరు నాన్ వెజ్ తింటే ఎంత ప్రోటీన్ మీకు అందుతుందో అంత చక్కగా ప్రోటీన్ మీకు అందుతుంది. అలాగే 7 గంటల లోపే మీ డిన్నర్ ను ముగించేయండి. మరి కాస్త శ్రద్ధ తీసుకొని మీ డైట్ ప్లాన్ ని మీరే ప్రిపేర్ చేసుకొని చక్కగా ఇంట్లో ఉండే బరువు తగ్గొచ్చు..

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది