Health Tips : వీటిని ఉదయం నుంచి సాయంత్రం వరకు మీ డైట్ లో చేర్చుకుంటే ప్రోటీన్ పుష్కలంగా అందుతుంది…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Health Tips : వీటిని ఉదయం నుంచి సాయంత్రం వరకు మీ డైట్ లో చేర్చుకుంటే ప్రోటీన్ పుష్కలంగా అందుతుంది…!!

 Authored By prabhas | The Telugu News | Updated on :12 March 2023,11:40 am

Health Tips : ప్రోటీన్ అనేది మన శరీరానికి చాలా అవసరం. ఆరోగ్యంగా పుష్టిగా ఉండాలంటే ప్రోటీన్ చాలా ముఖ్యం. ప్రోటీన్ అనేది కొవ్వులతో తయారవుతుంది. శరీర నిర్మాణాన్ని కూడా చాలా ముఖ్యం. ప్రోటీన్ లోపం వలన శరీరం నిర్మాణంలో అంతరాయం కలుగుతుంది. పాత కణాలను నాశనం చేయడం. కొత్త కణాలను సృష్టించడం మానవ శరీరంలో నిరంతరం జరుగుతూ ఉంటుంది. ఆరోగ్యకరమైన మానవ శరీరంలో నిత్యము 330 బిలియన్లు కొత్త కణాలను పుడతాయి. అంటే ప్రతిరోజు 330 బిలియన్ల పాత కణాలు శరీరంలో నాశనమై దాని కొత్త కణాలు పుడుతూ ఉంటాయి. ఈ కణాలన్నీ ప్రోటీన్ తోనే తయారవ్వడానికి శరీరానికి ప్రోటీన్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అయితే అదే సమయంలో శరీరానికి ఎంత ప్రోటీన్ కావాలో అర్థం చేసుకోవడం చాలా ప్రధానం.

If you include these in your diet from morning to evening you will get plenty of protein

If you include these in your diet from morning to evening, you will get plenty of protein

ప్రోటీన్ లోపం శరీరంలో ఎన్నో వ్యాధులు చుట్టుముట్టేలా చేస్తాయి. ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవడం వలన కూడా వ్యాధులు వస్తూ ఉంటాయి. ఇండియన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు నిర్దిష్ట పరిమాణంలో తీసుకోవాలని తెలిపింది. పుట్టినప్పటినుంచి ఆరు నెలల వయసు వరకు శిశువు శరీరానికి రోజుకు 10 గ్రాముల ప్రోటీన్ చాలా ముఖ్యం. పుట్టిన శిశువులకు ప్రోటీన్ అవసరం తల్లిపాల ద్వారా ఈ ప్రోటీన్ అందుతుంది. రెండు సంవత్సరాల నుంచి 8 సంవత్సరాల వయసు వరకు పిల్లలకు 15 నుండి 28 ప్రోటీన్ కావాలి. మా శరీరానికి అవసరమైన ప్రోటీన్ కోసం వీటిని తీసుకోవాలి.

*సలాడ్లకు మొలకలు జోడించాలి… మీ సలాడ్లు సెనగలు, పెసలు, పచ్చిబఠానీలు, రాజ్మాను చేర్చుకోవాలి.మీరు ఇష్టపడి ఇతర పప్పు దినుసులకు కూడా చేర్చుకోవచ్చు. భోజనంలో మొలకలను జోడించడం వలన అమైన్ యాసిడ్ ప్రభావంతంగా మెరుగుపడుతుంది. *ఉదయాన్నే డ్రై ఫ్రూట్స్ తినాలి: రోజు ప్రారంభం అవ్వడానికి కొన్ని డ్రైఫ్రూట్స్ తీసుకోవడం వలన మంచి ప్రోటీన్ అందుతుంది. అలాగే రోజంతా ఆకలిని అరికట్టడానికి ఓ అద్భుతమైన మార్గం రాత్రిపూట నానబెట్టిన బాదంపప్పు తింటే చాలా మంచి ప్రోటీన్ అందుతుంది. *కోడిగుడ్లు: ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో మూడు ఉడికించిన గుడ్లను తీసుకుంటూ ఉండాలి. అలా తీసుకోవడం వలన సెలీనియం

Protein Rich Food: Consuming Protein Every Day Can Reduce Heart Problems  And Diabetes | Protein Rich Food: ఈ ఆహారాలను రోజూ తీసుకుంటే.. గుండె  సమస్యలను తగ్గించుకోవచ్చు..] News in Telugu

కొలిన్ లాంటి ముఖ్యమైన విటమిన్లు ఖనిజాలతో పాటు 19 గ్రాముల అధిక నాణ్యత ప్రోటీన్ అందుతుంది. *మీ ఆహారంలో గింజలను జోడించాలి: చియా, సబ్జా ,గుమ్మడికాయ, పొద్దుతిరుగుడు గార్డెన్ గ్రేస్ పుచ్చకాయ లాంటి గింజలను అలా ఫైబర్ ,మెగ్నీషియం సెలీనియం ఇతర సూక్ష్మ పోషకాలు పుష్కలంగా ఉండే గింజలను తీసుకోవడం వలన ప్రోటీన్ పెరుగుతుంది. వాటిని సలాడ్లు ధాన్యాల డిజార్ట్ లో కూడా జోడించవచ్చు.. *పెరుగు స్నాక్ గా తీసుకోవాలి: తెలుగులో అధిక ప్రోటీన్ ఉంటుంది. ఈ పెరుగులో 240 గ్రాముల సర్వింగ్ లో 17_ 20 గ్రాముల ప్రోటీన్ పుష్కలంగా ఉంటే ఇది సాధారణ పెరుగులో లభించే దానికంటే దాదాపు రెండు రేట్లు అధికం.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది