Hair Tips : ఊడిన జుట్టు ప్లేస్ లో కొత్త జుట్టు రావాలంటే ఈ కుంకుడు కాయతో ఈ విధంగా చేయండి చాలు…!
Hair Tips : ప్రాచీన కాలంలో ప్రతి ఒక్కరు కూడా జుట్టు సంరక్షణ కోసం నేచురల్ గా దొరికేవి ఎక్కువగా వాడేవారు.. వాటిలో ముఖ్యంగా కుంకుడు కాయను ఎక్కువగా వాడేవారు. వారికి జుట్టు సమస్యలు అంటూ వచ్చేవే కాదు. ప్రతి ఒక్కరి జుట్టు చాలా పొడవుగా, దట్టంగా ఉండేది. దీనిని తలస్నానం చేయడానికి ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే ప్రస్తుతం రోజులలో షాంపూలు వచ్చాక.. వీటిని ఉపయోగించేవారు చాలా తక్కువ అయ్యారు. ఈ కుంకుడుకాయలతో ఎన్నో ఆరోగ్య ఉపయోగాలు ఉన్నాయి. అవి ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం.. కుంకుడుకాయ గుజ్జు చేదుగా ఉండి స్లీస్మంతో కూడిన వాంతిని కలిగించి ఉబ్బసాన్ని తగ్గేలా చేస్తుంది. కేశ సంపదను వృద్ధి చేసేందుకు కుంకుడుకాయలు
ఎంతగానో సహాయపడతాయి. కుంకుడుకాయ పొట్టు తీసేసి వేడి నీటిలో వేసి బాగా నలిపి దానిని వడకట్టి ఆ నీటిని రెండు చుక్కలు ముక్కులో వేస్తే మూర్చ నుంచి బయటపడతారు. ఈ కుంకుడుకాయ గింజలను పగలగొట్టి వచ్చే పప్పును పొడిచేసి మూడు చిటికెల పొడిలో తేనె కలిపి తీసుకున్నట్లయితే ఉబ్బసం తగ్గిపోతుంది. సానపై అరగదీసి ఆ గంధాన్ని గొంతుకి అప్లై చేస్తే ఎక్కిళ్ళు తొందరగా తగ్గిపోతాయి. అలాగే తలలో చుండ్రును తగ్గించుకోవాలి అనుకుంటే.. కుంకుడుకాయలతో ప్రతి వారంలో రెండుసార్లు తలస్నానం చేసినట్లయితే చుండు సమస్య నుంచి బయటపడడమే కాకుకుండా జుట్టు పెరుగుతుంది. అలాగే జుట్టు సిల్కీగా, దృఢంగా తయారవుతుంది.
కుంకుడుకాయలను పగల కొట్టి బట్టలో వేసి తలకి చుట్టుకుంటే వాతం తగ్గి తలనొప్పి కూడా తగ్గిపోతుంది. అలాగే కాస్త నీటిలో కళ్ళు ఉప్పు వేసి కరిగించి ఆ నీటిని సానపై వేసి కుంకుడు కాయను ఆ నీటిలో అరగదీసి వచ్చిన గంధాన్ని పేను కొరికిన చోట అప్లై చేస్తే మళ్ళీ ఆ పెను కొరికిన ప్రదేశంలో కొత్తగా జుట్టు వస్తుంది. అలాగే జుట్టు రాలుతున్న వారు ఈ కుంకుడుకాయలను పగలకొట్టి వేడి నీటిలో కొద్దిసేపు నానబెట్టి వాటిని బాగా పిసికి వాటినుంచి నీటిని తీసి దానితో తలస్నానం చేసినట్లయితే జుట్టు రాలే సమస్య నుంచి బయటపడవచ్చు. అలాగే జుట్టు తొందరగా పెరుగుతుంది. పొడవుగా పెరుగుతుంది. సిల్కీగా తయారవుతుంది. అందంగా ఉంటుంది. జుట్టులో చుండ్రు, దురద ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి..