Hair Tips : జుట్టు బలంగా కావాలంటే.. ఈ రెండు తలకి పట్టించండి ఇక నో హెయిర్ ఫాల్
Hair Tips : జంక్ ఫుడ్ తీసుకోవడం, పోషకాహారం తీసుకోకపోవడం వల్ల, ఐరన్, సల్ఫర్, విటమిన్స్ లోపం కారణంగా జుట్టు ఊడిపోతుంటుంది. కొంతమందికి వంశపారంపర్యంగా జుట్టు సమస్యలు ఉంటాయి.
ఇన్‌ఫెక్షన్స్, జన్యు కారణాలు, తక్కువగా నీరు తాగడం వల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది. తలను శుభ్రం చేయకపోవడం వల్ల కూడా ఈ సమస్య వస్తుంది. మానసిక, శారీరక సమస్యల కారణంగా జుట్టు ఊడిపోతుంటుంది. ఒత్తిడిగా ఫీల్ అయినప్పుడు జట్టు ఊడిపోతుంటుంది. సాధారణంగా జిడ్డు జుట్టు,నెత్తి మీద చర్మం దురద, పొడి జుట్టు, దెబ్బతిన్న జుట్టు మొదలైన జుట్టు సమస్యలు ఉంటాయి.
అయితే కొన్ని హోం రెమిడీస్ వల్ల జుట్టు సమస్యలను త్వరగా నివారించవచ్చు.పెరుగుతున్న కాలుష్యం, కెమికల్ ట్రీట్ మెంట్ వంటివి జుట్టు సహజత్వాన్ని కోల్పోయేలా చేస్తాయి. అయితే గుడ్డు సాధారణ జుట్టుకు కండీషనర్ గా పనిచేస్తుంది. గుడ్డు తెల్లసొన జిడ్డుగల జుట్టు కోసం సహాయ పడుతుంది. పచ్చసొన పొడి మరియు విరిగిన జుట్టు నియంత్రించడానికి సహాయపడుతుంది. జుట్టు రకాన్ని బట్టి గుడ్డును రాయాలి. పొడి జుట్టు కొరకు జుట్టు మీద పచ్చసొన రాసి 20 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.అయితే గుడ్డులో జుట్టుకి కావల్సిన పోషకాలన్నీ కలిగిఉన్నందున గుడ్డు హెయిర్ మాస్క్ తయారు చేసుకోవాలి.
Hair Tips : గుడ్డు హెయిర్ మాస్క్…
ప్రోటిన్ , బయోటిన్లతో సమృద్దిగా ఉన్న గుడ్లు సహజంగా తేమగా మారుస్తాయి. దెబ్బతిన్న కుదుళ్లకు పోషకాహారాన్ని అందిస్తాయి. గుడ్లలోని పోషకాలు జుట్టుని బలంగా తయారు చేస్తాయి. విచ్చిన్నం కాకుండా దాని ఆకృతి మారుస్తాయి.హెయిర్ ఫాల్ తగ్గి జుట్టు పెరగడానికి గుడ్డు పచ్చసొన హెయిర్ మాస్క ట్రై చేయాలి. గుడ్డు పచ్చసొనలో ప్రోటిన్లు, విటమిన్లు, కొవ్వు ఆమ్లాలు, పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు జుట్టు పెరుగుదలను ప్రోత్సహించి జుట్టు రాలడాన్ని నివారిస్తాయి. అలాగే ఆలివ్ ఆయిల్ కూడా జుట్టుని బలంగా తయారు చేస్తుంది. గుడ్డు సొనలో ఆలివ్ ఆయిల్ కలిపి జుట్టుకి పట్టించాలి. ఇది పొడిబారిన జుట్టుని కాంతివంతం చేస్తుంది.