Narmal, Sperm Count : మీకు సంతానం క‌ల‌గ‌డంలేదా… స్పెర్ము కౌంట్ ఇంత ఉంటే చాలట… దంపతులకు ఈ జాగ్రత్తలు …? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Narmal, Sperm Count : మీకు సంతానం క‌ల‌గ‌డంలేదా… స్పెర్ము కౌంట్ ఇంత ఉంటే చాలట… దంపతులకు ఈ జాగ్రత్తలు …?

 Authored By aruna | The Telugu News | Updated on :10 August 2025,10:00 am

ప్రధానాంశాలు:

  •  Narmal, Sperm Count : మీకు సంతానం క‌ల‌గ‌డంలేదా... స్పెర్ము కౌంట్ ఇంత ఉంటే చాలట... దంపతులకు ఈ జాగ్రత్తలు ...?


Narmal Sperm Count : ఈ రోజుల్లో పిల్లలు పుట్టడం లేదు ఆ సమస్య కేవలం మహిళలలో మాత్రమే ఉందని భావిస్తుంటారు. వారు మాత్రమే మొదట చెకప్ లు చేయించుకుంటారు. కానీ పురుషుడు మాత్రం పరీక్షలు చేయించుకొనుటకు ఇష్టపడరు. తప్పని పరిస్థితిలో ఇద్దరూ సంతానం కోసం ఎదురుచూసే ప్రయత్నంలో చేయించుకోవాల్సి వస్తుంది. కేవలం స్త్రీలకి మాత్రమే సమస్య ఉండదు పురుషులకు కూడా ఉంటుంది.ఎవరికైనా వివాహం జరిగిన తరువాత తల్లిదండ్రులు కావాలని కోరిక అందరికీ ఉంటుంది. కొందరిలో మాత్రం ఈ కల నెరవేరడం చాలా క్లిష్టంగా మారుతుంది. ఎన్నో ఏళ్లు గడిచిన పిల్లలు మాత్రం అందని వారికి ఇది ఒక మంచి శుభవార్త అని చెప్పవచ్చు. సంతానం కలగకపోవడానికి గల కారణాలు సంతానోత్పత్తికి సంబంధించిన ముఖ్యమైన అంశం వీర్యకణాల సంఖ్య. సంతానం కలగాలంటే స్పెర్ము కౌంట్ చాలా ముఖ్యం. ఈ సంఖ్యలో మార్పులు కారణం చేతనే చాలామంది తల్లిదండ్రులు కాలేకపోతున్నారు.అమ్మా, నాన్న అని పిలుపుకు దూరమవుతున్నారు.

Narmal Sperm Count మీకు సంతానం క‌ల‌గ‌డంలేదా స్పెర్ము కౌంట్ ఇంత ఉంటే చాలట దంపతులకు ఈ జాగ్రత్తలు

#image_title

మ‌హిళ‌ల‌కు అసలు సంతానం ఎందురు రక‌లగ‌డంలేదు :

స్త్రీలు గర్భం దాల్చకపొతే వారిలో ఆవేదన మొదలవుతుంది. తర్వాత సంవత్సరం గడిచిన తరువాత వెంటనే వైద్యుల్ని సంప్రదించి చెక్ అప్ లు చేయించుకుంటారు.కానీ పురుషులు మాత్రం చేయించుకోరు. పని వైద్యులు ఇద్దరికి చేయించి ఎవరిలో సమస్య ఉంది. పురుషుల్లో స్పెర్ముకౌంట్ తక్కువగా ఉన్నాయో తెలియజేస్తారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO), డాక్టర్ సునీల్ జిందాల్ ప్రకారం ఒక ఆరోగ్యకరమైన పురుషునికి మిల్లి లీటర్లు, కనీసం 15 మిలియన్లు లేదా అంతకంటే ఎక్కువ స్పెర్ము కౌంట్ ఉండాలి. ఈ సంఖ్య 15 మిలియన్ల కంటే తక్కువ ఉంటే దానిని తక్కువ స్పెర్మ్ కౌంట్ అంటారు. ఇది గర్భం దాల్చడంలో అడ్డంకులను ఏర్పరచవచ్చు.

తక్కువ స్పెర్ము కౌంట్ కు కారణాలు :

. అనారోగ్యకరమైన జీవనశైలి- ధూమపానం మధ్య అసమతుల్య ఆహారం.
. ఒత్తిడి, నిద్ర లేకపోవడం.
. విపరీతమైన వేడి, లాప్టాప్ ను ఒడిలో పెట్టుకోవడం, బిగుదుగా ఉండే దుస్తులను ధరించడం.
. హార్మోన్ల అసమతుల్యత.
. ఇన్ఫెక్షన్లు లేదా గాయం.

స్పెర్మ్ కౌంట్లను పెంచడానికి ఏ చిట్కాలు :

. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోండి. ఆకుపచ్చ, కూరగాయలు, పండ్లు, డ్రై ఫ్రూట్స్ ప్రోటీన్లు.
. తప్పనిసరిగా వ్యాయామం చేయండి, యోగా, నడక చేయండి.
. సాధ్యమైనంత వరకు ఒత్తిడిని తగ్గించుకొని ధ్యానం, విశ్రాంతి వాటిని అలవాటు చేసుకోండి.
. సప్లిమెంట్లు, డాక్టర్ సలహా మేరకు జింక్, విటమిన్ సి,విటమిన్ ఇ మొదలైనవి తీసుకోండి.
మీరు వైద్యులని సంప్రదిస్తూ ఉండాలి :
ఒక సంవత్సరం క్రమం తప్పకుండా ప్రయత్నించిన తర్వాత కూడా గర్భం దాల్చకపోతే భాగస్వామ్యాలు సంతానోత్పత్తి పరీక్షలు చేయించుకోవాలి. పురుషులు వారి స్పెర్ముకౌంటు స్పెర్ము కదలిక నాణ్యతను తనిఖీ చేసుకోవడం కూడా చాలా ముఖ్యం. బిడ్డ పుట్టాలని చేసే ప్రయత్నాలు ఇంత ముఖ్యమో శారీరక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. మీకు స్పెర్ముకౌంట్లో ఎక్కువగా ఉండాలి. ఆరోగ్యకరమైన జీవనశైలి, వైద్యుని సహకారంలో సలహాలతో తల్లిదండ్రులు కావాలని కలలో సులభంగా నెరవేర్చుకోండి.

Tags :

    aruna

    ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది