Jaggery : వేసవిలో బెల్లం తింటే ఎన్ని లాభాలో తెలుసా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Jaggery : వేసవిలో బెల్లం తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

 Authored By ramu | The Telugu News | Updated on :24 March 2024,1:00 pm

ప్రధానాంశాలు:

  •  Jaggery : వేసవిలో బెల్లం తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

Jaggery : వేసవికాలం రానే వచ్చింది. అయితే ఈ వేసవికాలంలో ప్రతిరోజు తీసుకునే ఆహారంలో బెల్లం చేర్చుకోవడం చాలా మంచిదని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు.అయితే బెల్లంలో పొటాషియం ,మెగ్నీషియం, సోడియం వంటి ఎలక్ట్రోలైట్లు పుష్కలంగా లభిస్తాయి. ఇక ఇవి శరీరంలో ఫ్లూయిడ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి , శరీరాన్ని చల్లపరచడానికి అలాగే డీహైడ్రేషన్ కు గురి కాకుండా ఉండడానికి సహాయపడతాయి. అయితే బెల్లం ఒక అద్భుతమైన సహజ స్వీట్నర్ అని చెప్పాలి. కొందరు దీనిని చక్కెరకు బదులుగా కూడా ఉపయోగిస్తుంటారు. దీనివలన అనేక రకాల ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అయితే నిపుణులు చెబుతున్న సమాచారం ప్రకారం ప్రతిరోజు బెల్లం తీసుకోవడం వలన శరీర ఉష్ణోగ్రత అదుపులో ఉంటుందని తెలుస్తోంది. అలాగే వేడి వాతావరణం లో శరీరాన్ని చల్లబరిచేందుకు బెల్లం ఒక చక్కటి ఉపకారమని వైద్యులు చెబుతున్నారు. మరి బెల్లం తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

కాల్షియం మరియు ఐరన్ పుష్కలంగా లభించే బెల్లం ప్రతిరోజు తీసుకోవడం వలన ఎముకల ఆరోగ్యానికి చాలా మంచిది. అదేవిధంగా జీర్ణక్రియను మెరుగుపరచడానికి మలబద్ధకాన్ని నివారించడానికి ఇది ఎంతగానో సహాయపడుతుంది. అదేవిధంగా ఐరన్ , పోలేట్ పుష్కలంగా ఉన్న బెల్లం తీసుకోవడం వలన ఐరన్ లోపాన్ని సరిచేసి రక్తహీనతను నివారించవచ్చని నిపుణులు చెబుతున్నారు. అదే విధంగా కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి బెల్లం ఎంతగానో సహాయపడుతుంది. అదేవిధంగా అన్నవాహిక, ఊపిరితిత్తులు , ప్రేగులను శుభ్రపరచడానికికి కూడా బెల్లం సహాయపడుతుందని తెలుస్తుంది.

Jaggery వేసవిలో బెల్లం తింటే ఎన్ని లాభాలో తెలుసా

Jaggery : వేసవిలో బెల్లం తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

అదేవిధంగా బెల్లాన్ని గోరువెచ్చని నీటిలో కలిపి తీసుకోవడం వలన రక్తపోటును అదుపులో ఉంచవచ్చు. బెల్లాన్ని ఈ విధంగా గోరువెచ్చని నీటిలో కలిపి తీసుకోవడం వలన పొటాషియం సోడియం పుష్కలంగా లభిస్తుంది. కావున పొటాషియం ఎలక్ట్రోలైట్లను బ్యాలెన్స్ చేస్తూ జీవక్రియ రేటును కూడా పెంచుతుంది. తద్వారా బరువు తగ్గాలి అనుకునేవారు చాలా సులువుగా బరువు తగ్గుతారు. అంతేకాక వేసవిలో చాలామందికి శరీరంలో నీటి శాతం తక్కువగా ఉండటం వలన మల బద్ధకం వంటి సమస్యలు వస్తుంటాయి. ఇక ఈ సమస్యను నివారించడానికి బెల్లం ఒక మంచి ఔషధమని చెప్పాలి.

గమనిక : పైన పేర్కొనబడిన కథనాన్ని ఇంటర్నెట్ లో దొరికే సమాచారం ఆధారంగా రూపొందించడం జరిగింది. ది తెలుగు న్యూస్ దీనిని ధృవీకరించలేదు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది