Health Tips : ఉడికించిన కోడిగుడ్డు మంచిదా.? ఆమ్లెట్ మంచిదా.? ఏది ఆరోగ్యకరమైనది..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Health Tips : ఉడికించిన కోడిగుడ్డు మంచిదా.? ఆమ్లెట్ మంచిదా.? ఏది ఆరోగ్యకరమైనది..!!

 Authored By aruna | The Telugu News | Updated on :29 January 2024,10:00 am

Health Tips : గుడ్డుతో అసలు ఆరోగ్య లాభాలు ఉన్నాయా.. ఆమ్లెట్ తో ఆరోగ్య లాభాలు ఉన్నాయా అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ప్రతి ఒక్కరు ఎక్కువగా ఇష్టపడే ఆహార పదార్థాల్లో కోడి గుడ్డు కూడా ఒక్కటే.. అందరికీ మరీ ఎక్కువగా ఇష్టముంటుంది. అయితే ఈ కోడి గుడ్డు వలన కలిగే ఆరోగ్య లాభాలు ఏంటి.? గుడ్డులో ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయని వైద్యులు చెబుతున్నారు. సంపూర్ణ మాంసకృతుల పరంగా చూస్తే గుడ్డు మొదటి స్థానంలో ఆ తర్వాత పాలు, మాంసాహారం ఉన్నాయి. అయితే పప్పు మాంసాహారంలోని ప్రోటీన్ల కంటే గుడ్డులోనివి తేలిగ్గా జీర్ణం అవుతాయి.

గుడ్డులో కొలెస్ట్రాల్ నేరుగా రక్తంలో కలవకుండా గుడ్డులోని లెస్సితిన్ వంటి రసాయనాలు కాపాడతాయి. ఆమ్లెట్ చూసుకున్నట్లయితే అందులో ఏమేమి కలిపి ఆమ్లెట్ గా వేస్తారని దానిపై అది ఆరోగ్యమా.. అనారోగ్యమా అనేది ఆధారపడి ఉంటుంది. ఆమ్లెట్ డిష్ తయారు చేసేటప్పుడు జోడించిన పదార్థాలపై ఆధారపడి ఉంటుంది. గుడ్డు ఆమ్లెట్లు కేవలం కూరగాయలను మాత్రమే జోడిస్తే అది పోషకాహారాన్ని కలిగి ఉంటుంది. అలాంటప్పుడు అది ఉడికించిన గుడ్ల కంటే మరింత ఆరోగ్యకరమైనదిగా ఉంటుంది. దీనికి విరుద్ధంగా ఆమ్లెట్ ను ఎక్కువ నూనె అనారోగ్యకరమైన కొవ్వుతో కలిపితే అది రుచికరమైన ఆమ్లెట్ అవుతుంది.

కానీ శరీరానికి పెద్ద శత్రువుగా మారుతుంది. కొందరు ఆమ్లెట్ తింటే బరువు తగ్గొచ్చు అనుకుంటారు. ఆరోగ్యకరమైన ఆమ్లెట్ తో సహా ఏ ప్రత్యేకమైన ఆహారము బరువు తగ్గిస్తుందని హామీ ఉండదు. బరువు తగ్గాలంటే రోజు వారి కార్యకలాపాల సమయంలో కాలరీ లు ఖర్చు చేసే దానికంటే తక్కువ కాలరీలు తినాల్సి ఉంటుంది. గుడ్లతో సహా కొన్ని ఆహారాలు బరువు తగ్గడానికి సాయపడతాయి. అయితే వాటిని ఎలా తీసుకుంటున్నారని దానిపై ఆధారపడి ఉంటుంది. గుడ్డును ఉడికించేటప్పుడు గుడ్డులోని చాలా పోషకాలు అలాగే నిక్షిప్తమై ఉంటాయి. ఈ కారణంగా గుడ్లు తినడం చాలా ఆరోగ్యకరమైనది.. అంటే ఆమ్లెట్ కన్నా ఉడకబెట్టిన గుడ్డి శ్రేయష్కరం అని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది