Fruit : ఈ ఒక్క పండు తింటే చాలు.. ఎన్ని లాభాలున్నాయో తెలిస్తే వదలరు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Fruit : ఈ ఒక్క పండు తింటే చాలు.. ఎన్ని లాభాలున్నాయో తెలిస్తే వదలరు..!

 Authored By ramu | The Telugu News | Updated on :16 April 2024,11:00 am

ప్రధానాంశాలు:

  •  Fruit : ఈ ఒక్క పండు తింటే చాలు.. ఎన్ని లాభాలున్నాయో తెలిస్తే వదలరు..!

ఈ రోజుల్లో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. అయితే ఆరోగ్యం కోసం కావాల్సిన పోషకాలను అందించే వాటిని కచ్చింతగా తినాలి. అలాంటి వాటిల్లో పండ్లు ముఖ్యపాత్ర పోషిస్తాయి. కాగా ఇప్పుడు మనం చెప్పుకోబోయే పండు అయితే సర్వ ప్రయోజనాలను అందిస్తుంది. అదే వాటర్ చెస్ట్‌నట్. ఇదే పండును సింఘాడ అని కూడా పిలుస్తారు. ఈ పండు తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. అంతే కాకుండా అందులో ప్రయోజనాలు కూడా బోలెడన్ని ఉంటాయి. ఇందులో నీటిశాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది తింటే బాడీ డీహైడ్రేట్ కాకుండా ఉంటుంది.

Fruit  : ఎముకలు ధృడంగా..

అంతే కాకుండా ఈ పండులో విటమిన్ సి, విటమిన్ ఎ, మాంగనీస్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యంగా ఉండేందుకు సాయం చేస్తుంటాయి. ఇక దాంతో పాటు ఈ సింఘాడ పండులో ఎక్కువగా ఫైబర్ కంటెంట్ ఉంటుంది. ఇది తింటే జీర్ణక్రియ చాలా మెరుగుపడుతుంది. అంతే కాకుండా మలబద్దకం సమస్యలు రాకుండా చూస్తుంది. ఇందులో ఉండే కాల్షియం, పొటాషియం మన ఎముకలకు ఎంతో దోహదం చేస్తాయి. ఎముకలు చాలా ధృఢంగా ఉండేలా చూస్తాయి. పొటాషియం, పుష్కలంగా ఉంటుంది కాబట్టి రక్తం ఫిల్టర్ అవుతుంది.

అంతే కాకుండా ఇది హైబీపీ రోగులకు దివ్య ఔషదంగా పని చేస్తుంది. ఇది తింటే గుండె జబ్బులు రాకుండా చూస్తుంది. అంతే కాకుండా ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇక దంతాలు కూడా స్ట్రాంగ్ గా ఉండేందుకు ఈ పండు ఉపయోగపడుతుంది. దాంతో పాటు ఈ పండును తింటే చాలా సేపు కడుపు నిండుగా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. దాంతో ఎక్కువగా ఆకలి వేయదు. కాబట్టి ఈజీగా బరువు తగ్గే అవకాశాలు ఉంటాయి. ఇందులో చాలా తక్కువ కేలరీలు, కొవ్వు ఉంటుంది. ఫిట్‌నెస్‌కు ఉపయోగపడుతుంది. దీంతో వచ్చే మరో ప్రయోగం ఏంటేంటే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.

Fruit ఈ ఒక్క పండు తింటే చాలు ఎన్ని లాభాలున్నాయో తెలిస్తే వదలరు

Fruit : ఈ ఒక్క పండు తింటే చాలు.. ఎన్ని లాభాలున్నాయో తెలిస్తే వదలరు..!

ఈ పండులో లారిక్ యాసిడ్ మన జుట్టు మూలాలను బలంగా చేస్తుంది. దీంతో జుట్టు పెరుగుదలకు దోహదం చేస్తుంది. దాంతో పాటు ఇదివరకే చెప్పుకున్న క్యాల్షియం, విటమిన్ బి, జింక్ లాంటి పోషకాలు జుట్టు, చర్మ ఆరోగ్యాన్ని కాపాడేందుకు సాయం చేస్తుంటాయి. అంతే కాకుండా షుగర్ పేషెంట్లకు చెక్కర స్థాయిలను తగ్గించడంలో సాయం చేస్తుంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది