Fruit : కోసిన పండ్లని ఎంత సేపట్లో తినాలి.. లేట్‌గా తింటే ఏంటి సమస్య?
ప్రధానాంశాలు:
Fruit : కోసిన పండ్లని ఎంత సేపట్లో తినాలి.. లేట్‌గా తింటే ఏంటి సమస్య?
Fruit : పండ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న విషయం అందరికీ తెలిసిందే. వీటిలో విటమిన్లు, మినరల్స్, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ప్రతిరోజూ ఆహారంలో పండ్లను చేర్చుకోవడం ద్వారా రోగనిరోధక శక్తి పెరగడం సహా అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. అయితే పండ్లను కోసిన తర్వాత ఎంతసేపట్లో తినాలి? వాటిని ఎలా నిల్వ చేయాలి? అనే విషయాల్లో చాలా మందికి అవగాహన లేకపోవచ్చు.

Fruit : కోసిన పండ్లని ఎంత సేపట్లో తినాలి.. లేట్‌గా తింటే ఏంటి సమస్య?
Fruit : నష్టాలేంటి?
ఆరోగ్య నిపుణుల చెబుతున్న వివరాల ప్రకారం, కోసిన పండ్లను అరగంట నుంచి గరిష్ఠంగా ఒక గంట లోపల తినడం ఉత్తమం. అంతకుమించి వాటిని నిల్వ చేస్తే న్యూట్రిషనల్ విలువలు తగ్గిపోతాయి. ముఖ్యంగా వేసవి, వర్షాకాలాల్లో బాక్టీరియా, సూక్ష్మజీవుల వృద్ధి వేగంగా జరుగుతుంది. ఫ్రిజ్‌లో ఉంచినా కూడా కొన్ని గంటల లోపే అవి పాడయ్యే అవకాశముంది.
వాటిని ముందుగానే కోసి ఆఫీసులకు, ప్రయాణాలకు తీసుకెళ్తే గాలి, వెలుతురు వల్ల న్యూట్రియెంట్లు ఆక్సిడైజ్ అవుతాయి. దీంతో పోషకాలు తగ్గిపోవడమే కాకుండా, ఇన్ఫెక్షన్‌కు అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఫ్రెష్‌గా కోసిన వెంటనే తినడం ఉత్తమం. ఉదయం ఖాళీ కడుపుతో కొన్ని పండ్లను తినడం ఆరోగ్యానికి మంచిదే.కానీ, నిమ్మకాయ, మామిడి, సిట్రస్ పండ్లు వంటి ఆమ్లపదార్థాలున్న పండ్లను ఖాళీ కడుపుతో తినకూడదు.రాత్రివేళలలో ఎక్కువగా షుగర్ కంటెంట్ ఉన్న పండ్లను తినడం గ్యాస్, అసిడిటీ సమస్యలకు దారి తీయవచ్చు. కోసిన వెంటనే తినడం ద్వారా పండ్లలోని పూర్తి పోషకాలను పొందొచ్చు. ఆలస్యం చేస్తే ఆరోగ్యానికి ముప్పుగా మారే ప్రమాదమూ లేకపోలేదు.