Fruit : కేవలం పండులో మాత్రమే కాదు… తొక్కలో కూడా ఎన్నో పోషకాలు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Fruit : కేవలం పండులో మాత్రమే కాదు… తొక్కలో కూడా ఎన్నో పోషకాలు…!

Fruit : మన రోజు వారి జీవితంలో ఎన్నో రకాల పండ్లను తింటూ ఉంటాం. అయితే ఈ పండ్లు అనేవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మనం తీసుకునే ఆహారంలో ప్రతినిత్యం పండ్లను తీసుకోవడం వలన ఎన్నో రకాల వ్యాధుల నుండి ఉపశమనం కలుగుతుంది. అయితే మనం అందరం దాదాపుగా పండ్లను తీసుకుంటూ ఉంటాం. కానీ అలా చేయడం తప్పు అని పోషకాహార నిపుణులు అంటున్నారు. నిజం చెప్పాలంటే,కొన్ని రకాల […]

 Authored By ramu | The Telugu News | Updated on :24 July 2024,9:00 am

ప్రధానాంశాలు:

  •  Fruit : కేవలం పండులో మాత్రమే కాదు... తొక్కలో కూడా ఎన్నో పోషకాలు...!

Fruit : మన రోజు వారి జీవితంలో ఎన్నో రకాల పండ్లను తింటూ ఉంటాం. అయితే ఈ పండ్లు అనేవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మనం తీసుకునే ఆహారంలో ప్రతినిత్యం పండ్లను తీసుకోవడం వలన ఎన్నో రకాల వ్యాధుల నుండి ఉపశమనం కలుగుతుంది. అయితే మనం అందరం దాదాపుగా పండ్లను తీసుకుంటూ ఉంటాం. కానీ అలా చేయడం తప్పు అని పోషకాహార నిపుణులు అంటున్నారు. నిజం చెప్పాలంటే,కొన్ని రకాల పండ్ల తొక్కలు కూడా మన ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి అని అంటున్నారు. అవి ఏమిటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. కివి పండు : ఈ పండు ఖరీదు ఎక్కువే. కానీ దీని ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం చాలా అధికంగా ఉంటాయి. ముఖ్యంగా ఈ కివి పండు డెంగ్యూ బాధితుల ప్లేట్ లైట్ సంఖ్య పెరిగేందుకు తప్పకుండా తీసుకోవాలి అని వైద్యులు చెబుతూ ఉంటారు. కానీ ఈ పండు తొక్క మాత్రం గరుకుగా మరియు దృఢంగా ఉంటుంది. కాబట్టి దీనిని తినటానికి ఎవరు ఇష్టపడరు. కానీ ఈ కివి పండు తొక్కలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్స్, విటమిన్ సి అధికంగా లభిస్తాయి. నిజం చెప్పాలంటే దానిపై తొక్క, గుజ్జు కంటే కూడా ఎక్కువ పోషకాలను కలిగి ఉంటుంది…

Fruit  : డ్రాగన్ ఫ్రూట్

ప్రస్తుతం బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన డ్రాగన్ ఫ్రూట్ తొక్కను తీసేసి మనం తింటూ ఉంటాం. కానీ ఈ డ్రాగన్ ఫ్రూట్ తొక్క కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఈ తొక్కలో అధిక మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్లు,ఫైబర్, బీటాసైనిన్ లు ఉన్నాయి. దీనిలో ఆంథోసైనిన్ లు కూడా ఉన్నాయి. ఇవి బరువు తగ్గటానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ డ్రాగన్ ఫ్రూట్ తొక్కలో ఉన్నటువంటి డైటరీ ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. అలాగే కొలెస్ట్రాల్ లేవల్స్ ను కూడా నియంత్రిస్తుంది…

పియర్ : ఈ పండును తింటూ ఉంటే యాపిల్ పండు తిన్న అనుభూతి కలుగుతుంది. ఈ పండు ఎంతో రుచిగా ఉంటుంది. ఈ పండును తీసుకోవడం వలన కొలెస్ట్రాల్, మలబద్ధకం, మధుమేహం, క్యాన్సర్ లాంటి వ్యాధులను దూరంగా ఉంచుతుంది. అయితే ఈ పియర్ పండు తొక్కలో ఎన్నో పోషకాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ లు ఉన్నాయి. ఇవి ఎన్నో దీర్ఘకాలిక సమస్యలను కూడా నియంత్రిస్తుంది. ఈ పియర్ పండు తొక్కలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది కడుపు నిండిన అనుభూతిని ఇస్తుంది. దీనివల్ల మీరు ఎక్కువగా ఆహారం తినకుండా ఉంటా.

Fruit కేవలం పండులో మాత్రమే కాదు తొక్కలో కూడా ఎన్నో పోషకాలు

Fruit : కేవలం పండులో మాత్రమే కాదు… తొక్కలో కూడా ఎన్నో పోషకాలు…!

జామకాయ : ఈ జామ పండు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే మరియు చౌకైన పండు. సాధారణంగా ఈ పండును తొక్కతోనే తింటూ ఉంటారు. అయితే ఈ జామ పండు తొక్కలో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఇది మన చర్మ కణాలను ఎంతగానో పునరుత్పత్తి చేస్తుంది. అలాగే ఫ్రీ రాడికల్స్ తో కూడా పోరాడుతుంది. అంతేకాక చర్మం మరియు జుట్టుకు కూడా ఎన్నో పోషకాలను ఇస్తుంది. ఈ జామ తొక్క అనేది మన చర్మన్ని ఎంతో అందంగా మరియు ప్రకాశవంతంగా మెరిసేలా చేస్తుంది. అంతేకాక చర్మం పై ఉన్నటువంటి మచ్చలను కూడా నియంత్రిస్తుంది. అలాగే మొటిమలను కూడా తగ్గిస్తుంది…

ఆపిల్ : మనలో చాలామంది యాపిల్ పండును తొక్కతో తింటారు. అయితే మరి కొంతమందిని తొక్క తీసేసి తింటారు. కానీ మీరు ఇలా చేయటం వలన ఎన్నో పోషకాలను కోల్పోయిన వారు అవుతారు. యాపిల్ పండు తొక్కలో విటమిన్ ఏ సి కె సమృద్ధిగా ఉంటాయి. ఈ పండులో పొటాషియం, భాస్వరం,కాల్షియం కూడా ఉన్నాయి. ఇది మన మొత్తం ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా పని చేస్తాయి…

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది