Health Benefits : జాక్ ఫ్రూట్ విత్తనాల్లో పోషకాలు పుష్కలం.. వాళ్లు తప్పనిసరిగా తినాలి
Health Benefits :పనస పండు అనగానే మనకు పెద్ద పండు గుర్తుకొస్తుంది. ఇది ఎంత పెద్దగా ఉంటుందో అంతే ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. పైన పచ్చని రంగు లోపల పసుపు రంగు తొనలతో ఉండే పనస చూడగానే లాగించేస్తారు. ఎంతో తియ్యగా ఉండే ఈ పండు రుచి కూడా కాస్త భిన్నంగా ఉంటుంది. ఇతర పండ్లతో పోలిస్తే భిన్నమైన ఆరోగ్య ప్రయోజనాలు పనస పండులో ఉన్నాయి. సౌత్ ఇండియాలో విరివిగా దొరికే ఈ పండు ఎన్నో అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. పనస పండు తినడానికే కాకుండా అనేక రకాల వంటల్లోనూ ఉపయోగిస్తారు.పోషక విలువలు అధికంగా ఉన్న పనస పండుతో ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇతర పండ్ల తో పోలిస్తే పనస పండులో అధికంగా ప్రోటీన్స్ ఉంటాయి.
విటమిన్ ఏ, విటమిన్ సీ, రిబోఫ్లావిన్, మెగ్నీషియం, పొటాషియం, కాపర్, మ్యాంగనీస్, ఫైబర్, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. వీటితో పాటు శరీరానికి అవసరమైన కేలరీలను అందిస్తుంది. పనసలో అనేక రకాల యాంటీఆక్సిడెంట్లు ఉండడం వల్ల గుండె జబ్బులు, డయాబెటిస్ వంటి అనేక దీర్ఘకాలిక వ్యాధులను నివారిస్తుంది.చాలా మంది పనస పండుని తిని విత్తనాలని పారేస్తుంటారు. ఇకపై అలా చేయకండి ఎందుకంటే రైబోఫ్లేవిన్, థియామిన్ అనే పోషకాలు పనస విత్తనాలలో పుష్కలంగా ఉంటాయి. ఇవి మనం తీసుకునే ఆహారాన్ని శక్తిగా మార్చేందుకు ఉపయోగపడతాయి. అలాగే జీర్ణ క్రియ తేలికవుతుంది. రక్తంలో షుగర్ లెవల్స్ ని అదుపులో ఉంచుతుంది.
కళ్లను, చర్మాన్ని అలాగే జుట్టును ఆరోగ్యంగా ఉంచేందుకు ఈ పోషకాలు ఉపయోగపడతాయి. పనస విత్తనాలలో చిన్నమొత్తంలో మెగ్నీషియం, జింక్, పొటాషియం, ఐరన్, కేల్షియం అలాగే కాపర్ వంటి మినరల్స్ కూడా ఉంటాయి. అలాగే ఆహారం ద్వారా సంభవించే అనారోగ్య సమస్యలకు దారితీసే బాక్టీరియల్ కంటామినేషన్ ను అరికట్టే యాంటీ మైక్రోబయాల్ కాంపౌండ్స్ ఇందులో ఉన్నాయి. ఈ విత్తనాల్లో ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల హిమోగ్లోబిన్ పెరిగి రక్త హీనతను కూడా తగ్గిస్తుంది.పనస విత్తనాలలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభిస్తాయి. ఈ విత్తనాలలో లభించే యాంటీ ఆక్సిడెంట్స్ శరీరాన్ని ఫ్రీ రాడికల్ డేమేజ్ నుంచి రక్షిస్తాయి. పనస విత్తనాలలో క్యాన్సర్ కు వ్యతిరేకంగా పోరాడే గుణాలు కలవు.