Health Benefits : ఈ ఒక్కటి చేసి చూడండి చాలు. అద్భుతమైన ఎనిమిది లాభాలు…
Health Benefits : ఆరోగ్యవంతమైన జీవితం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం.. ప్రస్తుతం ఉన్న జీవనశైలి విధానంలో ఎన్నో రోగాల బారిన పడుతూ ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటివన్నీ తగ్గించుకోవడం కోసం ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే మనిషి యొక్క జీవితం ఎటువంటి రోగాల బారిన పడకుండా ఉండడానికి ఈ ఒక్కటి చేస్తే చాలు… 8 లాభాలు ఉంటాయి. ప్రాచీన కాలంలో ఋషులు ఆనాడే చెప్పారు. ప్రాణాయామం ఎంత గొప్పది అనేది తెలియజేశారు. అప్పుడు ఋషులు నిత్యము ఒక 30 నిమిషాల పాటు ప్రాణాయామం చేసి మిగతా ఆసనాలు చేసేవారట. అందుకే వారు 150 సంవత్సరాల వరకు బ్రతికే వారట. ఈ విధంగా ప్రతినిత్యము ప్రాణాయం చేయడం వలన ఒత్తిడిని తగ్గించి మనిషిని యాక్టివ్ చేస్తుంది. అలాగే ఈ విధంగా చేయడం వలన సుఖమైన నిద్ర పట్టడానికి చాలా బాగా సహాయపడుతుంది.
ఇంకొకటి శ్వాస కోశాలను శుభ్రపరిచి అదుపులో ఉంచుతుంది. ఈ విధంగా అదుపులో ఉండడం వలన మనసుకి ప్రశాంతత పొందుతారు. ఇంకొకటి ప్రధానమైనది కొన్ని సెకండ్లు పాటు శ్వాసను తీసుకోకపోతే మనం తట్టుకోలేము అలాగే కొన్ని రోజులపాటు ఆహారం తీసుకోకుండా ఉండగలం. కాబట్టి మనిషి జీవితం అంతా శ్వాస మీద ఆధారపడి ఉంటుంది. దాని సక్రమంగా తీసుకోడాన్ని ప్రాణాయామం అని అంటారు. కాబట్టి ఆక్సిజన్ మన బాడీ లోకి అవసరమైనంత చేరుతుంది ఈ ప్రాణాయామం వలన శరీరంలో ఉన్న ప్రతి ఒక్క అణువు ఉత్సాహంగా పనిచేస్తుంది. దీనివలన ఆయుర్దాయం కూడా పెరుగుతుంది. అందుకే ఆనాటి ఋషులు నిత్యము ప్రాణాయం చేయడం వలన ఎక్కువ సంవత్సరాలు జీవించి ఉండేవారట. అలాగే ఇంకొక లాభం ఈ విధంగా ప్రాణాయం చేయడం వలన రక్త ప్రసరణ కంట్రోల్లో ఉంటుంది. ఎందుకనగా శ్వాస అనేటువంటిది మనసుకి బ్లడ్ కి సంబంధం ఉంటుంది. కాబట్టి రక్త ప్రసరణ సరిగా జరుగుతుంది.
ఈ విధంగా నిత్యము ప్రాణాయామం చేసినట్లయితే రక్తంలో ఆక్సిజన్ మోతాదు ఎక్కువగా ఉండి కార్బన్డయాక్సైడ్ బయటికి వెళ్ళిపోతుంది. అలాగే ఇంకొక ప్రయోజనం: మనిషి మెదడుని ఉత్సాహంగా ఉంచడానికి యాక్టివ్ గా ఆలోచన చేయడానికి తర్కం నిర్ణయం తీసుకోవడానికి, ఈ వ్యాయామం చేయడం వలన చాలా బాగా మన మెదడుని ఇంప్రూవ్మెంట్ చేస్తుంది. అలాగే ఇంకొక ప్రయోజనం: ఈ విధంగా వ్యాయామం చేసినట్లయితే మనసుని కంట్రోల్ లో ఉంచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది చెడు అలవాట్లను చెడు ఆలోచనలను పైన కంట్రోల్ చేసి మంచిగా ఉండేలా ఉపయోగపడుతుంది. ఈ ప్రాణాయము వలన ఎన్నో ఉపయోగాలు ఉంటాయని ఆనాడే ఋషులు తెలియజేశారు. ప్రస్తుతం దీనిని సైంటిఫిక్ గా కూడా ఆధ్యాయంలో తెలిపారు. ఇక ఇలా చేయడం వల్ల మనిషి ఎగ్జిట్అవ్వకుండా డిప్రెషన్ కి గురికాకుండా ఉంటారు. బ్రెయిన్ చాలా యాక్టివ్గా ఉంచుతుంది మతిమరుపు కూడా రాదు. ఇలా ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. ఈ ప్రాణాయామం. అయితే ఇది వయసు తరహా లేకుండా అందరూ ఈ వ్యాయామం చేసుకోవచ్చు. ఈ విధంగా చేసినట్లయితే ఆరోగ్యవంతమైన జీవితం మీ సొంతం అవుతుంది.