Summer Drinks : సమ్మర్ లో ఈ ఒక్క డ్రింక్ తాగితే చాలు… మధుమేహాన్ని కంట్రోల్ చేస్తుంది…! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Summer Drinks : సమ్మర్ లో ఈ ఒక్క డ్రింక్ తాగితే చాలు… మధుమేహాన్ని కంట్రోల్ చేస్తుంది…!

summer drinks  : ప్రస్తుతం మనం జీవించే జీవనశైలి విధానంలో ఎన్నో మార్పుల వలన చాలామంది షుగర్ వ్యాధితో ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు డిహైడ్రేషన్ కారణంగా బ్లడ్ షుగర్ లెవెల్స్ అధికమవుతున్నాయి.. ఈ షుగర్ ను కంట్రోల్ చేసే బెస్ట్ సమ్మర్ డ్రింక్ ఏంటో ఇప్పుడు మనం చూడబోతున్నాం.. దాహం తీరడానికి కూల్డ్రింక్లు, జ్యూస్ లు, సోడాలు అధికంగా తాగుతూ ఉంటారు.. మండే వేసవిలో చల్ల చల్లని డ్రింక్ తాగితే మనసుకు శరీరానికి […]

 Authored By aruna | The Telugu News | Updated on :20 May 2023,2:30 pm

summer drinks  : ప్రస్తుతం మనం జీవించే జీవనశైలి విధానంలో ఎన్నో మార్పుల వలన చాలామంది షుగర్ వ్యాధితో ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు డిహైడ్రేషన్ కారణంగా బ్లడ్ షుగర్ లెవెల్స్ అధికమవుతున్నాయి.. ఈ షుగర్ ను కంట్రోల్ చేసే బెస్ట్ సమ్మర్ డ్రింక్ ఏంటో ఇప్పుడు మనం చూడబోతున్నాం..

దాహం తీరడానికి కూల్డ్రింక్లు, జ్యూస్ లు, సోడాలు అధికంగా తాగుతూ ఉంటారు.. మండే వేసవిలో చల్ల చల్లని డ్రింక్ తాగితే మనసుకు శరీరానికి చాలా ప్రశాంతంగా ఉంటుంది. అయితే ఇవి ఎక్కువగా తాగితే ఆరోగ్యం పాడవుతుంది. ముఖ్యంగా మధుమేహం వ్యాధిగ్రస్తులు తాగితే చాలా డేంజర్. ఈ డ్రింక్ కారణంగా రక్తంలో షుగర్ లెవెల్స్ అధికమవుతాయి. మధుమేహం కంట్రోల్లో ఉంచుకోవడానికి మీ ఆహార, పానీయాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. వేసవిలో చెమటలు పట్టడం, శరీరంలో నీరు లేకపోవడం వలన మీ బ్లడ్ లో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. ఈ సీజన్లో డీహైడ్రేషన్కు చెక్ పెట్టడానికి బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ను కంట్రోల్లో ఉంచుకోవడానికి ఆయుర్వేద డయాబెటిక్ న్యూట్రీషియన్ శివాని పోతే దార్ కొన్ని డ్రింక్స్ ను చెప్పడం జరిగింది. అదేంటో ఇప్పుడు మనం చూద్దాం…

Summer Drinks

Summer Drinks

సత్తు డ్రింక్స్: ఈ డ్రింక్స్ లో గ్లైసోమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటాయి. దీనిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది గ్లూకోజ్ ను తగ్గిస్తుంది.. షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేస్తుంది.. ముందుగా మిక్సీలో శనగలు వేసి పొడి చేసుకోవాలి. పెద్ద గ్లాసులో సెనగల పొడి, ఉప్పు, జీలకర్ర పొడి వేసి నిమ్మరసం పిండాలి. చల్లటి నీళ్ళు పోసి చివరగా పుదీనా ఆకులును నలిపి వేయాలి..

స్ట్రాబెరీ ,చియా స్మూతీ

ఈ చియ గింజల్లో ఫైబర్ ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్, క్యాల్షియం, మెగ్నీషియం, లాంటి ప్రధానమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది మధుమేహ సమస్యలు తగ్గించడానికి ఉపయోగపడుతుంది.

జీడిపప్పు పాలు

జీడిపప్పు పాలు తాగితే రక్తంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి. జీడిపప్పులోని యాసిడ్ అనే సమ్మేళనం బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంచుతాయి..

కొబ్బరి పాలు

కొబ్బరి పాలలో గ్లైసోమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఇది షుగర్ వ్యాధిగ్రస్తులకి మేలు చేస్తుంది. దీనిలో ఎన్నో రకాల ఖనిజాలు, విటమిన్లు, ప్రోటీన్లు ఆరోగ్యకరమైన పువ్వులు పుష్కలంగా ఉంటాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు కొబ్బరి పాలు తాగితే బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి.

బాదం పాలు

బాదం పాలను ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. ఈ బాదంపాలు మీ బ్లడ్ లో షుగర్ లెవెల్స్ పెంచవు.. బాదంలో ప్రోటీన్లు, కొవ్వులు, ఫైబర్ అధికంగా ఉంటాయి. టైప్ టు షుగర్ ఉన్నవారు బాదం తీసుకుంటే బ్లడ్ షుగర్ కంట్రోల్ లో ఉంటాయి. ఇన్సులిన్ నిరోధకత తగ్గిస్తుంది. బ్లడ్ లో షుగర్ లెవెల్స్ నియంత్రణ మెరుగు అవుతుంది..

Also read

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది