Kiwi Fruit : ఇది గనక రోజుకి ఒకటి తింటే మీ వ్యాధులన్నీ మాయం… 100 ఏళ్ళు బ్రతుకుతారు…!
ప్రధానాంశాలు:
Kiwi Fruit : ఇది గనక రోజుకి ఒకటి తింటే మీ వ్యాధులన్నీ మాయం... 100 ఏళ్ళు బ్రతుకుతారు...!
Kiwi Fruit : ఈ గజిబిజి జీవితంలో మనుషులకు తినడానికి కూడా అస్సలు సమయం లేకుండా పోయింది. అలాగే దీనికి తోడు ఆరోగ్యానికి మంచి చేసే పండ్లను తినడమే వారు మర్చిపోయారు. కానీ మన ఆరోగ్యానికి పండ్లు ఎంతగానో మేలు చేస్తాయి. అందులో కివి పండ్లు తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు అన్నీ కూడా చాలా ఈజీగా తగ్గుతాయి. కివి పండు చాలా మందికి తెలియదు. కొందరికి తెలిసిన దాన్ని తినడానికి ఇష్టపడరు. ఈ కీవి లో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలిస్తే వెంటనే తినడం మొదలుపెడతారు. కివి పండుతో రక్తంలోని ప్లేట్లెట్ల సంఖ్య పెరుగుతుంది. ఈ పండులో ఉండే శక్తివంతమైన ఆంటీ ఆక్సిడెంట్స్ రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఈ పండు పలు అనారోగ్యాలకు కూడా సూపర్ మెడిసిన్ గా పని చేస్తుంది. మధుమేహం, గుండె జబ్బులు నిద్రలేమి తో బాధపడే వారికి కివి పండు దివ్య ఔషధంగా పనిచేస్తుంది. ఈ కివి పండును తినటం వల్ల మనలో విటమిన్ సి లోపం ఏర్పడే అవకాశం లేదు.
విటమిన్ సి లోపం ఏర్పడకూడదు అంటే ప్రతిరోజు కూడా ఒక కివి పండును తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇక ఈ పండులో పోషకాలు చాలా పుష్కలంగా ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని కూడా బాగా పెంచుతుంది. అలాగే రోగనిరోధక శక్తిని కూడా బలోపేతం చేస్తుంది. ఈ కివిని సీజన్ తో సంబంధం లేకుండా తినొచ్చు. కివిని తినడం వల్ల మీ రోగనిరోధక వ్యవస్థ బాగా బలోపేతం అవుతుంది. దీంతో మీరు ఎన్నో రకాల వ్యాధులతో పోరాడవచ్చు.. మరెన్నో సమస్యల నుంచి కూడా బయటపడటానికి రోగనిరోధక శక్తి ఎంతో అవసరం కూడా.. అందుకే రోజుకు ఒక కివిని తిని రోగనిరోధక శక్తిని ఎక్కువగా పెంచుకోవచ్చు. హార్ట్ ప్రాబ్లమ్స్, అధిక రక్తపోటు ఇంకా అలాగే డయాబెటిస్ ఉన్నవారికి కూడా కివి పండ్లు ఎంతో మేలు చేస్తాయి. వీటిని తినడం వల్ల ఈ సమస్యలు చాలా ఈజీగా తగ్గుముఖం పడతాయి.
అలాగే కివి తినటం వల్ల చర్మంపై ముడతలు తొలగిపోవడంతో పాటుగా స్కిన్ చాలా కాంతివంతంగా తయారవుతుంది. అందుకే వీటిని తరచుగా తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అల్సర్లు ఇంకా అలాగే కడుపులో ఉండే వేడి వంటి అనారోగ్య సమస్యలను కూడా తగ్గించడంలో ఈ కివి పండు ఉపయోగపడుతుంది. కివిలో పోలిక్ యాసిడ్ ఇంకా అలాగే ఐరన్ వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇది గర్భిణీలకు కూడా చాలా ప్రయోజనక కారంగా ఉంటుంది. ఇక వీటిని తినడం వల్ల తల్లి బిడ్డ ఇద్దరు కూడా చాలా ఆరోగ్యంగా ఉంటారు..