Uterine Fibroids : స్త్రీలకు గర్భాశయంలో గడ్డలు ఏర్పడితే వీరికి సంతాన భాగ్యం ఉండదా… లక్షణాలు.. దీన్ని ఎలా నివారించాలి…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Uterine Fibroids : స్త్రీలకు గర్భాశయంలో గడ్డలు ఏర్పడితే వీరికి సంతాన భాగ్యం ఉండదా… లక్షణాలు.. దీన్ని ఎలా నివారించాలి…?

 Authored By ramu | The Telugu News | Updated on :11 March 2025,11:15 am

ప్రధానాంశాలు:

  •  Uterine Fibroids : స్త్రీలకు గర్భాశయంలో గడ్డలు ఏర్పడితే వీరికి సంతాన భాగ్యం ఉండదా... లక్షణాలు.. దీన్ని ఎలా నివారించాలి...?

Uterine Fibroids స్త్రీలకు గర్భాశయంలో గడ్డలు ఏర్పడితే వీరికి సంతాన భాగ్యం ఉండదా లక్షణాలు దీన్ని ఎలా నివారించాలి

Uterine Fibroids : స్త్రీలకు గర్భాశయంలో గడ్డలు ఏర్పడితే వీరికి సంతాన భాగ్యం ఉండదా… లక్షణాలు.. దీన్ని ఎలా నివారించాలి…?

Uterine Fibroids : ప్రస్తుత కాలంలో మహిళలు గర్భాశయ క్యాన్సర్లు సంఖ్య నానాటికి పెరుగుతూనే ఉంది. గర్భాశయంలో గడ్డలు మాదిరిగా ఏర్పడతాయి. ఈ గడ్డలనే ఫైబ్రాయిడ్స్ అని కూడా అంటారు. స్త్రీలు ఎక్కువగా ఈ సమస్యను ( uterine Fibroids) ఎదుర్కొంటున్నారు. గర్భాశయంలో ఈ గడ్డలు ఏర్పడితే త్రీవ ఇబ్బందులను ఎదురుకోవాల్సి ఉంటుంది. ప్రెగ్నెన్సీ సమయంలో, 40 సంవత్సరాల వయసు దాటిన తరువాత, ఈ సమస్య వచ్చే ప్రమాదం ఉంది. ఇంకా ఈ గడ్డలనే క్యాన్సర్ గణితగా కూడా భావించి ఆందోళన చెందుతారు.
నిజానికి ఇవి క్యాన్సర్ కనితులు కావు, ఫైబ్రాయిడ్స్ లక్షణాలు బయటకు కనిపించకపోవడంతో చాలామంది ఈ సమస్యను తొలి దశలో గుర్తించలేకపోతున్నారు. కనితుల సైజు పెరిగి ఇబ్బందులకు గురి అయ్యే సమయంలో దీని గుర్తించి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అసలు ఈ పైబ్రాయిడ్స్ ని ఎలా గుర్తించాలి..? ఇవి ఎందుకు ఏర్పడతాయి, వీటి నివారణకు ఏం చేయాలి..? అనే విషయంపై వైద్యులు ఏం చెబుతున్నారు..

Uterine Fibroids : గర్భాశయం లో ఫైబ్రాయిడ్స్ లక్షణాలు :

గర్భాశయంలో ఈ ఫైబ్రాయిడ్స్ లక్షణాలు ప్రత్యేకంచి కనపడవు. కొంతమంది మహిళకు ఫైబ్రాయిడ్స్ ఉన్నాయని విషయం అసలు గుర్తించలేరు. వారికి ఉన్నాయి అనే విషయం కూడా తెలియదు. కానీ, కొన్ని సందర్భాల్లో వీటి వల్ల కొన్ని ఇబ్బందులు, లక్షణాలు కూడా కనబడతాయి. ఎలా అంటే, మహిళలకు పీరియడ్స్ టైం లో ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది. ఎక్కువ రోజులు పీరియడ్స్ అవుతూనే ఉంటుంది. దీనివల్ల ఒత్తిడి, పొత్తి కడుపు నొప్పి, తరచూ మూత్ర విసర్జన. సంభోగం సమయంలో నొప్పి, వంటివి వస్తాయి. ఈ త్రీవ్రమైన సందర్భాల్లో ఫైబ్రాయిడ్స్ లు గర్భస్రావం లేదా అకాల ప్రసవానికి కూడా దారితీస్తాయి. ఫైబరాయిడ్ల సంఖ్య, సైజు, వాటి స్థానాన్ని బట్టి లక్షణాలు తీవ్రంగా ఉంటాయి.

Uterine Fibroids : ఫైబ్రాయిడ్లు ఏర్పడుటకు కారణాలు:

గర్భాశయంలో ఫైబరాయిడ్ లో ఏర్పడటానికి గల కారణం కచ్చితంగా నిరూపించబడలేదు. అయితే, అనేక అంశాలు వీటి పెరుగుదలకి పోషిస్తుంటాయి. జన్యు పరమైన కారణాలు, కుటుంబాల వారసత్వంలో ఇవి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్, హార్మోన్లు కూడా ఫైబ్రాయిడ్ల పెరుగుదలను ప్రేరేపిస్తాయి.
వీటి విడుదల తక్కువ అయినప్పుడు తిరిగే సాధారణ స్థితిలోకి వస్తాయి. ఉబకాయం, ఫాస్ట్ ఫుడ్లను ఎక్కువగా తినడం. ఫ్రూట్స్, వెజిటేబుల్స్ తక్కువగా తినడం, ఎర్లీ మినిస్ట్రీయేషన్ వంటివి ఫైబ్రాయిడ్ ల వృద్ధిని పెంచుతాయి. ఆఫ్రికన్- అమెరికన్ మహిళలలో సమస్యలు ఎక్కువగా తలెత్తుతాయి.

Uterine Fibroids : గర్భాశయ ఫైబ్రాయిడ్ల నివారణ :

గర్భాశయములో ఫైబ్రాయిడ్లు ఒక్కసారి ఏర్పడితే వాటి పెరుగుదలను నియంత్రించలేము. అయితే, జీవనశైలిలో మార్పులు పరిస్థితిని కంట్రోల్ చేస్తాయి. నేను అధిగమించాలంటే క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయాలి, ఆరోగ్యకరమైన జీవనశైలి విధానాన్ని పాటించాలి, ఆహారపు అలవాట్లకి దూరంగా ఉండాలి. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, రెడ్ మీట్, ప్రాసెస్ మీట్లను లిమిట్ చేయడం వంటివి సమస్యలను తగ్గిస్తాయి. ఏమిటి ఎక్కువగా ఉంటే ఆహారాన్ని తింటే మరింత ప్రొటెక్షన్ ఉంటుందని చెబుతారు. అయితే, దీనిని నివారించడానికి మరిన్ని పరిశోధనలు జరగాల్సిందే.
ఫైబ్రాయిడ్స్ కి మూల కారణమైన ఈస్ట్రోజన్ హార్మోన్ ని కంట్రోల్ చేయడం ద్వారా ఈ సమస్యను నివారించవచ్చు. హార్మోన్ బర్త్ కంట్రోల్ మెథడ్స్, పిల్స్, గర్భాశయాంతర పరికరాలు(IUD) లా వంటి ఫైబర్ ఆడ్ల వల్ల కలిగే భారీ రక్తస్రావాన్ని తగ్గించవచ్చు. అందరికీ మోనోఫాస్ స్టేజ్ కి చేరుకున్నాక హెవీ బ్లీడింగ్ వంటివి ఫైబ్రాయిడ్స్ ల ప్రభావాలు తగ్గిపోతాయి.

Uterine Fibroids : ఇలా కూడా చేయవచ్చు :

మయో మెక్టమి, హిస్టేరెక్టమి వంటి వాటిలో ఫైబ్రైడ్లు కంట్రోల్ చేయవచ్చు. తీవ్రమైన లక్షణాలున్న మహిళలకు, GnRh అగోనిస్ట్స్, ప్రొజెస్టిన్లు వంటి మందులు వాడితే, ఈస్ట్రోజన్ స్థాయిలో తగ్గి కణితి పరిమాణం తగ్గుతుంది. యాంటీబయోటిక్ మందులతో, సందర్భాల సర్జరీల ద్వారా తొలగించాల్సి వస్తుంది, అయితే ఫైబ్రొఇడ్స్ నిర్నిత సైజు పెరిగితేనే వాటిని తీసివేయవచ్చు. ఫైబర్ ఆయిడ్స్ చిన్నవిగా ఉంటే, వాటితో పెద్దగా ఇబ్బందులు లేకపోతే, ఎలాంటి సర్జరీ అవసరం లేదు. మందుల ద్వారా తగ్గించుకోవచ్చు.

Advertisement
WhatsApp Group Join Now

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది