Health Benefits : భయంకరమైన కాళ్ల పగుళ్లను కూడా ఇట్టే మాయం చేసే రెండు చిట్కాలు..!
Health Benefits : చాలా మందికి సీజన్ మారగానే కాళ్లు పగలుతుంటాయి. పాదాలంతా పగిలి… నడవడానికి చాలా ఇబ్బంది పడిపోతుంటారు. అందులోంచి రక్తం కూడా వస్తుంటుంది. నొప్పి తట్టుకోలేక అడుగు తీసి అడుగు వేసేందుకు వణికిపోతుంటారు. ఈ సమస్యలు ఎక్కువగా ప్రతిరోజూ నీళ్లలో పనిచేసే వారికి లేదా పొలం పనులకు వెళ్లే వాళ్లలో కనిపిస్తుంటాయి. అయితే ఇప్పుడు మేం చెప్పబోయే రెండు చిట్కాలతో ఎంతటి పగుళ్లనైనా తగ్గించుకోవచ్చు. అయితే అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక గిన్నెలో గోరు వెచ్చటి నీటిని తీసుకోవాలి. అందులో ఒక స్పూన్ బేగింగ్ సోడా, ఒక షాంపూ ప్యాకెట్ వేయాలి. మీరు వాడే ఏ షాంపూ అయినా పర్లేదు. ఆ తర్వాత ఒక నిమ్మకాయ తీసుకొని దాని రసాన్నంతా ఈ మిశ్రమంలో పిండేయాలి.
ఈ తర్వాత బాగా కపిలి పాదాలను అందులో ఉంచాలి. అయితే నీరు మరీ వేడిగా ఉండకూడదు. ఎందుకంటే అసలే పగుళ్లు ఉన్న కాళ్లను అందులో పెడ్తే.. మంట పుడ్తుంది. అందుకే పాదాలు భరించగల్గినంత వేడి నీటిని మాత్రమే వాడాలి. ఇలా ఒక 30 నిమిషాల పాటు కాళ్లను అందులోనే ఉంచాలి. ఆ తర్వాత పుట్ స్క్రాపర్ మరియు ప్యూమిక్ స్టోన్లతో పాదాలను బాగా రుద్దాలి. అలా చేయడం వల్ల పాదాలపై ఉండే మృత కణాలు, దుమ్ము, ధూళి తొలగిపోతాయి. అంతేకాకుండా పగుళ్ల వద్ద ఉన్న మృత చర్మం పోయి పాదాల పగుళ్లు తగ్గేందుకు అవకాశం ఏర్పడుతుంది. తర్వాత పొడిగుడ్డతో పాదాలను మంచిగా తుడవాలి.ఆ తర్వాత ఫుట్ క్రీమ్ తయారు చేసుకొని పాదాలకు అప్లె చేసుకోవాలి. అయితే ముందుగా ఫుట్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలో మనం ఇప్పుడు చూద్దాం.
ముందుగా ఒక చిన్నె గిన్నెలో వ్యాజిలెన్ పెట్రోలియం జెల్ ను వేసుకోవాలి. ఇది అన్ని దుకాణాల్లో దొరుకుంతుంది. తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ వెజిటేబుల్ ఆయిల్ లేదా కొబ్బరి నూనె వేసుకోవాలి. ఆ తర్వాత ఒక విటామిన్ ఈ క్యాప్సిన్ వేసుకోవాలి. దీనికి బదులుగా బాదం నూనె, ఆముదం నూనె కూడా వాడుకోవచ్చు. తర్వాత చిటికెడు పసుపు వేసి పెట్రోలియం జెల్లీ కరిగేలా వేడి చేసుకోవాలి. అంటే వేడి నీటిలో ఈ గిన్నెని పెడ్తే సరిపోతుంది. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని బాగా కలిపి ప్రతిరోజూ పాదాలకు పూసుకోవాలి. ఇలా రోజు చేయడం వల్ల కాళ్ల పగులు తగ్గి మృదువుగా తయారవుతాయి. ఈ క్రీమ్ వల్ల పాదాలకు సరైన మోతాదులో తేమ అంది.. పాదులు ఆరోగ్యంగా, అందంగా ఉంటాయి.