Liver : కాలేయన్ని పాడు చేసే ఐదు అలవాట్లు ఏంటో తెలుసా…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Liver : కాలేయన్ని పాడు చేసే ఐదు అలవాట్లు ఏంటో తెలుసా…!

 Authored By ramu | The Telugu News | Updated on :26 August 2024,10:00 am

ప్రధానాంశాలు:

  •  Liver : కాలేయన్ని పాడు చేసే ఐదు అలవాట్లు ఏంటో తెలుసా...!

Liver  : మీరు అధికంగా బయట ఫుడ్ ను తింటున్నారా. అయితే మీ శరీరంలోకి ఎన్నో వ్యాధులు తొందర్లోనే ప్రవేశించే అవకాశం ఉంది. వాటిలో ఒకటి కాలేయ సమస్య కూడా. అయితే మన జీవనశైలి మరియు అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు మరియు బిజీగా ఉండటం, శరీరాన్ని నిర్లక్ష్యం చేయటం, ఎక్కువగా తాగడం ఇవన్నీ కూడా మీ శరీరంపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయో తెలుసా. ముఖ్యంగా చెప్పాలంటే. మీ కాలేయం మీద ఎక్కువగా ప్రభావం చూపుతాయి. అయితే ఇవన్నీ కూడా ప్యాటీ లివర్ మరియు లివర్ సిర్రోసిస్ లాంటి వ్యాధుల ప్రమాదాలను కూడా పెంచగలవు. అందుకే మీ కాలేయం ఎంతో ఆరోగ్యంగా ఉండాలి అంటే కొన్ని నియమాలను కచ్చితంగా పాటించాలి. లేకుంటే చాలా ప్రమాదం. అయితే మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వలన ఆరోగ్యంగా ఉండవచ్చు. అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం…

1. ట్రా న్స్ ఫ్యాట్లను నివారించండి : మన శరీరంలో కార్బోహైడ్రేట్లు మరియు ప్రోటీన్లు, కొవ్వులు సరైన సమతుల్యతను కలిగి ఉండడం ఎంతో అవసరం. అయితే రెస్టారెంట్ రెడ్ మీట్ మరియు అవుట్ డోర్ గ్రీల్స్ మరియు ప్యాకేజ్డ్, ప్రాసెస్డ్, ఫుడ్ ను ఎక్కువగా తినడం వలన కూడా శరీరంలో ఫ్యాట్ స్థాయి అనేది ఎంతగానో పెరుగుతుంది. అలాగే ఈ కొవ్వు అనేది కాలేయానికి ఎంత మాత్రం మంచిది కాదు అని అంటున్నారు వైద్య నిపుణులు. అలాగే కాలేయం చుట్టూ పేరుకుపోయినటువంటి కొవ్వు కాలేయ పని తిరుపై కూడా ప్రభావం చూపిస్తుంది. అంతేకాక ఆహారం లో ట్రాన్స్ ఫ్యాట్స్ చాలా తక్కువగా ఉండేలా చూసుకోండి…

2. రోజువారి ఆహారంలో చెక్కరను తగ్గించండి : ఎంతోమంది వ్యక్తులు స్లిమ్ గా ఉండడానికి వారు సొంత ఆహారాన్ని ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. అయితే చక్కెరను కూడా నివారించడానికి కృత్రిమ చక్కరపై ఆధారపడడం శరీరానికి ఎంతో ప్రమాదం. అంతేకాక అధిక చెక్కరను తీసుకునే అలవాటు ఉన్నటువంటి వారు వాళ్ళ కాలేయానికి విస్తృతమైన హాని అనేది కలుగుతుంది. అలాగే ప్రక్టోజ్ లేక కృత్రిమ చెక్కర కాలేయానికి ఎంతో ప్రమాదం…

3. పెయిన్ కిల్లర్స్ : పెయిన్ కిల్లర్ ను తీసుకోవడం గురించి మీరు కచ్చితంగా తెలుసుకోవాలి. ఇలా పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం వలన కాలేయం పై ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది. అంతేకాక టైలెనాల్ లేక కొలెస్ట్రాల్ మందులు కూడా కాలేయాన్ని ఎంతగానో దెబ్బతీసే ప్రమాదం ఉంటుంది. అందువల్ల ఔషధం తీసుకునే ముందు వైద్యులను కచ్చితంగా సంప్రదించాలి. అంతేకాక ఎంతో మంది ఇష్టం వచ్చినట్లుగా మందులను వేసుకుంటూ ఉంటారు. ఇలా చేయడం వలన కూడా మీ ఆరోగ్యానికి మంచిది కాదు అని అంటున్నారు నిపుణులు…

4. తగినంత నీరు తాగండి : మీరు మీ శరీరం నుండి ఎంత ఎక్కువ టాక్సిన్స్ ను బయటకు పంపగలిగితే అంత మంచిది. అప్పుడే మీ కాలేయం కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. అందుకే ఎక్కువ నీరుని తీసుకోవటం మంచిది. అలాగే మూత్రంతో శరీరం నుండి ట్యాక్సీన్స్ ను బయటకు పంపిస్తాయి. వీలైతే ఆ నీటిని వేడి చేసుకొని దానిలో కొద్దిగా నిమ్మరసం కలుపుకొని రోజుకు కొన్ని సార్లు తీసుకోవాలి. అలాగే పెరుగు లాంటి ప్రొబయోటిక్ ఆహారాలను తీసుకోవడం కూడా ఆరోగ్యానికి చాలా మంచిది..

Liver కాలేయన్ని పాడు చేసే ఐదు అలవాట్లు ఏంటో తెలుసా

Liver : కాలేయన్ని పాడు చేసే ఐదు అలవాట్లు ఏంటో తెలుసా…!

5. మానసిక ఆరోగ్యం కాపాడుకోవడం : డిప్రెషన్ మరియు ఆందోళన శరీరంలోని కార్టీసాల్ హార్మోన్స్ ను పెంచగలవు. అలాగే ఈ హార్మోన్ కాలేయాన్ని కూడా దెబ్బతీస్తుంది. అంతేకాక ఎంతో మంది ఒత్తిడి లేక డిప్రెషన్ నుండి బయట పడడం కోసం తినడం లేక తాగడం లాంటివి చేస్తూ ఉంటారు. అయితే ఈ పద్ధతి కూడా మంచిది కాదు అని అంటున్నారు నిపుణులు. అలాగే మీ కాలేయం ఎంతో ఆరోగ్యంగా ఉండాలి అంటే ముందు మీరు ఒత్తిడిని తగ్గించుకోవాలి…

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది