Immunity : చలికాలంలో ఇమ్యూనిటీని కోల్పోకుండా ఉండాలంటే …? మీ రోజు వారి దినచర్యలో వీటికి గుడ్ బై పలకండి…!
ప్రధానాంశాలు:
Immunity : చలికాలంలో ఇమ్యూనిటీని కోల్పోకుండా ఉండాలంటే ...? మీ రోజు వారి దినచర్యలో వీటికి గుడ్ బై పలకండి...!
చలికాలంలో వాతావరణం చాలా కూల్ గా ఉంటుంది. ఇలాంటి సమయంలో కొన్ని పానీయాలు తీసుకోవడం మంచిది కాదు. ఆ పానీయాల్లో ఒకటి పాలు. ఈ పాలు తీసుకోవడం అందరికీ ప్రయోజన ప్రయోజకరం కాదు. పాలు సీతలీకరణ ప్రభావాన్ని కలిగి ఉంటాయి. ఇది శరీరంలోని కఫాన్ని పెంచుతుంది. ముఖ్యంగా ఆస్తమా దగ్గుతో బాధపడేవారు చలికాలంలో పాలకు దూరంగా ఉండాలి. పాలు తాగాల్సి వస్తే బాగా మరిగించిన పాలను తాగాల్సి ఉంటుంది. వేడిగా ఉన్నప్పుడు కొద్ది కొద్దిగా తాగాలి. ఇంకా ఈ పాలలో మరిగేటప్పుడు మిరియాలు పొడి, సొంటి పొడి వేసి బాగా మరిగించాలి.
ఆ తరువాత వడకట్టి ఆ పాలను తాగాలి. శీతాకాలంలో వచ్చే దగ్గు కఫం నుండి ఉపశమనం పొందవచ్చు. చలికాలంలో కొందరు వెచ్చగా ఉండేందుకు ఆల్కహాల్ను ఎక్కువగా తీసుకోవడం జరుగుతుంది. ఇలా ఆల్కహాల్ ని ఎక్కువగా తీసుకోవడం వలన శరీరం డిహైడ్రేట్ అవుతుందని డాక్టర్ అరుణ్ చౌబే తెలిపారు. ఇది శరీరంలో నీటి పరిమాణాన్ని తగ్గించడమే కాకుండా. దీర్ఘకాలంలో మీ రోగనిరోధక శక్తిని కూడా ప్రభావితం చేస్తుంది. వింటర్ సీజన్లో ఎక్కువగా తీపి తినడం ఆరోగ్యానికి హానికరం. చక్కెర అధికంగా తినడం వల్ల బ్యాక్టీరియాతో పోరాడే శరీర సామర్ధ్యాన్ని తగ్గిస్తుంది.
ఇది జలుబు ఇతర వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. చలికాలంలో రెడీమేడ్, గుడ్లు వంటి ప్రోటీన్లను అధికంగా తీసుకోవడం వల్ల శేష్మం సమస్య పెరుగుతుంది. ఈ వింటర్ సీజన్ లో చేపలను ఆహారంగా తీసుకోవడం వలన ఆరోగ్యానికి చాలా మంచిది. వింటర్ సీజన్లో లభించని పండ్లను తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం. ఈ పండ్లను వాటి పోషక విలువలను కోల్పోవడమే కాకుండా, బాడీలో ఇన్ఫెక్షన్స్, చర్మవ్యాధులను కలుగజేస్తుంది.