Keera Fry Salad : ఈ కీరా ఫ్రైడ్ సలాడ్ ఎంత తిన్నా సరే బరువు పెరగరు.. పొట్ట కూడా తగ్గుతుంది..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Keera Fry Salad : ఈ కీరా ఫ్రైడ్ సలాడ్ ఎంత తిన్నా సరే బరువు పెరగరు.. పొట్ట కూడా తగ్గుతుంది..!!

Keera Fry Salad : కీరా దోస ఆరోగ్యానికి గొప్ప వరం. ఈ కీర దోసను నిత్యం ఆహారంలో చేర్చుకుంటే గొప్ప ప్రయోజనాలు పొందవచ్చు. ఈ కీరా తో సహజంగా సలాడ్లు చేసుకుని తింటూ ఉంటారు. అయితే ఇలా పచ్చిగా తినమంటే చాలామంది తినడానికి ఇష్టపడరు.. కీర అంటే జీరో క్యాలరీ వెజిటేబుల్. దీనిని ఫ్రై చేసినప్పుడు దీనిలో ఉన్న నీటి శాతం తగ్గి మనం వేసే పదార్థాల వలన దీని రుచి పెరుగుతూ ఉంటుంది. క్యాలరీలు […]

 Authored By prabhas | The Telugu News | Updated on :5 February 2023,9:00 pm

Keera Fry Salad : కీరా దోస ఆరోగ్యానికి గొప్ప వరం. ఈ కీర దోసను నిత్యం ఆహారంలో చేర్చుకుంటే గొప్ప ప్రయోజనాలు పొందవచ్చు. ఈ కీరా తో సహజంగా సలాడ్లు చేసుకుని తింటూ ఉంటారు. అయితే ఇలా పచ్చిగా తినమంటే చాలామంది తినడానికి ఇష్టపడరు.. కీర అంటే జీరో క్యాలరీ వెజిటేబుల్. దీనిని ఫ్రై చేసినప్పుడు దీనిలో ఉన్న నీటి శాతం తగ్గి మనం వేసే పదార్థాల వలన దీని రుచి పెరుగుతూ ఉంటుంది. క్యాలరీలు పెరగవు. పొట్ట నిండిన ఫీలింగ్ ఉంటుంది. అలాగే మంచి ఫైబర్, చాలా రకాల పోషకాలు అలాగే మినరల్స్ కూడా ఉంటాయి. కావున ఇలాంటి ఉపయోగాలు ఉన్న కీర దోస పై కొన్ని విషయాలను తెలుసుకుందాం.. అలాగే ఈ కీర ఫ్రై ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం చూద్దాం..

Low Calorie Keera Fry Salad Reduces Weight

Low Calorie Keera Fry Salad Reduces Weight

ముందుగా ఈ సలాడ్ కి కావలసిన పదార్థాలు : ఒక స్పూన్ తేనె, ఒక స్పూన్ నిమ్మరసం, వేయించిన నువ్వులు, ఒక టేబుల్ స్పూన్ ఒరిగాను వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒకటే స్పూన్ మీగడ, ఒక టీ స్పూన్ ఎండు మిరపకాయలు, మిరియాల పొడి ఒక టీ స్పూన్ కీరదోసకాయ ఒకటి. ఈ సలాడ్ కోసం మొదటగా కీర దోసకాయను ముక్కలుగా కట్ చేసుకోవాలి. వాటిలో ఉన్న గింజలను తీసేయాలి. ఈ ముక్కలు ఆలు ఫ్రెంచ్ ఫ్రైడ్ లాగా కట్ చేసుకోవాలి. ఇక దీనికోసం స్టవ్ పై ఒక గిన్నెను పెట్టుకొని దానిలో కొంచెం మీగడ ఒక టీ స్పూన్ ఒరిగానో ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా వేగనివ్వాలి. తర్వాత కొన్ని ఎండు మిరపకాయలు, ముక్కలు పొడిని కూడా వేసుకోవాలి.

Low Calorie Keera Fry Salad Reduces Weight

Low Calorie Keera Fry Salad Reduces Weight

తర్వాత నానబెట్టిన పచ్చిశనగపప్పుని వేసుకొని కాసేపు వేయించాలి. ఆ తర్వాత ఒక స్పూన్ మిరియాల పొడి రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసం, కీర మొక్కలు అలాగే ఒక టేబుల్ స్పూన్ తేనె, ఒక స్పూన్ మిరియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత గిన్నెకు మూత పెట్టి మగ్గనివ్వాలి. పది నిమిషాలు మగ్గిన తర్వాత దానిని ఒక గిన్నెలోకి తీసుకొని వేయించిన నువ్వుల పొడిని దానిపై చల్లుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన కీర ఫ్రై రెడీ. దీనివల్ల ఎంత తిన్న ఫ్యాట్ అనేది పెరగదు.. అలాగే జీరో క్యాలరీస్ 0 జీరో ఫైబర్ ఉంటుంది. కావున ఇది తేలికగా జీర్ణం అయిపోతుంది. కావున ఇలాంటి వాటిని నిత్యం ఆహారంలో చేర్చుకోవడం వలన ఎన్నో ఉపయోగాలు కలుగుతాయి. అలాగే అధిక బరువు ఉన్నవాళ్లు తొందరగా తగ్గుతారు. పొట్ట కూడా తగ్గిపోతుంది.

Also read

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది