Black Tea : ఒక కప్పు బ్లాక్ టీతో ఎన్నో రోగాలు మటాష్…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Black Tea : ఒక కప్పు బ్లాక్ టీతో ఎన్నో రోగాలు మటాష్…!

 Authored By aruna | The Telugu News | Updated on :29 September 2023,7:00 am

Black Tea : టీ, కాఫీ అంటే ఇష్టపడని వారు చాలా తక్కువ మంది ఉంటారు. ఏదైనా వర్క్ చేసి బ్రెయిన్ కి పని పెడితే కాస్త రిలాక్స్ కోసం టీలేదా కాఫీ తాగేస్తాం. అయితే మనకు రెగ్యులర్ టీ, కాఫీలు మాత్రమే ఎక్కువగా అలవాటు ఉంటాయి. ఈ రోజుల్లో డాక్టర్ల సలహాలు వల్ల చాలామంది గ్రీన్ టీ, తులసీ టీ,లెమన్ టీ ఆరంజ్, గ్రీన్ కాఫీ వంటివి కూడా తాగుతున్నారు. అయితే వీటితోపాటు బ్లాక్ టీ కూడా తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. నిత్యం బ్లాక్ టీ తాగడం వలన వెయిట్ లాస్ ఈజీగా అవుతారు. ఇది తాగడం వలన శరీర ఆరోగ్యం మెరుగవుతుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. స్ట్రోక్స్ ప్రమాదాన్ని తగ్గించడానికి బ్లాక్ టీ సహాయపడుతుందని పలు అధ్యయనాల ద్వారా తెలిపారు. మోడరన్ లైఫ్ స్టైల్ వల్ల ప్రతి ఒక్కరు ఒత్తిడితోనే జీవిస్తున్నారు. రోజు బ్లాక్ టీ తాగడం వల్ల సిస్టోమిక్ డయాస్ట్రాలిక్ స్థాయిలో నియంత్రణలో ఉండి రక్తపోటు సమస్య రాకుండా ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.

దీని ద్వారా షుగర్ సమస్యలు రాకుండా చేస్తుంది.క్యాన్సర్ కణాల అభివృద్ధిని తగ్గించడంలో బ్లాక్ టీ సహాయపడుతుంది. బ్లాక్ తీసుకోవడం వల్ల క్యాన్సర్ నయం కానప్పుడుకి క్యాన్సర్ కణాలతో పోరాటానికి సహాయపడుతుంది. మన శరీరంలోని వైరస్ బ్యాక్టీరియాలను బయటకు పంపడంలో బ్లాక్ టీ ప్రధాన పాత్ర పోషిస్తుంది. రోజు బ్లాక్ టీ తాగడం వల్ల ఎముకలు బలంగా మారే వీలుంటుంది. ఈటీవీ చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు.. నీటిని బాగా మరిగించి అందులో బ్లాక్ టీ బ్యాగ్స్ వేసుకుంటే సరి కొన్ని నిమిషాల తర్వాత దీనికి అల్లం లేదా నిమ్మకాయ రసాన్ని కలిపి తాగితే శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. మీకు చిగుళ్ల సమస్య దంతాల సమస్య ఉంటే మీరు బ్లాక్ టీ బ్యాగ్ ను ఆ ప్రదేశంలో పెట్టి కొద్దిగా నొక్కండి. అలా ఐదు నిమిషాల పాటు పెట్టినట్లయితే దంత సమస్యలు ఈజీగా తగ్గిపోతాయి.

Many diseases can be cured with a cup of black tea

Many diseases can be cured with a cup of black tea

రోజు ఉదయాన్నే బ్లాక్ టీ తాగారంటే మీకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలను కొన్ని రోజుల్లోనే గ్రహిస్తారు. మంచి నాణ్యమైన బ్యాగ్స్ ను వాడితే ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి. మీ శరీరంలో మంచి ఆరోగ్యకర మార్పులు చాలా వస్తాయి. కొంతమందికి మాటిమాటికి కళ్ళు మండుతూ ఉంటాయి. అలాంటివారు బ్లాక్ టీ బ్యాగులను కొద్దిసేపు చల్లటి నీటిలో ఉంచాలి. ఇప్పుడు బ్యాగులో అదనంగా ఉన్న నీటిని తొలగించాలి. ఇప్పుడు ఆ బ్యాగుల్ని కళ్ళపై పది నిమిషాలు పెట్టుకోవాలి. అంతే కళ్ళు చల్లగా అయిపోతాయి.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది