TEA భోజనం చేసిన తర్వాత టీ తాగే అలవాటు ఉందా… అయితే ఈ విషయాలు తెలుసుకోండి… లైఫ్ లో త్రాగరు…
ప్రధానాంశాలు:
TEA భోజనం చేసిన తర్వాత టీ తాగే అలవాటు ఉందా... అయితే ఈ విషయాలు తెలుసుకోండి... లైఫ్ లో త్రాగరు...
TEA : మనలో చాయ్ కి ఎంతోమంది అభిమానులు ఉంటారు. మన జీవితంలో ప్రతిరోజు చాలా సార్లు టీ లేక కాఫీ ని తీసుకుంటూ ఉంటాం. ఉదయం లేచిన తర్వాత, బ్రేక్ ఫాస్ట్ చేసిన తర్వాత, మధ్యాహ్నం భోజనం చేసిన తరువాత మరియు నైట్ నిద్ర పట్టకపోతే ఇలా చాలా మంది ఎన్నోసార్లు చాయ్ తాగటం జీవితంలో ఒక భాగం అయ్యింది. కానీ టీ మరియు కాఫీ ల వలన కలిగే ప్రయోజనాలు ఎన్ని ఉన్నాయో ఎక్కువగా తాగటం వలన కలిగే నష్టాలు కూడా చాలా ఉన్నాయి అని నిపునులు తెలిపారు. టీ ని గాని కాఫీని గాని ఏదైనా సరే అతిగా తాగటం వల్ల ఇబ్బందులు వస్తాయి. మితంగా తాగితే మంచిది అని నిపుణులు తెలిపారు..
ఇక అసలు విషయానికి వస్తే టీ, కాఫీ రెండింటిలో కెఫిన్ అనే ఒక రసాయన ఉంటుంది. ఈ రసాయనం అనేది మనం తీసుకునే ఫుడ్ లో ఐరన్ లాంటి చిన్న చిన్న పోషకాలను శరీరం గ్రహించటంలో ఆటంకం అనేది ఏర్పడేలా చేస్తుంది అని ఒక పరిశోధన తెలిపింది. అనగా భోజనానికి ఒక గంట ముందు గాని,భోజనం చేసిన తర్వాత గంటలోపు గాని టీ, కాఫీలను తీసుకోకూడదు అని ICMR కొన్ని సూచనలు చేసింది. కాఫీ, టీలు అనేవి భోజనానికి ఒక గంట ముందు లేక భోజనం చేసిన తర్వాత గంటలోపు తీసుకున్నట్లయితే ఆహారం నుండి మనకు లభిస్తున్న పోషకాలు అనేవి మన శరీరానికి సరిగ్గా అందవు అని వారి పరిశోధనలో తేలింది…
మరొక ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటి అంటే. ICMR సూచనల ప్రకారంచూస్తే, బ్లాక్ టీ గాని గ్రీన్ టీ గాని ఏదైనా సరే దానిలో థియోబ్రోమైన్, థియోఫిలిన్, కెఫిన్ వంటి రసాయనాలు ఉన్నాయి. కావున ఇవి శరీరంలో ఉన్నటువంటి రక్తనాళాలను సడలించి రక్త ప్రసరణను క్రమబద్ధీకరిస్తుంది. దీంతో గుండె సమస్యలు, పొట్ట క్యాన్సర్ లాంటి ప్రమాదాలను తగ్గిస్తుంది. కానీ పాలలో టీ, కాఫీలు కలిపితే టీ లేక కాఫీ లేక పాలు వలన కలిగే ప్రయోజనాలు మన శరీరానికి అందవు అని నిపుణులు తెలిపారు. విడిగా పాలు, బ్లాక్ చాయ్,గ్రీన్ టీ తాగటం ఎంతో మంచిది. కానీ పాలతో టీ మరియు కాఫీలను తాగటం వలన ఈ మూడు మిశ్రమాల వలన శరీరానికి లభించే ప్రయోజనాలు అనేవి పూర్తిస్థాయిలో మన శరీరానికి అందవు అని నిపుణులు అభిప్రాయం..