Black Tea Vs Black Coffee : బ్లాక్ కాఫీ… బ్లాక్ టీ ఇందులో ఏది మంచిదో తెలుసా…? ప్రతి ఒక్కరూ చేసే పొరబాట్లు ఇవే …? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Black Tea Vs Black Coffee : బ్లాక్ కాఫీ… బ్లాక్ టీ ఇందులో ఏది మంచిదో తెలుసా…? ప్రతి ఒక్కరూ చేసే పొరబాట్లు ఇవే …?

 Authored By aruna | The Telugu News | Updated on :8 January 2025,7:00 am

ప్రధానాంశాలు:

  •  Black Tea Vs Black Coffee : బ్లాక్ కాఫీ... బ్లాక్ టీ ఇందులో ఏది మంచిదో తెలుసా...? ప్రతి ఒక్కరూ చేసే పొరబాట్లు ఇవే ...?

Black Tea Vs Black Coffee : ప్రస్తుత సమాజంలో ప్రజలు టీ, కాఫీలు Black Tea Vs Black Coffee తాగండి ఏ పనిని చేయరు. వారు ఉదయం లేవగానే టీ, కాఫీలతోనే రోజువారి దినచర్య మొదలవుతుంది. టీ, కాఫీ ల పై ముక్కు ఎక్కువ చూపిస్తారు. రోజుకి రెండు మూడు సార్లు అయినా తాగంది ఉండలేరు. ఎంతో రుచికరమైన టీ, కాఫీలను టైం తో సంబంధం లేకుంటా ఎప్పుడంటే అప్పుడు తాగుతూ ఉంటారు. అయితే టీ, కాఫీలలో ఏది మంచిది. ఏది మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. అయితే టీ,కాఫీల కంటే బ్లాక్ టీ,బ్లాక్ కాఫీ వంటి వాటిల్లో కూడా ఆరోగ్య ప్రయోజనాలు, వాటి నష్టాలు కూడా ఉన్నాయని ఇప్పుడు.  తెలుసుకుందాం… సాధారణంగా టీ,కాఫీల కంటే బ్లాక్ టీ, బ్లాక్ కాఫీలు మరింత మేలు చేస్తాయి. అయితే వీటిలో కూడా ఒకటి మంచి ఆరోగ్యాన్ని, మరొకటి చెడు ప్రభావాలని కలుగజేస్తుందని తెలుసుకోవాల్సి ఉంటుంది.

శీతాకాలం టైం లో వేడివేడిగా ఒక కప్పు కాఫీ తాగాలనిపిస్తుంది. ఈ చలి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు గ్లాసులు మీద గ్లాసులు టీ,కాఫీలను లాగిస్తూ ఉంటారు. టీ,కాఫీలు తాగిన ఒక్క అనుభూతి మరొకటి ఉండదు. అయితే ఈ టీ కాఫీలు తాగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదన్నా సంగతి అందరికీ తెలిసిందే. కాఫీ,టీలు తయారు చేసే డికాషన్ కి చాలా తేడా ఉంటుంది. అయితే కొంతమందికి బ్లాక్ కాఫీ లేదా బ్లాక్ టీ ని రెగ్యులర్ గా తాగే అలవాటు ఉండవచ్చు. ఈటీలలో కూడా మoచి చెడు అనేది ఉంది. మరి ఆ వివరాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

Black Tea Vs Black Coffee బ్లాక్ కాఫీ బ్లాక్ టీ ఇందులో ఏది మంచిదో తెలుసా ప్రతి ఒక్కరూ చేసే పొరబాట్లు ఇవే

Black Tea Vs Black Coffee : బ్లాక్ కాఫీ… బ్లాక్ టీ ఇందులో ఏది మంచిదో తెలుసా…? ప్రతి ఒక్కరూ చేసే పొరబాట్లు ఇవే …?

Black Tea Vs Black Coffee : బాగా టైడ్ అయిపోయినప్పుడు బ్లాక్ కాఫీ తక్షణమే

మనం బాగా టైడ్ అయిపోయినప్పుడు, తిరిగి తక్షణమే శక్తిని అందించడంలో బ్లాక్ కాఫీ కీలకపాత్రను పోషిస్తుంది. ఎందుకంటే ఒక కప్పు బ్లాక్ కాఫీలు దాదాపు 95 మిల్లీగ్రాముల కెఫిన్ ఉంటుంది. అదే కప్పు బ్లాక్ టీ లో 26-48 మిల్లి గ్రాముల కెఫెన్ ఉంటుంది. ముఖ్యంగా ఉదయం పూట లేదా పని సమయంలో ఏకాగ్రతను పెంచుకోవాలనుకునే వారికి కాఫీ ఒక దివ్య ఔషధం.కాఫీలో చక్కెర, పాలు జోడించకుండా వినియోగించినప్పుడు కేలరీల లేని డికాషన్ తయారవుతుంది. దీన్ని తరచూ తాగితే బరువు తగ్గడానికి ఉత్తమమైన మార్గం. కానీ చాలామంది మాత్రం టీ లో క్యాలరీలు తక్కువ ఉన్నప్పటికీ చాలామంది చెక్కర,పాలు లేదా తేనే టీ తాగినందుకు అధికంగా ఆసక్తి చూపుతారు. ఇది త్వరగా క్యాలరీల పానీయంగా మారుతుంది. కానీ టీ కంటే నిజానికి బ్లాక్ కాఫీ వినియోగం జీవక్రియను మెరుగుపరుస్తుంది.
బ్లాక్ టీ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అలాగే బ్లాక్ కాఫీలో క్లోరోజెనిక్ యాసిడ్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అందువల్ల మంటను తగ్గించడంలో సహాయపడతాయి.

ఈ కాఫీలోని పాలి ఫైనల్స్ చాలా వైవిధ్యంగా ఉంటాయి. ఈ బ్లాక్ కాఫీ తాగటం వలన మధుమేహం, హృదయ సంబంధ వ్యాధులు వంటి దీర్ఘకాలిక వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షించుకోవచ్చు. కాబట్టి ఇది ఆరోగ్య పరిరక్షణలో ఒక ముఖ్యమైన పాత్రను పోషించగలదు.మన మేధాశక్తిని,ఏకాగ్రతను పెంచుటకు ఎంతో సహాయ పడగలదు బ్లాక్ కాఫీ. బ్లాక్ కాఫీ ని ఎక్కువగా తాగటం వలన అల్జిమర్స్, పార్కినన్స్ మరియు న్యూరో డెజెనరేటివ్ వ్యాధుల యొక్క త్రీవ్రతను తగ్గించవచ్చు. బ్లాక్ టీ లో ఇటువంటి సామర్థ్యం ఉన్నప్పటికీ, దాని లొకేషన్ కంటెంట్ తక్కువగా ఉండటం వల్ల బ్లాక్ కాఫీతో పోలిస్తే ఇది తక్షణ ప్రభావాన్ని కలిగి ఉండదు. బ్లాక్ కాఫీ ఒక గొప్ప స్పోర్ట్స్ డ్రింక్ కూడా. ఒక శారీరక శ్రమ, ఒత్తిడి నుంచి రిలీఫ్ చేస్తుంది. మనం వ్యాయామం చేసే ముందు ఒక కప్పు బ్లాక్ కాఫీ ని తాగటం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వును త్వరగా కరిగించుటకు శారీరక శ్రమకు కావలసిన శక్తిగా మార్చే ఆడ్రినలిన్ స్థాయి కూడా పెరుగుతుంది. అవును మొత్తం మీద చెప్పదగినది ఏమిటంటే బ్లాక్ టీ కంటే బ్లాక్ కాఫీ ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. టీ వల్ల ఎసిడిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాఫీ వల్ల అంతా ఆసిటిటీ ప్రాబ్లమ్స్ ఉండవు.

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది