Monkeypox : డేంజర్ బెల్స్ మోగిస్తున్న మంకీ పాక్స్..!! అటువంటి వారికి తప్పదా ముప్పు..?? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Monkeypox : డేంజర్ బెల్స్ మోగిస్తున్న మంకీ పాక్స్..!! అటువంటి వారికి తప్పదా ముప్పు..??

 Authored By aruna | The Telugu News | Updated on :6 August 2022,7:30 am

Monkeypox : గత మూడు సంవత్సరాలుగా ప్రజలను అల్లకల్లోలం చేస్తున్న మహంమారి కరోనా ఈ కరోనా ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. అదేవిధంగా ఎంతో మందిని బలి తీసుకుంది. అలాంటి కరోనా ఇప్పుడు దాని త్రీవత తగ్గడంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. ప్రజలు అమ్మయ్య అని అనుకునే లోపే ఇంకొక మహమ్మారి ప్రజల్లోకి చొరబడింది. ఆ మహమ్మారి పేరు మంకీ పాక్స్.. అయితే ప్రస్తుతం ఈ మంకీ పాక్స్ కేసులు పెరగడంతో జనాలలో మళ్ళీ భయభ్రాంతులు రేకెత్తుతున్నాయి. అయితే ఈ మంకీ పాక్స్ కేసులు కేరళలో అలాగే ఢిల్లీలో కూడా ఈ కేసులు నమోదయ్యాయి. అయితే ఇప్పుడు వరకు ఇండియాలో మంకీ పాక్స్ సోకొనటువంటి వ్యాధిగ్రస్తులు సంఖ్య తొమ్మిదికి చేరుకున్నాయి. అయితే ఈ మహమ్మారితో ఒకరు చనిపోయారు. దాంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తంతో కొన్ని చర్యలను మొదలుపెట్టారు. అన్ని రాష్ట్రాలలో ఈ మహమ్మారి వ్యాప్తిని తనిఖీ చేయడానికి కొన్ని సలహాలను వేగవంతం చేసింది.

రోగ నిరోధక శక్తి పెరగడానికి వ్యాక్సిన్ల అధికంగా పర్యవేక్షించేందుకు నేషనల్ టాస్క్ ఫోర్స్ ను రెడీ చేసినట్లు ఆరోగ్య శాఖ మంత్రి మన్సుక్ మాండవియా రెండు ఆగస్టున తెలియజేశారు. అయితే ఐ సి ఎం ఆర్ నేపథ్యంలోని జాతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ. పూణే కొన్ని కేసులు అనుమానిత పర్యవేక్షణలో రిఫరల్ లాబోరెటరీగా పెట్టినట్లు తెలియజేశారు. అదేవిధంగా అధికంగా ఐసిఎంఆర్ వైరల్ రీసెర్చ్, డయాగ్నస్టిక్ లాబోరేటరీ నెట్వర్క్ లెబోరెటరీలు ఈ మహమ్మారి వ్యాధి లక్షణాలను బయటపెట్టెందుకు ఆప్టిమైజ్ చేశారు. అయితే ఈ మంకీ పాక్స్ ఇంతకుముందు వ్యాపించిన కరోనా తో పోలిస్తే ఈ వ్యాధి పెద్దగా వ్యాప్తి చెందదు. అని చావుల సంఖ్య కూడా తక్కువగా ఉందని ఎవరు భయభ్రాంతులకు గురవలసిన అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వాలు జనాలకు ధైర్యం చెబుతున్నారు. ఈ వ్యాధిగ్రస్తులు భయపడాల్సిన అవసరం లేదు అని అంటున్నారు. కానీ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడు వారు ఈ మంకీ పాక్స్ తో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. ఎందుకనగా ఈ మంకీ పాక్స్ అనేది ఒక అంటువ్యాధి కాబట్టి దీని నుంచి అధిక ఇన్ఫెక్షన్ బారిన పడే ప్రమాదం ఉంటుందని చెప్పారు.

Medical Experts about Monkeypox Effect

Medical Experts about Monkeypox Effect

అయితే ఈమధ్య కాలంలో కేరళలో చనిపోయిన 22 ఏళ్ల కుర్రాడు గురించి చర్చిస్తే ఆ కుర్రాడు మంకీ పాక్స్ ఇన్ఫెక్షన్ తోనే చనిపోయాడట. అయితే ఆ యువకుడికి బ్రెయిన్ ఎన్స్ పాలిటీస్ కూడా ఉన్నట్లు. ఛవి గుప్తా తెలియజేసారు. అయితే ఇలా కొన్ని దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ఈ మంకీ పాక్స్ తో కొద్దిగా జాగ్రత్తలు వహించాలి అని డాక్టర్ గుప్తా గారు తెలియజేస్తున్నారు.
అయితే ఇంకొక విషయం ఏమిటంటే. ఎక్కువ వ్యాధులతో బాధపడుతున్న వారు ఈ మహమ్మారి వైరస్ తో కలిసి న్యూమేనియా ఇన్ఫెక్షన్ ను అభివృద్ధి చేయవచ్చని ఛవి గుప్త పేర్కొన్నారు. అలాగే రోగ నిరోధక శక్తి లేనటువంటి వారు అత్యధిక జ్వరం అలాగే శరీరంపై దద్దుర్లు ఉంటాయి. ఈ వ్యక్తి కోలుకోవడానికి ఎక్కువ కాలం పడుతుంది. అలాగే ఈ వ్యాధిగ్రస్తులు అందువలన ఈ మహమ్మారితో అప్రమత్తంగా ఉండాలి అని డాక్టర్ గుప్తా హెచ్చరిస్తున్నారు. దీని లక్షణాలు జ్వరం, ఇబ్బందులు దద్దుర్లు ఉంటాయి. ఇలాంటి లక్షణాలు ఎవరిలోనైనా కనిపిస్తే వైద్యనిపుణులు సంప్రదించి వెంటనే ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందాలి అని డాక్టర్ గుప్తా పేర్కొన్నారు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది