Monkeypox : మంకీ పాక్స్ ఎవరికీ వస్తుంది…? ఎలా వస్తుంది…?
Monkeypox : కరోనా తగ్గిపోయాక మంకీ ఫాక్స్ ఈ మధ్యకాలంలో అందరిని భయపెడుతుంది. కరోనా వైరస్, హెపటైటిస్ వైరస్ లా కాకుండా మంకీ ఫాక్స్ చాలా తీవ్రంగా ఉంటుంది. ఇది ఆఫ్రికాలో మొదలై ఆ చుట్టు ప్రక్కల దేశాలలో కూడా పాకింది. కోతులలో ఉండే ఈ వైరస్ మనుషులకు సోకడం వలన ఈ వ్యాధి వస్తుంది. ఈ వైరస్ సోకిన వారికి కొద్ది రోజుల్లో ఒళ్లంతా పొక్కులు రావడం మొదలవుతుంది. ఈ మంకీ పాక్స్ చికెన్ పాక్స్ లేదా ఆటలమ్మ వచ్చినట్లుగానే వస్తుంది. ఈ వైరస్ వలన వచ్చిన పొక్కులు రెండు వారాలకు పూర్తిగా మాడిపోతాయి. ఈ మంకీ పాక్స్ కు సంబంధించి మూడు రకాల వైరస్ లు ఉంటాయి. వాటిలో ఒకటి స్మాల్ ఫాక్స్. ఇది 1978 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ ను నిర్మూలించగలిగారు.
ఈ వైరస్ మనుషులకు మాత్రమే సోకుతుంది. ఏ జంతువులలో ఉండదు. కాబట్టి దీనికి వ్యాక్సిన్ కనిపెట్టడం కూడా సులువు అయింది. ప్రపంచవ్యాప్తంగా అప్పుడే పుట్టిన పిల్లలు ప్రతి ఒక్కరికి స్మాల్ ఫాక్స్ కు సంబంధించి వ్యాక్సిన్ వేయడం జరిగింది. అందువలన స్మాల్ ఫాక్స్ ను పూర్తిగా నివారించగలిగారు. రెండవది చికెన్ ఫాక్స్. ఇదే అందరికీ తెలిసిందే. ఈ చికెన్ ఫాక్స్ కి కూడా ఇప్పుడు వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. చికెన్ ఫాక్స్ ఒక్కసారి వస్తే మళ్ళీ జన్మలో రాదు. ఈ వైరస్ తగ్గిపోయినప్పటికీ నరాల మధ్యలో దాక్కొని కొన్ని సంవత్సరాల తర్వాత నొప్పి, వాపు వంటివి రావడం జరుగుతుంది. అయినా ఇది అంత ప్రాణాంతకం ఏమీ కాదు. ఈ స్మాల్ ఫాక్స్, చికెన్ ఫాక్స్ లాంటిదే మంకి ఫాక్స్. ఈ మంకీ ఫాక్స్ 16,000 నుండి 20,000 మందికి రావడం, మనదేశంలో కూడా మంకీ ఫాక్స్ కేసులు రావడం జరిగింది.
ఇంకొద్ది రోజుల్లో ప్రపంచం మొత్తం మంకీ ఫాక్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.ఇది ఒకరి నుండి ఒకరికి, దెబ్బ తగిలినప్పుడు, ర సెక్స్ వలన వ్యాపించడం జరుగుతుంది. ఈ వ్యాధి ఉన్నవారు దగ్గిన, తుమ్మిన ఆ తుప్పర్ల ద్వారా వ్యాప్తి చెందుతుంది. కాబట్టి మాస్క్ ధరించడం మంచిది. ఈ వైరస్ కూడా శానిటైజర్ వాడటం చేతులు శుభ్రంగా కడుక్కోవడం వలన ఈ వ్యాధి వ్యాప్తిని నిరోధించవచ్చు. ఈ వ్యాధి వచ్చిన వారి దగ్గరికి చిన్నపిల్లలని వయసు మీరిన వారిని అసలు తీసుకు వెళ్ళవద్దు. మంకీ ఫాక్స్ వలన ప్రాణాలు అయితే పోవు. దీనికి వ్యాక్సిన్ స్మాల్ పాక్స్ కి వేసే వ్యాక్సిన్ ఇస్తున్నారు. మంకీ ఫాక్స్ వచ్చిన చికెన్ ఫాక్స్ వల్లే రెండు మూడు వారాలలో మాడిపోతాయి.