Monkeypox – Chickenpox : మంకీ ఫాక్స్, చికెన్ ఫాక్స్ రెండింటికి తేడా ఏంటి…? ఎలా గుర్తించాలి…?
Monkeypox – Chickenpox : కరోనా తగ్గాక ఏ వైరస్ పేరు విన్న ప్రజలు వణికిపోతున్నారు. అందుకే మంకీ ఫాక్స్ గడగడలాడిస్తుంది. కేసుల సంఖ్య అంతగా లేకపోయినా ఈ పేరు వింటే చాలు అందరు బెంబేలెత్తిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చికెన్ పాక్స్ కేసులు భయపడుతున్నాయి. ఇవి రెండు చూడడానికి ఒకేలా కనిపించడంతో జనం హాస్పిటల్స్ కు పరుగులు తీస్తున్నారు. అయితే ఈ రెండింటికి మధ్య తేడా ఎలా గుర్తించాలో వైద్యులు చెబుతున్నారు. ఒంటిపై దద్దుర్లు బొబ్బలు వస్తే చాలు జనాలు ఆసుపత్రికి పరుగులు తీస్తున్నారు. ఒంటిపై చిన్న మార్పు కనిపించిన మంకీ పాక్స్ ఏమో అని భయపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆటలమ్మ (చికెన్ పాక్స్) వస్తుంది. అయితే చికెన్ ఫాక్స్ మంకీ ఫాక్స్ కు స్పష్టమైన తేడాలే ఉన్నాయంటున్నారు వైద్యులు.
చికెన్ పాక్స్, మంకీ ఫాక్స్ రెండు వైరస్లు వల్లే వస్తున్నాయి. చూడడానికి ఒకేలా కనిపిస్తున్న వీటి మధ్య చాలా పెద్ద తేడా ఉంది. మంకీ పాక్స్ అనేది పాండమిక్. చికెన్ పాక్స్ అనేది సీజనల్ డిసీజ్. సాధారణ ప్రజలు గుర్తించడానికి కూడా చాలా అవకాశం ఉందంటున్నారు. ఇందులో ముఖ్యంగా వ్యాపిస్తే చికెన్ పాక్స్ శరీరం పైన ప్రధానంగా బొబ్బలు, పొక్కులు కనిపిస్తాయి. మరోవైపు ఈ బొబ్బల్లో తేడాతో పాటు మంకీ పాక్స్ లో పెద్దగా బొబ్బలు ఉంటే చికెన్ పాక్స్ లో బొబ్బలు వివిధ దశలో కనిపిస్తాయి అంటున్నారు వైద్యులు. మంకీ పాక్స్ లో తీవ్రమైన జ్వరం వచ్చి తగ్గిన తర్వాత ఒంటిపై బొబ్బలు, పొక్కులు ప్రారంభమవుతాయి. అదే చికెన్ ఫాక్స్ లో అయితే జ్వరం రాకుండానే పొక్కులు, దురద వంటి లక్షణాలు కనిపిస్తాయి. మంకీ ఫాక్స్ కుందేలు, ఎలుకలు, చింపాంజీలు గొరిల్లాల వంటి వాటి నుంచి సోకుతుంది.
ప్రస్తుతం మనుషుల్లో కూడా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే అవకాశం 15% ఉంది. అదే మరణాలు కూడా ఈ స్థాయిలో ఉంటాయి. చికెన్ పాక్స్ సీజనల్గా వ్యాపించే వ్యాధి. కొంత మాత్రమే అంటువ్యాధుల కనిపిస్తుంది మరణాలు అనేవి నూటికి 99 శాతం ఉండవు. మంకీ పాక్స్ కు వ్యాక్సిన్ లేదు. అప్పుడెప్పుడో వచ్చిన స్మాల్ పాక్స్ కు ఇచ్చిన వాక్సిన్ దీనికి ఇస్తున్నారు. చికెన్ పాక్స్ కు ప్రత్యేకమైన వ్యాక్సిన్ ఉంది. మంకి ఫాక్స్ వచ్చినట్లయితే ముఖ్యంగా మానవ శరీరంలో మెడ, చంకలు ,తొడ భాగంలో ఉండే లీఫ్ నోట్స్ గ్రంధులు వాపు కనిపిస్తుంది. ఈ లక్షణంతో మంకీ ఫాక్స్ గుర్తించడానికి కీలకం. అదే చికెన్ ఫాక్స్ అయితే ఈ గ్రంథులకు ఏ ఇబ్బంది ఉండదని తేల్చేశారు వైద్యులు.