Healthy Bones : మీరు చేసే ఈ పొరపాట్లే… మీ కీళ్ల నొప్పులకు కారణం తెలుసా…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Healthy Bones : మీరు చేసే ఈ పొరపాట్లే… మీ కీళ్ల నొప్పులకు కారణం తెలుసా…!

Healthy Bones : ప్రస్తుత కాలంలో ప్రతి ఇంట్లోనూ చేతులు మరియు కాళ్ల నొప్పులతో ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. అయితే ఈ సమస్య అనేది ఈ రోజుల్లో సర్వ సాధారణమైంది. అలాగే మోకాల మార్పిడి శాస్త్ర చికిత్సలు కూడా రోజు రోజుకీ బాగా పెరిగిపోతున్నాయి. అలాగే ఎముకల సమస్య ఉంటే ముందుగా చేయాల్సింది కాల్షియం మరియు విటమిన్ డి మందులను వేసుకోవడం. అలాగే చిన్న వయసులో నేలపై కూర్చునేందుకు ఇబ్బంది మరియు మోకాళ్ళ ను వంచడంలో ఇబ్బంది, మెట్లు […]

 Authored By ramu | The Telugu News | Updated on :17 October 2024,7:00 am

ప్రధానాంశాలు:

  •  Healthy Bones : మీరు చేసే ఈ పొరపాట్లే... మీ కీళ్ల నొప్పులకు కారణం తెలుసా...!

Healthy Bones : ప్రస్తుత కాలంలో ప్రతి ఇంట్లోనూ చేతులు మరియు కాళ్ల నొప్పులతో ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. అయితే ఈ సమస్య అనేది ఈ రోజుల్లో సర్వ సాధారణమైంది. అలాగే మోకాల మార్పిడి శాస్త్ర చికిత్సలు కూడా రోజు రోజుకీ బాగా పెరిగిపోతున్నాయి. అలాగే ఎముకల సమస్య ఉంటే ముందుగా చేయాల్సింది కాల్షియం మరియు విటమిన్ డి మందులను వేసుకోవడం. అలాగే చిన్న వయసులో నేలపై కూర్చునేందుకు ఇబ్బంది మరియు మోకాళ్ళ ను వంచడంలో ఇబ్బంది, మెట్లు ఎక్కేటప్పుడు కాళ్ళ లో నొప్పి, బరువైన వస్తువులను ఎత్తేటప్పుడు వీపు మరియు భుజాలు, చేతులు నొప్పి లాంటివి బలహీన ఎముకలకు సూచించే లక్షణాలు అని అంటున్నారు నిపుణులు. అయితే నిపుణుల అభిప్రాయ ప్రకారం చూస్తే, పోషకాహారం సక్రమంగా లేకపోవడం వలన కూడా ఎముకల బలం అనేది తగ్గిపోతుంది అని అంటున్నారు. అలాగే నెమ్మదిగా ఎముక క్షీణత అనేది మొదలవుతుంది. ఇవి మందులతో మాత్రమే తగ్గేవి కాదు. జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవాలి అని అంటున్నారు. అయితే ఆ మార్పులు ఏంటనేది ఇప్పుడు చూద్దాం…

బరువును కంట్రోల్ లో ఉంచుకోవడం అనేది ఎముకల ఆరోగ్యానికి చాలా అవసరం. అలాగే శరీర ఎక్కువ బరువు నడుము మరియు మోకాళ్ళ, చిల మండల పై ఎక్కువగా ఒత్తిడిని కలిగిస్తుంది. కావున బరువును కంట్రోల్ ఉంచడం అనేది చాలా అవసరం. అంతేకాక ఎక్కువసేపు కదలకుండా కూర్చుంటే ఎముకల సమస్య అనేది తీవ్రం అవుతుంది. అలాగే ఎక్కువసేపు కూర్చోవడం లేక పడుకోవడం వలన కూడా వెన్నెముకపై ఒత్తిడి అనేది బాగా పెరిగిపోతుంది. అంతేకాక మీరు తప్పుడు బంగిమలో ఎక్కువ సేపు కూర్చోవడం లేక పడుకోవడం వలన వీపు మరియు మెడ లేక నిర్మాణ సమస్యలకు కూడా ఆటంకం అనేది కలిగే అవకాశం ఉంది. అలాగే మీరు ఎక్కువ సేపు వీల్స్ వేసుకోవడం వల్ల కూడా వెన్ను సమస్యలు అనేవి వస్తాయి.

Healthy Bones మీరు చేసే ఈ పొరపాట్లే మీ కీళ్ల నొప్పులకు కారణం తెలుసా

Healthy Bones : మీరు చేసే ఈ పొరపాట్లే… మీ కీళ్ల నొప్పులకు కారణం తెలుసా…!

ఎముకల ఆరోగ్యం లేక బరువు నియంత్రణ ఈ రెండిటికి ప్రతిరోజు వ్యాయామం చేయటం అనేది చాలా అవసరం. అలాగే శరీరంలో ఇతర కీళ్ళ చుట్టూ కండరాలు బలంగా లేకుంటే గాయం అయ్యే అవకాశాలు కూడా బాగా పెరిగిపోతాయి. కావున నడక మరియు సైక్లింగ్ లేక స్విమ్మింగ్ లాంటివి ప్రతిరోజు చేయడం చాలా ముఖ్యం. అలాగే వ్యాయామం చేసేటప్పుడు లేక నడిచేటప్పుడు సౌకర్యం లేని బుట్లను వేసుకోవడం వలన కూడా ఎముకల సమస్యలు అనేవి వస్తాయి. అంతేకాక సౌకర్యవంతమైన బూట్లు ధరించకపోతే పాదాల నరాలు మరియు లిగమేంట్లు ఒత్తిడికి గురి అవుతాయి అని వైద్యులు అంటున్నారు. దీంతో ప్రయోజనం కంటే హాని కలిగే అవకాశం ఎక్కువగా ఉంది అని అంటున్నారు…

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది