Neck Pain : మెడ నొప్పి సమస్యలు బాగా వేధిస్తున్నాయా… అయితే ఈ చిట్కాలు ట్రై చేయండి…??
ప్రధానాంశాలు:
Neck Pain : మెడ నొప్పి సమస్యలు బాగా వేధిస్తున్నాయా... అయితే ఈ చిట్కాలు ట్రై చేయండి...??
Neck Pain : సాధారణంగా ప్రతి ఒక్కరికి ఒక్కొక్కసారి మెడనొప్పి అనేది బాగా వేధిస్తూ ఉంటుంది. అలాగే ఈ మెడ నొప్పి వలన చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ నొప్పి వలన ఎటువంటి పనులను చేసుకోలేము. అలాగే ఎక్కువసేపు వర్క్ చేయడం వలన మరియు శరీర నొప్పుల కారణంగా కూడా మెడ నొప్పి అనేది వస్తూ ఉంటుంది. అయితే ఈ మెడనొప్పిని మనం కొన్ని చిట్కాలు ద్వారా ఈజీగా నయం చేసుకోవచ్చు. మరీ అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..
భుజాలు నొప్పి మరియు మెడ నొప్పులు అనేవి ఒకేలా ఉంటాయి. దీంతో నిద్ర అనేది సరిగ్గా పట్టదు. అలాగే అధిక ఒత్తిడి మరియు ఆందోళన ఉన్న కూడా మెడ నొప్పి అనేది వస్తుంది అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే మీరు పని చేసుకునే టైం లో మెడ నొప్పి మరియు కండరాల నొప్పి గనుక వస్తే కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలి అని అంటున్నారు. అంతేకాక స్ట్రెచ్ చేసే వ్యాయామాలు చేయడం వలన కూడా మెడ నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. అలాగే అధిక బరువు ఉండే పనులు చేయడం వలన కూడా మెడ నొప్పి అనేది వస్తూ ఉంటుంది. కావున మీకు మెడ నొప్పి గనుక వస్తే అధిక బరువు ఉన్న పనులను అస్సలు చేయకూడదు…
అలాగే సరైన దిండు వాడకపోవటం వలన కూడా మెడ నొప్పి వస్తుంది. కాబట్టి మీరు సరైన దిండు ను వాడండి. అలాగే నిద్రలేమి సమస్య ఉన్నవారికి కూడా మెడ నొప్పి అనేది వస్తుంది. అంతేకాక తీవ్రమైన మెడ నొప్పితో ఇబ్బంది పడుతుంటే వెంటనె ఫిజియో థెరపీ కచ్చితంగా చేయించుకోవాలి. అయితే ఫిజియో థెరపీ మరియు హీట్ థేరపీ వంటి మసాజ్ లు చేయించుకోవడం వలన మెడ నొప్పులు అనేవి తొందరగా తగ్గిపోతాయి. అయితే ఈ మెడ నొప్పిని తగ్గించడంలో కోల్డ్ థేరపీ చాలా బాగా సహాయపడుతుంది. అలాగే ఐస్ ప్యాక్ తో నొప్పి ఉన్నచోట మసాజ్ చేస్తే, వాపు మరియు నొప్పి అనేది తొందరగా తగ్గిపోతాయి. అంతేకాక గోరువెచ్చని ఆయిల్ తో మసాజ్ చేసుకున్న కూడా మెడ నొప్పులు అనేవి తొందరగా తగ్గిపోతాయి. Neck pain relief tips in telugu