Neck Pain : మెడ నొప్పితో బాధపడుతున్నారా..? అయితే ఇలా చేస్తే ఐదు నిమిషాల్లో నొప్పి తగ్గించుకోవచ్చు… ఈ చిట్కా మీకోసం… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Neck Pain : మెడ నొప్పితో బాధపడుతున్నారా..? అయితే ఇలా చేస్తే ఐదు నిమిషాల్లో నొప్పి తగ్గించుకోవచ్చు… ఈ చిట్కా మీకోసం…

 Authored By prabhas | The Telugu News | Updated on :11 October 2022,6:30 am

Neck Pain : చాలామంది ఉద్యోగరీత్యా కారణంగా ఎన్నో సమస్యలు వచ్చి పడుతున్నాయి. అలాంటి సమస్యలలో ఒకటి మెడ నొప్పి అనేది సర్వ సాధారణ సమస్య. ఉద్యోగరీత్యా పనులలో రోజంతా అలాగే కూర్చుని ఉండడం లేదా, సరిగా కూర్చోలేకపోవడం, ఇలా కంప్యూటర్ల మీద వర్క్ చేస్తున్నప్పుడు కూర్చునే తీరును ఇలా మెడ నొప్పి వచ్చే అవకాశం బాగా ఉంటుంది. ఇది మెడ నరాల లలో నొప్పిని కలిగిస్తుంది. కొన్ని సమయాలలో ఈ మెడ నొప్పికి ముఖ్య కారణం అస్టియో ఆర్థరైటిస్ కూడా అయ్యుంటుంది. అయితే మెడ నొప్పి అనేది సహజంగా దానంతట అదే తగ్గిపోతూ ఉంటుంది. కానీ నొప్పి మాత్రం చాలా కాలం వస్తూనే ఉంటుంది. అది రోజువారి లైఫ్ లో అత్యంత ప్రభావాన్ని కలిగిస్తుంది. మెడనొప్పి అనేది సహజమైన సమస్య అయితే మరేదైనా ఇతర మూలాలతో ఇబ్బంది పడుతుంటే మీరు డాక్టర్ని వెంటనే కలవాలి.

మెడ నొప్పి పదేపదే కండరాల ఒత్తిడి, కీళ్ల నొప్పులు, నరాల నొప్పి లాంటివి లేదా ఆర్థరైటిస్ వలన కూడా రావచ్చు.. మెడ నొప్పికి చికిత్స ఏంటి.? ఈ మెడ నొప్పికి కచ్చితంగా మందు ఏదైనా ఉందా.. అని మీరు మీ మనసులో క్యూస్షన్ వేసుకుంటూ ఉంటారు. అయితే డాక్టర్లు మెడనొప్పిని మెరుగుపరచడానికి లేదా దాని నుంచి బయటపడేయడానికి సరైన సెట్టింగ్ పొజిషన్ ఉండాలని కూర్చునే విధానంలో కొన్ని మార్పులను తెలియజేస్తున్నారు. అలాగే వర్క్ టైంలో పదేపదే బ్రేక్ తీసుకోవాలని చెప్తున్నారు. డిస్క్ చైర్ లేదా కంప్యూటర్ ను సరి అయిన రీతిలో పెట్టుకోవాలని చెప్తున్నారు. ఈ విధంగా చేయడం వలన మెడపై ఎటువంటి ప్రభావం పడదని నిపుణులు తెలియజేస్తున్నారు అదేవిధంగా బరువులు ఎత్తేటప్పుడు కొన్ని జాగ్రత్తలు వహించాలని అలాగే మీరు ఉపశమనం పొందగల మరికొన్ని పద్ధతులు మనం ఇక్కడ చూద్దాం…

Are you suffering from neck pain

Are you suffering from neck pain

ధనురాసనం చేయాలి… ధనురాసనం అంటే బాణం. శరీరాన్ని బాణముల వంచి చేసే ఆసనాన్ని ధనురాసనం అంటారు. ఒక పద్ధతులు శరీరాన్ని వెనకవైపు ఉంచి పాదాలను చేతులతో పట్టుకొని ఈ ఆసనాన్ని చేయాలి. నేలపై పడుకొని మీ అరచేతులను మీ తుంటికి చేరుకునేలా మీ మోకాలని లోపలికి తీసుకోండి. ఇలా చేయాలంటే ముందుగా చదునైన ప్రదేశంలో మెత్తటి దుప్పటి కానీ చాపకాన్ని అమర్చుకోవాలి. రెండు చేతులతో మీ పాదాలను పట్టుకోండి. తర్వాత శ్వాస తీసుకునేటప్పుడు అరచేతుల్ని నేరుగా పైకి తీసుకురండి. నేల నుంచి తొడలను ఎత్తండి. మీ పైభాగాన్ని పైకి లాగండి. అదే టైంలో నేల నుంచి ఎత్తండి 10 సెకండ్ల పాటు ఈ భంగిమలో ఉండండి. గాలి వదులుతూ నెమ్మదిగా మీ శరీరాన్ని నేలపైకి తీసుకురండి. భుజాలను నిటారుగా పెట్టుకోవడానికి ఎనక కండరాలను బలోపేతం చేయడానికి బాణముల ఈ భంగిమ సహాయపడుతుంది.

మెడ చాచు… మేడం ముందు భాగాన్ని బాగా సాగదీయడానికి నెమ్మదిగా గడ్డానికి క్రిందికి తీసుకొని… 15 సెకండ్ల వరకు ఈ భంగిమలో ఉండండి. అప్పుడు మీ తలను తిరిగి యదా ప్లేస్ కి తీసుకోవచ్చు.. ఇక దీని తర్వాత తలను వెనుకకు వంచి 15 సెకండ్ల వరకు ఈ భంగిమలో ఉంచాలి. రెండు స్థానాలలో వ్యాయామం పదిసార్లు చేయాలి.

టెన్నిస్ బాల్ మసాజ్… టెన్నిస్ బాల్ తీసుకొని మీ మెడకు ఈ విధంగా మార్గాలలో మసాజ్ చేయడం ప్రారంభించండి నొప్పి ఉన్న ప్రదేశాన్ని 20 ,30 సెకండ్ల వరకు నొక్కి ఆపై వదిలి ఉంచండి. మల్లి మసాజ్ చేయడం మొదలు పెట్టండి. టెన్నిస్ బాల్ మీ మృదు కణజాలలాను సడలించేలా చేస్తాయి కండరాలను ఫ్రీగా మారుస్తాయి. దీనివలన కొంతవరకు నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. అనే విషయాన్ని రీసేర్చ్ గేట్ లో ప్రచురించబడిన నివేదికలో ఓ గొప్ప పరిష్కారం పేర్కొనబడింది.

Also read

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది