Nela Usiri : ఉసిరి కాని ఉసిరి నేల ఉసిరి. ఔషధ గుణాలకు ఈ మొక్క పెట్టింది పేరు. నేల ఉసిరి ఆకులు ఆరోగ్యపరంగా ఎంతో ఉపయోగపడతాయి. దాదాపు ప్రతి అనారోగ్య సమస్యకూ ఈ మొక్క ఆకుల రసాన్ని లేదా చూర్ణాన్ని వాడొచ్చు. ఈ విషయం చాలా మందికి తెలియదు. నేల ఉసిరి ఆకులను మెత్తగా దంచి పుండ్లకు రాస్తే యాంటీ బయాటిక్ మాదిరిగా పనిచేస్తుంది. ఫలితంగా గాయాలు మానతాయి. వాపులు తొందరగా తగ్గుతాయి. నేల ఉసిరి ఆకుల పేస్ట్ కి ఉప్పును కూడా కలిపి దంచి ఆ మిక్చర్ తో కట్టుకడితే విరిగిన ఎముకలు సైతం అతుక్కుంటాయి. అంటే నేల ఉసిరి అంత పవర్ ఫుల్ మొక్క అన్నమాట. చర్మ వ్యాధులను నయం చేసే శక్తి కూడా ఈ మొక్క ఆకుల రసానికి ఉంది.
కొంత మందికి నోరు, నాలుక, పెదవులు పగులుతాయి. దీంతో భోజనం చేయాలంటే, కారం తగిలితే నరకం కనిపిస్తుంది. ఈ సమస్యకి పరిష్కారం నేల ఉసిరి ఆకుల్లో ఉంది. ఈ ఆకులను రోటిలో వేసి నూరి నీళ్లల్లో వేసి రాత్రి పూట మొత్తం అలాగే ఉంచాలి. తెల్లారి లేచిన తర్వాత ఆ నీటిని నోట్లో పోసుకొని పుక్కిలించాలి. ఇలా చేస్తే పైన చెప్పుకున్న ఇబ్బందులు తొలిగిపోతాయి. నేల ఉసిరి ఆకుల రసాన్ని లేదా పొడిని కషాయం లాగా కాచుకొని తాగితే దగ్గు, ఆయాసం తొలగిపోతాయి. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో దగ్గు, ఆయాసం వంటివి తగ్గటానికి ఇదొక చక్కని మార్గం. నేల ఉసిరి ఆకుల రసాన్ని లేదా చూర్ణాన్ని రోజూ ఉదయం, సాయంత్రం తాగితే కామెర్ల బారి నుంచి బయట పడొచ్చు.
నేల ఉసిరి ఆకులను డైరెక్టుగా నమిలి తింటే ఆకలి సమస్య ఉండదు. తిన్న తిండి బాగా అరుగుతుంది. నేల ఉసిరి రసానికి పంచదారి కలిపి తాగితే వెక్కిళ్లు సైతం రావు. మూత్రం రానివాళ్లు నేల ఉసిరి ఆకులను, వేర్లను దంచి తింటే సాఫీగా వస్తుంది. ఆడవాళ్లలో రుతుస్రావం ఎక్కువగా వస్తున్నప్పుడు నేల ఉసిరి ఆకుల చూర్ణాన్ని బియ్యం కడిగిన నీళ్లలో కలుపుకొని తాగితే ఏ ఇబ్బందీ ఉండదు. లివర్, ఫివర్ తదితర అనారోగ్యాలను కూడా నేల ఉసిరి ఆకులు మటుమాయం చేస్తాయి. ఉసిరి ఎంత మేలు చేస్తుందో నేల ఉసిరి కూడా అంతే. నేచురల్ మెడిసిన్. ఫ్రీగా దొరుకుతుంది. కొవిడ్ నేపథ్యంలో ఇలాంటి ఆయుర్వేద మందులకు ప్రాముఖ్యత ఏర్పడింది. సహజసిద్ధంగా లభించే నేల ఉసిరిని ఉపయోగించుకొని ఎటువంటి ఖర్చూ లేకుండా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందొచ్చు.
ఇది కూడా చదవండి ==> ఈ మొక్క కనిపిస్తే అస్సలు వదలొద్దు.. ఔషధాల గని ఈ మొక్క.. దీని వల్ల ఎన్ని లాభాలో తెలుసా?
ఇది కూడా చదవండి ==> క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే.. వెంటనే జ్యూస్ చేసుకొని తాగేస్తారు..!
ఇది కూడా చదవండి ==> అమ్మాయిలకు సరిగ్గా రుతుస్రావం కాకపోతే ఏం చేయాలి? ఏదైనా చికిత్స తీసుకోవాలా?
ఇది కూడా చదవండి ==> ఈ కాయలు కనిపిస్తే అస్సలు వదలకండి.. వీటి గురించి తెలిసి డాక్టర్లే నోరెళ్లబెట్టారు?
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
This website uses cookies.