Gaddi Chamanthi : ఈ మొక్క కనిపిస్తే అస్సలు వదలొద్దు.. ఔషధాల గని ఈ మొక్క.. దీని వల్ల ఎన్ని లాభాలో తెలుసా?
Gaddi Chamanthi : గడ్డి చామంతి పేరు విన్నారా ఎప్పుడైనా? గడ్డి చామంతి పువ్వును మనం ఎక్కడ పడితే అక్కడ చూస్తుంటాం. చామంతి పూలు చూడటానికి కూడా చక్కగా, అందంగా ఉంటాయి. పొలాల దగ్గర, గట్ల మీద, అడవిలో, ఇంటి పెరట్లో, ఎక్కడ పడితే అక్కడ గడ్డి చామంతి పూలను చూసి ఉంటాం. గడ్డి చామంతి పూలను కేవలం ఒక పూల మొక్కగానే మనం ఇన్ని రోజులు చూశాం. కానీ.. ఇప్పటి నుంచి గడ్డి చామంతి మొక్క కనిపిస్తే చాలు.. అస్సలు వదలకండి. దాన్ని వెంటనే ఇంటికి తెచ్చేసుకోండి. ఆ మొక్కలో ఉన్న ఔషధ గుణాల గురించి చెబితే మీరు నోరెళ్లబెడతారు. దాంట్లో అన్ని ఔషధ గుణాలు ఉన్నాయి.
ఇండియాలో ఎక్కడ చూసినా ఈ చెట్టు కనిపిస్తుంది. ఈ చెట్టు పువ్వులను చామంతి పువ్వులు అంటాం. ఇవి చిన్నగా, పసుపు కలర్ లో ఉంటాయి. అయితే.. ఈ చెట్టు మొత్తం ఔషధాల గనే. ఈ చెట్టు ఆయుర్వేద గుణాలను కలిగి ఉంటుంది. అందుకే.. ఈ చెట్టు వల్ల కలిగే లాభాలు తెలుసుకుంటే.. మీరు అస్సలు ఆగరు. వెంటనే ఆ చెట్టునే తెచ్చేసుకుంటారు.
Gaddi Chamanthi : గడ్డి చామంతి వల్ల కలిగే లాభాలు ఇవే?
గడ్డి చామంతి చెట్టు ఆకులను చాలా ఆయుర్వేద మందుల తయారీలో వాడుతారు. చాలామందికి వెంట్రుకలు రాలడం, వెంట్రుకలు తెల్లబడటం జరుగుతుంది. అలాగే.. ఫంగల్ ఇన్ఫెక్షన్ కూడా వస్తుంటుంది. అటువంటి వాళ్లు ఈ చెట్టు ఆకును వాడాలి. వెంట్రుకలను రాలడం తగ్గిపోతుంది. వెంట్రుకలు తెల్లబడటం కూడా తగ్గిపోతుంది.
తీవ్రమైన జలుబుతో బాధపడుతున్నవారు.. ఈ చెట్టు ఆకులను తీసుకుంటే.. వెంటనే జలుబు తగ్గిపోతుంది. ఈ చెట్టు ఆకులో యాంటీ కార్సినోజెనిక్ గుణాలు ఉంటాయి. అలాగే.. యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా మెండుగా ఉంటాయి. అందుకే.. ఈ చెట్టు ఆకును ఆయుర్వేద మందులో విరివిగా ఉపయోగిస్తుంటారు.
Gaddi Chamanthi : ఈ చెట్టు ఆకులను ఎలా ఉపయోగించాలి?
ముందుగా ఈ చెట్టు ఆకులను తీసుకొని.. ఆకులను బాగా మెత్తగా రుబ్బాలి. ఆ మిశ్రమానికి ఇంత ఆవ నూనె కలిపి.. ఆ మిశ్రమాన్ని ఉడకబెట్టాలి. ఆ మిశ్రమం నుంచి నూనెను వడకట్టి.. జుట్టుకు రాసుకుంటే.. జుట్టు పెరగడంతో పాటు.. జుట్టు నల్లగా మారుతుంది. చుండ్రు తగ్గుతుంది. వెంట్రుకలు అస్సలు రాలవు.
ఈ ఆకు రసం చేసుకొని కూడా తాగొచ్చు. అలా నిత్యం చేస్తే.. ఉదర భాగానికి సంబంధించిన ఎన్నో సమస్యలకు చెక్ పెట్టొచ్చు. ఈ ఆకుతో కషాయం చేసుకొని కూడా తాగొచ్చు. కాలేయ సంబంధ వ్యాధులను తగ్గించడానికి.. శ్వాసకోస వ్యాధులను తగ్గించడానికి.. ఈ చెట్టు ఆకులతో కషాయాన్ని తయారు చేసుకోవాలి.