Lasora Fruit : ఈ కాయలు కనిపిస్తే అస్సలు వదలకండి.. వీటి గురించి తెలిసి డాక్టర్లే నోరెళ్లబెట్టారు?
Lasora Fruit : లసోరా ఫ్రూట్ పేరు ఎప్పుడైనా విన్నారా? వాటినే నక్కెర కాయలు అని కూడా పిలుస్తారు. ఇవి రోడ్డు పక్కన ఎక్కడ చూసినా కనిపిస్తాయి. రోడ్డు పక్కన చెట్టు మొత్తం పళ్లతో నిండి ఉంటుంది. అయితే.. ఆ చెట్టును ఎవ్వరూ పట్టించుకోరు. అవేవో పిచ్చి కాయలు కావచ్చు అని అంతా లైట్ తీసుకుంటారు. అసలు.. ఆ చెట్టు జోలికే పోరు ఎవ్వరు. కానీ.. ఆ చెట్టు పిచ్చి చెట్టు కాదు. ఆ చెట్టు ఆయుర్వేద గని. ఆ చెట్టు వల్ల, ఆ చెట్టు కాయల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిసి డాక్టర్లే ఆశ్చర్యపోయారు. డాక్టర్లే నోరెళ్లబెట్టారు.
ప్రతీ ఆయుర్వేద మందు తయారీలో నక్కెర కాయలను ఉపయోగిస్తారు. అజీర్తి వచ్చినా.. జ్వరం వచ్చినా.. తలనొప్పి, ఇన్ఫెక్షన్, లంగ్స్ కు సంబంధించిన సమస్యలు, పూతలు వస్తే.. వాడే ఆయుర్వేద మందులో నక్కెర కాయలను ఉపయోగిస్తారు. ఈ చెట్టు కాయలే కాదు.. ఆకులు, చెట్టు బెరడు, చెట్టు విత్తనాలు కూడా ఫుల్ ఆయుర్వేద గుణాలను కలిగి ఉంటాయి.
Lasora Fruit : ఈ చెట్టు కనిపిస్తే మాత్రం అస్సలు వదలకండి
ఈ పండ్లనే సబెస్తాన్ పండ్లు అని కూడా పిలుస్తారు. ఈ పండ్లు తియ్యగానే ఉంటాయి. ఈ పండ్ల నుంచి తెల్లటి జిగురు బయటికి వస్తుంది. దగ్గు లాంటి సమస్య వచ్చినా.. రక్తస్రావం అయినా, అల్సర్ సమస్యలు ఉన్నా.. ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నా కూడా ఈ పండ్లను వాడితే తగ్గిపోతాయి. ఈ పండ్లలో అధిక శాతం యాంటీ అల్సర్, సైటో ప్రొటెక్టివ్ గుణాలు ఉంటాయి.
నక్కెర కాయలను ఎండబెట్టి కూడా అమ్ముతారు. ఎండిన నక్కెర కాయలను ఆయుర్వేద మందులో ఉపయోగిస్తారు. నక్కెర కాయల ఆకులు, బెరడు, పువ్వు, పండ్లు అన్నింటినీ ఆయుర్వేదంలో మందు కోసం ఉపయోగిస్తారు. సాధారణంగా మనకు వచ్చే అన్ని రకాల ఫ్లూలను, వైరస్ లను ఈ నక్కెర కాయలతో నయం చేయవచ్చు. అందుకే.. ఈ చెట్టు కనిపిస్తే అస్సలు వదలకండి.
ఇది కూడా చదవండి ==> ఈ మొక్క కనిపిస్తే అస్సలు వదలొద్దు.. ఔషధాల గని ఈ మొక్క.. దీని వల్ల ఎన్ని లాభాలో తెలుసా?
ఇది కూడా చదవండి ==> క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే.. వెంటనే జ్యూస్ చేసుకొని తాగేస్తారు..!
ఇది కూడా చదవండి ==> ఈ మొక్క ఎక్కడైనా కనిపిస్తే అస్సలు వదలకండి.. నేల ఉసిరి వల్ల ఎన్ని లాభాలో తెలుసా?
ఇది కూడా చదవండి ==> తిప్ప తీగను వాడేముందు ఈ నిజాలు తెలుసుకోండి