Menstruation : అమ్మాయిలకు సరిగ్గా రుతుస్రావం కాకపోతే ఏం చేయాలి? ఏదైనా చికిత్స తీసుకోవాలా?
Menstruation : చాలామంది అమ్మాయిలు ఈ జనరేషన్ లో చాలా తక్కువ వయసులోనే రజస్వల అవుతుంటారు. 10 ఏళ్లు దాటగానే చాలామంది అమ్మాయిలు రజస్వల అవుతారు. అయితే.. ఆ వయసులోనే వాళ్లకు రుతుస్రావం అంటే ఏంటో కూడా తెలియదు. కానీ.. తన తల్లి, తెలిసిన వాళ్లే అమ్మాయిలకు రుతుస్రావం గురించి, రజస్వల గురించి వివరించాలి. అది ప్రతి నెలా అందరికీ వచ్చేదేనని నచ్చజెప్పాలి. అయితే.. కొందరు అమ్మాయిలు త్వరగా రజస్వల అవుతారు కానీ.. వాళ్లకు నెలనెలా సరిగ్గా రుతుస్రావం కాదు. రెండు మూడు నెలలకు ఓసారి అవుతుంటుంది. దీని వల్ల ఏవైనా సమస్యలు వస్తాయేమోనని పిల్లల తల్లిదండ్రులు కూడా తెగ టెన్షన్ పడుతుంటారు. ఒకసారి రజస్వల అయ్యాక.. పీరియడ్స్ టైమ్ టు టైమ్ ఎందుకు రావు. ఏవైనా హార్మోన్ల ప్రభావమా? లేక దీనికి ఏదైనా మెడిసిన్ వాడాలా? అని తల్లిదండ్రులు తెగ భయపడుతుంటారు. అటువంటి సందేహాలను ఇక్కడ నివృత్తి చేద్దాం రండి.
యుక్త వయసు రాకముందే అంటే 18 ఏళ్ల లోపు రజస్వల అయిన అమ్మాయిల్లో నెలసరి కాస్త అటూ ఇటూగా అవుతుందట. గైనకాలజిస్టులు ఏమంటున్నారంటే.. తక్కువ వయసులో రజస్వల అయిన అమ్మాయిల్లో నెలసరి ఒక్కోసారి లేట్ అవుతుందంటున్నారు. పిల్లల్లో రక్తం ఎక్కువగా లేకపోవడం హార్మోన్ల ప్రభావం కావచ్చు. లేదా పిల్లలు సరిగ్గా తినకపోవడం, పౌష్ఠికాహారాన్ని తీసుకోకపోవడం వల్ల.. నెలసరి లేట్ అవుతుంది. నెలసరి ఒక నెల అటూ ఇటూ అయినంత మాత్రాన పెద్దగా భయపడాల్సిన పనిలేదని నిపుణులు చెబుతున్నారు.
Menstruation : నెలసరి లేట్ అవ్వడానికి కారణాలు ఇవి కావచ్చు
చాలామంది అమ్మాయిలకు థైరాయిడ్ సమస్యలు ఉంటాయి. లేదా యుక్త వయసులో ఎక్కువగా ఉత్పత్తి అయ్యే హార్మోన్ల ప్రభావం కూడా అయి ఉండొచ్చు. కొందరు అధిక బరువుతో బాధపడుతుంటారు. కొందరికి పీసీఓఎస్ సమస్యలు ఉంటాయి. ఇలా.. రకరకాల సమస్యలతో బాధపడే వారిలో ఒక్కోసారి నెలసరి క్రమం తప్పుతుంది. అంత మాత్రాన.. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ పీసీఓఎస్ సమస్య ఉంటే మాత్రం.. దాని కోసం నిపుణులను కలిసి చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. థైరాయిడ్ లాంటి సమస్య ఉన్నా.. పరీక్షలు చేయించుకొని థైరాయిడ్ కు మెడిసిన్ తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ ఎటువంటి సమస్య లేకున్నా నెలసరి ఆలస్యం అయితే మాత్రం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. పిల్లలకు మంచి పౌష్ఠికాహారం అందిస్తే.. నెలసరి సక్రమంగానే వస్తుంది.. అని చెబుతున్నారు గైనకాలజిస్టులు.
ఇది కూడా చదవండి ==> ఈ మొక్క కనిపిస్తే అస్సలు వదలొద్దు.. ఔషధాల గని ఈ మొక్క.. దీని వల్ల ఎన్ని లాభాలో తెలుసా?
ఇది కూడా చదవండి ==> క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే.. వెంటనే జ్యూస్ చేసుకొని తాగేస్తారు..!
ఇది కూడా చదవండి ==> ఈ మొక్క ఎక్కడైనా కనిపిస్తే అస్సలు వదలకండి.. నేల ఉసిరి వల్ల ఎన్ని లాభాలో తెలుసా?
ఇది కూడా చదవండి ==> ఈ కాయలు కనిపిస్తే అస్సలు వదలకండి.. వీటి గురించి తెలిసి డాక్టర్లే నోరెళ్లబెట్టారు?