Nela Usiri : ఈ మొక్క ఎక్కడైనా కనిపిస్తే అస్సలు వదలకండి.. నేల ఉసిరి వల్ల ఎన్ని లాభాలో తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Nela Usiri : ఈ మొక్క ఎక్కడైనా కనిపిస్తే అస్సలు వదలకండి.. నేల ఉసిరి వల్ల ఎన్ని లాభాలో తెలుసా?

 Authored By kondalrao | The Telugu News | Updated on :1 July 2021,8:23 am

Nela Usiri : ఉసిరి కాని ఉసిరి నేల ఉసిరి. ఔషధ గుణాలకు ఈ మొక్క పెట్టింది పేరు. నేల ఉసిరి ఆకులు ఆరోగ్యపరంగా ఎంతో ఉపయోగపడతాయి. దాదాపు ప్రతి అనారోగ్య సమస్యకూ ఈ మొక్క ఆకుల రసాన్ని లేదా చూర్ణాన్ని వాడొచ్చు. ఈ విషయం చాలా మందికి తెలియదు. నేల ఉసిరి ఆకులను మెత్తగా దంచి పుండ్లకు రాస్తే యాంటీ బయాటిక్ మాదిరిగా పనిచేస్తుంది. ఫలితంగా గాయాలు మానతాయి. వాపులు తొందరగా తగ్గుతాయి. నేల ఉసిరి ఆకుల పేస్ట్ కి ఉప్పును కూడా కలిపి దంచి ఆ మిక్చర్ తో కట్టుకడితే విరిగిన ఎముకలు సైతం అతుక్కుంటాయి. అంటే నేల ఉసిరి అంత పవర్ ఫుల్ మొక్క అన్నమాట. చర్మ వ్యాధులను నయం చేసే శక్తి కూడా ఈ మొక్క ఆకుల రసానికి ఉంది.

nela usiri natural plant nela usiri uses

nela-usiri-natural-plant-nela-usiri-uses

నోటి జబ్బులను.. గోటితో..Nela Usiri

కొంత మందికి నోరు, నాలుక, పెదవులు పగులుతాయి. దీంతో భోజనం చేయాలంటే, కారం తగిలితే నరకం కనిపిస్తుంది. ఈ సమస్యకి పరిష్కారం నేల ఉసిరి ఆకుల్లో ఉంది. ఈ ఆకులను రోటిలో వేసి నూరి నీళ్లల్లో వేసి రాత్రి పూట మొత్తం అలాగే ఉంచాలి. తెల్లారి లేచిన తర్వాత ఆ నీటిని నోట్లో పోసుకొని పుక్కిలించాలి. ఇలా చేస్తే పైన చెప్పుకున్న ఇబ్బందులు తొలిగిపోతాయి. నేల ఉసిరి ఆకుల రసాన్ని లేదా పొడిని కషాయం లాగా కాచుకొని తాగితే దగ్గు, ఆయాసం తొలగిపోతాయి. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో దగ్గు, ఆయాసం వంటివి తగ్గటానికి ఇదొక చక్కని మార్గం. నేల ఉసిరి ఆకుల రసాన్ని లేదా చూర్ణాన్ని రోజూ ఉదయం, సాయంత్రం తాగితే కామెర్ల బారి నుంచి బయట పడొచ్చు.

nela usiri natural plant nela usiri uses

nela-usiri-natural-plant-nela-usiri-uses

డైరెక్టుగా తింటే.. ఇన్ డైరెక్టుగా ఎన్నో లాభాలు..: Nela Usiri

నేల ఉసిరి ఆకులను డైరెక్టుగా నమిలి తింటే ఆకలి సమస్య ఉండదు. తిన్న తిండి బాగా అరుగుతుంది. నేల ఉసిరి రసానికి పంచదారి కలిపి తాగితే వెక్కిళ్లు సైతం రావు. మూత్రం రానివాళ్లు నేల ఉసిరి ఆకులను, వేర్లను దంచి తింటే సాఫీగా వస్తుంది. ఆడవాళ్లలో రుతుస్రావం ఎక్కువగా వస్తున్నప్పుడు నేల ఉసిరి ఆకుల చూర్ణాన్ని బియ్యం కడిగిన నీళ్లలో కలుపుకొని తాగితే ఏ ఇబ్బందీ ఉండదు. లివర్, ఫివర్ తదితర అనారోగ్యాలను కూడా నేల ఉసిరి ఆకులు మటుమాయం చేస్తాయి. ఉసిరి ఎంత మేలు చేస్తుందో నేల ఉసిరి కూడా అంతే. నేచురల్ మెడిసిన్. ఫ్రీగా దొరుకుతుంది. కొవిడ్ నేపథ్యంలో ఇలాంటి ఆయుర్వేద మందులకు ప్రాముఖ్యత ఏర్పడింది. సహజసిద్ధంగా లభించే నేల ఉసిరిని ఉపయోగించుకొని ఎటువంటి ఖర్చూ లేకుండా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందొచ్చు.

ఇది కూడా చ‌ద‌వండి ==> ఈ మొక్క కనిపిస్తే అస్సలు వదలొద్దు.. ఔషధాల గని ఈ మొక్క.. దీని వల్ల ఎన్ని లాభాలో తెలుసా?

ఇది కూడా చ‌ద‌వండి ==> క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే.. వెంటనే జ్యూస్ చేసుకొని తాగేస్తారు..!

ఇది కూడా చ‌ద‌వండి ==> అమ్మాయిలకు సరిగ్గా రుతుస్రావం కాకపోతే ఏం చేయాలి? ఏదైనా చికిత్స తీసుకోవాలా?

ఇది కూడా చ‌ద‌వండి ==> ఈ కాయలు కనిపిస్తే అస్సలు వదలకండి.. వీటి గురించి తెలిసి డాక్టర్లే నోరెళ్లబెట్టారు?

kondalrao

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది