Nervous Weakness Remedies : రోజుకి ఒకసారి ఇది తీసుకుంటే నరాల బలహీనత, నరాల నొప్పులు, వాపులు మాయం…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Nervous Weakness Remedies : రోజుకి ఒకసారి ఇది తీసుకుంటే నరాల బలహీనత, నరాల నొప్పులు, వాపులు మాయం…!!

 Authored By prabhas | The Telugu News | Updated on :26 March 2023,2:00 pm

Nervous Weakness Remedies : మారుతున్న టెక్నాలజీ కి అనుగుణంగా మనుషులు కూడా పరుగులు పెడుతుండడంతో రోగాలు కూడా అదే రీతిలో మనల్ని అటాక్ చేస్తున్నాయి. చిన్నపిల్లలు, వృద్దుల వరకు ఈ మధ్య కంప్యూటర్లు బాగా చూస్తున్నారు. తగినంతగా విశ్రాంతి తీసుకోకపోవడం శరీరంలో నీటి శాతం కూడా తగ్గడం ఇలాంటి కారణాలవల్ల ఈ ప్రభావం నరాలపై తీవ్రంగానే పడుతుంది. అయితే ముందుగా ఈ నరాల్లో సమస్య ఎలా మొదలవుతుందంటే.. ఈ నరాలు నొప్పి అనేది ఎక్కువగా మధుమేహం ఉన్నవాళ్లు వస్తుంది. అలాగే ఏదైనా దీర్ఘకాలిక సమస్యలకు మందులు వాడే వాళ్ళకి ఏదైనా గాయాల వల్ల కూడా నరాలు నొప్పి వస్తుంది. ఇక వెన్నులో సమస్య ఉన్నవాళ్లు కూడా నరాల నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది.

అంతేకాకుండా విటమిన్ లోపించినప్పుడు కూడా నరాల బలహీనత వస్తుంది. ఇక ముఖ్యంగా చెప్పుకోవాలంటే నరాలు రక్తప్రసరణ సరిగా జరగకపోవడం వల్ల కూడా నరాల బలహీనత నరాలు నొప్పి వస్తుంది. ఇలా నరాల నొప్పి ఉన్నప్పుడు అశ్రద్ధ చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించడం చాలా మంచిది. ఒకవేళ మీకు గనుక ప్రారంభ దశలో ఇలాంటి నరాల నొప్పి బలహీనత ఉంటే కొన్ని రకాల హోం రెమిడిలతో కూడా మనం నయం చేసుకోవచ్చు. మరి ఈ హోమ్ రెమెడీస్ ఎలా తయారు చేసుకోవాలి? వాటికి ఏమేం కావాలి.. ఎప్పుడెప్పుడు వాడాలి.. అనే విషయాలు కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. మీరు గనక నరాల సంబంధించిన సమస్యతో బాధపడుతూ ఉంటే.. పసుపును తరచుగా వాడండి. అంటే మీరు వండుకునే వంటల్లో ఎక్కువగా పసుపుని యాడ్ చేయండి.

Nerve weakness nerve pain if taken once a day

Nerve weakness, nerve pain if taken once a day

అంతేకాకుండా రాత్రిపూట పడుకోవడానికి ముందు ఒక గ్లాస్ గోరువెచ్చని నీళ్లలో కొంచెం పసుపు కొద్దిగా మిరియాల పొడి వేసుకొని ప్రతిరోజు రాత్రిపూట తీసుకుంటే నరాలకు సంబంధించిన సమస్యలు నయమవుతాయి. ఇక ముఖ్యంగా నరాలకు సంబంధించి ఆపిల్ సైడర్ వెనిగర్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. వారానికి రెండుసార్లు చొప్పున ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో రెండు టేబుల్ స్పూన్ల ఆపిల్ సైడర్ వెనిగర్ వేసి ఒక స్పూన్ వేసి కలుపుకుని తాగితే నరాల నొప్పి సమస్య తగ్గుతుంది. ఇక ఒక అద్భుతమైన టి 1 మీకు పరిచయం చేయబోతున్నాను. ఇది ప్రత్యేకంగా నరాలు నొప్పి తగ్గించడమే కాకుండా చాలా రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెడుతుంది. దీనికోసం ఒక హెర్బల్ కి తయారు చేసుకోబోతున్న ఈ టీ చాలా రుచిగా ఉంటుంది. అలాగే మీ టోటల్ బాడీని శుభ్రంగా క్లీన్ చేస్తుంది.

కొన్ని రకాల వ్యాధులను కూడా పూర్తిగా నయం చేస్తుంది. కాబట్టి నరాల బలహీనతకు సంబంధించి ఎటువంటి లక్షణాలు మనకు ముందుగా తెలుస్తాయి. అనే విషయాలు కూడా చూద్దాం. నరాలు నొప్పిగా అనిపిస్తూ ఉంటాయి. అలాగే తిమ్మిరిగా అనిపించడం.. చక్కెర గింతలు పెట్టినట్టుగా ఉండడం, చురుక్కోమంటూ పొడిచినట్టుగా అనిపించడం, స్పర్శ జ్ఞానాన్ని కూడా కోల్పోవడం ముందు భాగాన్ని పూర్తిగా పైకి ఎత్తలేకపోవడం ఇటువంటి లక్షణాల్లో ఏది కనిపించినా అశ్రద్ధ చేయకుండా అది నరాల బలహీనతకు దారితీస్తుందని ముందుగా గమనించుకోవాలి. అటువంటి వారికి ఇప్పుడు మనం ఒక హెర్బల్ టీ తయారు చేసుకోబోతున్నాం. దీనిలో వాడే ముఖ్యంగా దాల్చిన చెక్క వల్ల రక్తప్రసరణ సవ్యంగా జరుగుతుంది.

Symptoms And Causes For Nerve Root Pain, Tips To Treat Pain

ఇప్పుడు ఈ టీ లో మనం నల్ల యాలుకులను తీసుకుంటున్నాం. అంటే పెద్దగా ఉంటాయి. ఇవి మీకు ఆయుర్వేద షాపుల్లో ఈజీగా దొరుకుతాయి. ఈ నల్ల యాలుకులను ఆయుర్వేద మందులలో ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఇది హై బీపీని తగ్గించడంలో బాగా పనిచేస్తుంది. రక్త పోటును కంట్రోల్లో ఉంచుతుంది. నరాలను క్లీన్ చేయడానికి చాలా అద్భుతంగా పనిచేస్తాయి. మనం ఇప్పుడు తీసుకుపోయే మరో ఇంగ్రిడియంట్ లవంగాలు లవంగాలు మన శరీరంలోని వేడిని తగ్గిస్తాయి. మలబద్ధకానికి లవంగాలు చాలా బాగా ఉపయోగపడతాయి. లవంగాల్లో ఐరన్, మెగ్నీషియం,

క్యాల్షియం, ఫాస్ఫరస్, పొటాషియం, సోడియం ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక మందపాటి గిన్నెలో ఒక గ్లాస్ వాటర్ వేయండి సిమ్ లోనే ఉంచాలి. ఇప్పుడు మనం మూడు ఇంగ్రిడియంట్స్ తీసుకున్నాం కదా.. ఇందులో దాల్చిన చెక్కను పొడిగా చేసి ఒక గాజు కంటైనర్ లో స్టోర్ చేసుకోండి. ఈ మూడు పొడులను ఒక్కొక్క స్పూన్ ఆ వాటర్ లో వేసి ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి బాగా కలిపి లో ఫ్లేమ్ లోనే ఐదు నుంచి పది నిమిషాల వరకు బాగా మరిగించాలి. బాగా మరిగిన తర్వాత వాటర్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీనిని ఒక గ్లాసులోకి వడకట్టుకోవాలి.ఈ డ్రింక్ కేవలం నరాలకు మాత్రమే కాదు.. ఎముకల బలహీనతకు చాలా బాగా ఉపయోగపడుతుంది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది