Diabetic Patient : డయాబెటిస్ ఉన్నవారు ఈ 4 తప్పులు అస్సలు చేయకండి…. తస్మాత్ జాగ్రత్త…!
ప్రధానాంశాలు:
Diabetic Patient : డయాబెటిస్ ఉన్నవారు ఈ 4 తప్పులు అస్సలు చేయకండి.... తస్మాత్ జాగ్రత్త...!
Diabetic Patient : ప్రస్తుత కాలంలో డయాబెటిస్ Diabetes కేసులు రోజురోజుకు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి . చిన్న పెద్ద తేడా లేకుండా చాలామంది ఈ జబ్బు బారిన పడుతున్నారు. అందుకే ప్రస్తుత కాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అనేది చాలా ముఖ్యమైనది . అయితే ఈ మధుమేహం అనేది దీర్ఘకాలిక వ్యాధి. ఒక్కసారి ఈ వ్యాధి బారిన పడ్డారంటే జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. అంతేకాక ఈ జబ్బుతో బాధపడేవారు ఎప్పటికప్పుడు వారి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవాలి. లేకుంటే ప్రాణానికే ప్రమాదం. అందుకే డయాబెటిస్ వచ్చినవారు ఏ రకమైన నిర్లక్ష్యం చేయకూడదని నిపుణులు సూచిస్తుంటారు. మరి ఈ డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్న వారి ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచడానికి ఏం చేయాలి ఎలాంటి పరిహారాలు పాటించాలి ఇప్పుడు తెలుసుకుందాం .
Diabetic Patient శారీరక శ్రమ…
శరీరం చురుగ్గా ఉండాలంటే కచ్చితంగా శారీరక శ్రమ ఉండాలి. అప్పుడే మానసిక ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుంది. తగినంత శారీరక శ్రమ లేకపోతే బరువు పెరగడం మరియు ఇన్సులిన్ నిరోధకతకు దారితీస్తుంది.ఇది డయాబెటిస్ వ్యాధిగ్రస్తులను మరింత ఇబ్బంది పెడుతుంది కాబట్టి ఈ సమస్యతో బాధపడేవారు ప్రతిరోజు కాసేపు నడవడం, జాగింగ్ చేయడం వంటివి చేయడం మంచిది. అయితే వ్యాయామం చేయడం చాలా శ్రమతో కూడుకున్న పని కాబట్టి ప్రతిరోజు ఒక గంట పాటు వ్యాయామం చేస్తే మంచిది.
Diabetic Patient ఫైబర్ …
శరీర ఆరోగ్యానికి ఫైబర్ ఎన్నో రకాలుగా పనిచేస్తుంది. మరి ముఖ్యంగా మధుమేహం నిర్వహణలో ఇది ముఖ్యపాత్ర వహిస్తుంది. కావున ఫైబర్ ఆధారిత ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం వలన రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచవచ్చు. కావున మధుమేహ సమస్యతో బాధపడేవారు ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవడం మంచిది. దీనికోసం త్రునధాన్యాలు ,పండ్లు , డ్రై ఫ్రూట్స్, కూరగాయలు, గింజలు వంటివి రోజు వారి ఆహారంలో చేర్చుకోవడం మంచిది.
Diabetic Patient ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు …
ప్రాసెస్ చేసినా లేదా ప్యాక్ చేసినటువంటి ఆహారాలను తీసుకోవడం ఆరోగ్యానికి అసలు మంచిది కాదు. ఎందుకంటే వీటిలో ఉప్పు మరియు చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మధుమేహ సమస్యతో బాధపడేవారు కేవలం ఇంట్లో వండిన ఆహారాలను తీసుకోవడం మంచిది.
అధిక GI ఉన్న ఆహారాలు…
అధిక గ్లైశనిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాలను తీసుకోవడం వలన రక్తంలో చక్కెర స్థాయిలు వెంటనే పెరుగుతాయి. అంతేకాక ఇవి గ్లూకోజ్ స్థాయిల పై తక్కువ ప్రభావాన్ని చూపిస్తాయి.