Smile Depression : ఈ లక్షణాలు ఉంటే స్మైల్ డిప్రెషన్ ఉన్నట్లే… చాలా ప్రమాదం జాగ్రత్త…!
ప్రధానాంశాలు:
Smile Depression : ఈ లక్షణాలు ఉంటే స్మైల్ డిప్రెషన్ ఉన్నట్లే... చాలా ప్రమాదం జాగ్రత్త...!
Smile depression : ప్రస్తుత కాలంలో మారిన ఆహారపు అలవాట్లు మరియు పని ఒత్తిడి Smile Depression కారణంగా చాలామంది అనేక రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అయితే పని ఒత్తిడి మరియు నిద్రలేమి కారణంగా కొందరిలో స్మైల్ డిప్రెషన్ సమస్య అనేది ఉంటుంది. మరి ఈ స్మైల్ డిప్రెషన్ అంటే ఏమిటి…దీని లక్షణాలు ఎలా ఉంటాయి…ఈ లక్షణాలు ఉన్నవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి….ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
స్మైల్ డిప్రెషన్ అంటే అంతర్గతంగా అనుభవిస్తున్న దుఃఖాన్ని ఒత్తిడిని తనలో దాచుకొని బయట ప్రపంచానికి మాత్రం ఎప్పుడూ నవ్వుతూ కనిపించే మానసిక స్థితి. ఈ పరిస్థితుల్లో ఒక వ్యక్తి తన బాధను తనలో తానే దాచుకుని అందరి ముందు చాలా సంతోషంగా ఉన్నట్లు నటిస్తాడు. తన లోపల తాను ఎంత నిరాశతో పోరాడుతున్న ఎదుటివారికి దానిని తెలియజేయడు. అయితే ఈ సమస్య తరచూ సామాజిక ఒత్తిడి కారణంగా ఏర్పడుతుంది.వైద్య నిపుణులు తెలిపిన సమాచారం ప్రకారం ఈ స్మైల్ డిప్రెషన్ ఎక్కువగా నిద్రపోవడం ,శక్తి లేకపోవడం అతిగా తినడం వలన వస్తుందట.
దీంతో ఈ సమస్య ఉన్నవారు ఎప్పుడూ చిరునవ్వుతో కనిపిస్తూ లోపల మాత్రం బాధ పడుతూ ఉంటారు. ఇక ఈ సమయంలో వారి పడుతున్న బాధను ఇతరులకు పంచుకోరు. ఈ విధంగా చేయడం సమస్యను మరింత పెంచినట్లు అవుతుంది.ఈ స్మైల్ డిప్రెషన్ మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీయడమే కాకుండా శారీరక ఆరోగ్యం పై కూడా ప్రభావం చూపుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇదేవిధంగా నిరంతరం భావద్వేగాలను దాచుకొని ఒత్తిడికి గురైతే కొన్నిసార్లు ఆత్మహత్య కూడా చేసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. కావున ఈ లక్షణాలు ఉన్న వారు వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
చికిత్స ఎలా …
ఈ స్మైల్ డిప్రెషన్ సమస్యకు చికిత్స చేయవచ్చు. దీనికోసం వ్యక్తి తన భావాలను ఎదుటివారితో పంచుకోవాలి. అలాగే మానసిక ఆరోగ్య నిపుణుల సలహాలు తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం మరియు సమతుల్య ఆహారం తీసుకోవాలి. అలాగే ఈ సమస్య నుంచి రోగి బయటపడడంలో కుటుంబం మరియు స్నేహితులు ముఖ్య పాత్ర పోషించాల్సి ఉంటుంది.