Palm Oil : పామాయిల్ తెలియని వారు ఉండరు. ఎందుకంటే.. ప్రతి వంటింట్లో పామాయిల్ ఖచ్చితంగా ఉంటుంది. పామాయిల్ తో చాలా వంటకాలు చేస్తారు. ముఖ్యంగా అప్పలను పామాయిల్ తోనే చేస్తారు. కొందరు దీన్నే వంట నూనెగానూ వాడుతారు. ఎందుకంటే.. అన్ని నూనెల కన్నా ఈ నూనె ధర చాలా తక్కువగా ఉంటుంది. అందుకే.. ఈ నూనెనే ఎక్కువగా కొంటున్నారు జనాలు. అయితే.. పామాయిల్ అనేది ఆరోగ్యానికి మంచిదేనా? అనే విషయం చాలామందికి తెలియదు.
మీకు ఇంకో విషయం తెలుసా? బయట మార్కెట్ లో దొరికే ప్యాక్ చేసిన ఆహారం మొత్తం ఈ ఆయిల్ తోనే తయారు అవుతుంది. చిప్స్ కానీ.. మిక్చర్ కానీ.. బోందీ కానీ.. నామ్ కీన్స్ కానీ.. ఇతర స్నాక్స్ ఆహార పదార్థాలన్నింటినీ పామాయిల్ తోనే తయారు చేస్తారు. అంటే.. ఇంట్లో మనం పామాయిల్ ఉపయోగించకున్నా.. బయట ఖచ్చితంగా ఏదైనా ఆహారం తింటే.. అందులో పామాయిల్ ఖచ్చితంగా ఉంటుంది. ఇటువంటి నేపథ్యంలో అసలు.. పామాయిల్ తినొచ్చా? పామాయిల్ తింటే మంచిదేనా? దాని వల్ల ఎలాంటి నష్టాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
పామాయిల్ ను ఎక్కువగా ఉపయోగిస్తే.. ఫ్యాటీ లివర్ సమస్య వస్తుందట. అలాగే.. క్యాన్సర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులు కూడా వస్తాయట. పామాయిల్ ను ఎక్కువగా స్నాక్స్ ఐటెమ్స్ లో ఉపయోగిస్తారని చదువుకున్నాం కదా. బయట హోటల్ లో ఎక్కడికెళ్లినా.. పామాయిల్ తో చేసిన వంటకాలే ఉంటాయి.
పామాయిల్ ను తయారు చేసే పండ్లలో రెండు రకాలు ఉంటాయి. ఒకటి ఎరుపు రంగులో ఉండే పండ్లు, రెండోది కాషాయం రంగులో ఉండే పండ్లు. ఈ పండ్ల నుంచే నూనెను తయారు చేస్తారు. ఈ పండ్ల నుంచి నూనె తీశాక.. దాన్ని రిఫైన్ చేయకపోతే.. దాన్ని రెడ్ పామ్ ఆయిల్ అంటారు. అయితే.. దీంట్లో అన్ సాచురేటెడ్ ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దాని వల్ల.. అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ఒబెసిటీ, వాస్క్యులర్ డిసీజ్ లు వస్తాయి. పామ్ ఆయిల్ ను ఎక్కువగా వాడటం వల్ల శరీరంలో చెడు కొలెస్టరాల్ పెరుగుతుంది. తద్వారా గుండె జబ్బులు సంభవిస్తాయి.
ఇది కూడా చదవండి ==> ప్యాకెట్ పాలు కొనుక్కొని తాగుతున్నారా? అసలు.. ఏ పాలు మంచివో తెలుసుకోండి..!
ఇది కూడా చదవండి ==> ఉదయం అల్పాహారంగా దీన్ని తింటే.. ప్రాణాలకే ప్రమాదం..!
ఇది కూడా చదవండి ==> గోధుమ పిండితో చేసిన రోటీలను ఈ సమస్యలు ఉన్నవాళ్లు అస్సలు తినకూడదు
ఇది కూడా చదవండి ==> షుగర్ పేషెంట్లు కోడిగుడ్లు తింటే ఏమౌతుంది? షుగర్ ఉన్నవాళ్లు అసలు ఎగ్స్ తినొచ్చా? తినకూడదా?
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.