Diabetes : షుగర్ పేషెంట్లు కోడిగుడ్లు తింటే ఏమౌతుంది? షుగర్ ఉన్నవాళ్లు అసలు ఎగ్స్ తినొచ్చా? తినకూడదా?
Diabetes : చాలామంది షుగర్ వ్యాధి ఉన్నవాళ్లు.. తమ ఆహారపు అలవాట్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎందుకంటే.. ఒక్కసారి షుగర్ వచ్చిందంటే.. ఇక ఏం తినాలో? ఏం తినకూడదో? స్పష్టంగా తెలుసుకోవాలి. ఏది పడితే అది తింటే.. షుగర్ లేవల్స్ ఎక్కువవుతాయి. అందుకే.. షుగర్ వచ్చినవాళ్లు తమ ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఏది తినాలన్నా ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు. షుగర్ రాకముందు.. ఏది పడితే అది తిన్నా నడుస్తుంది కానీ.. షుగర్ […]
Diabetes : చాలామంది షుగర్ వ్యాధి ఉన్నవాళ్లు.. తమ ఆహారపు అలవాట్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎందుకంటే.. ఒక్కసారి షుగర్ వచ్చిందంటే.. ఇక ఏం తినాలో? ఏం తినకూడదో? స్పష్టంగా తెలుసుకోవాలి. ఏది పడితే అది తింటే.. షుగర్ లేవల్స్ ఎక్కువవుతాయి. అందుకే.. షుగర్ వచ్చినవాళ్లు తమ ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఏది తినాలన్నా ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు. షుగర్ రాకముందు.. ఏది పడితే అది తిన్నా నడుస్తుంది కానీ.. షుగర్ వచ్చాక ఇక డాక్టర్లు చెప్పిన విషయాన్నే పాటించాలి. లేదంటే లేనిపోని సమస్యలు వస్తాయి. డయాబెటిస్ వల్ల.. ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి.
అయితే.. చాలామందికి ఒక అనుమానం ఉంటుంది. షుగర్ ఉన్నవాళ్లు కోడిగుడ్లు తినకూడదు అని చెబుతారు. కోడిగుడ్లు తింటే.. గుండె జబ్బులు వస్తాయంటారు. అందుకే.. షుగర్ పేషెంట్లు అస్సలు కోడిగుడ్లు తినకూడదంటూ చెబుతుంటారు. దీంతో షుగర్ ఉన్నవాళ్లు కోడిగుడ్లను ముట్టుకోవాలంటేనే భయపడతారు. అస్సలు వాటిని ముట్టుకోరు. మరి.. నిజంగానే షుగర్ ఉన్నవాళ్లు కోడిగుడ్లను తినకూడదా? తింటే ఏమౌతుంది? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Diabetes : షుగర్ ఉన్నవాళ్లు ఎగ్స్ తింటే శరీరంలో జరిగే మార్పులు ఇవే
షుగర్ ఉన్నవాళ్లపై ఇటీవల ఓ అధ్యయనం జరిపారు. వాళ్లకు నిత్యం గుడ్లు తినిపించి వాళ్ల షుగర్ లేవల్స్ ను పరిశోధకులు టెస్ట్ చేశారు. అయితే.. గుడ్డు తినడం వల్ల.. షుగర్ వ్యాధిగ్రస్తులకు ప్రమాదం అనేది వాస్తవం కాదని అందులో తేలింది. ఎందుకంటే.. డయాబెటిస్ టైప్ 1 అయినా టైప్ 2 అయినా ఉన్నవాళ్లు గుడ్డును నిత్యం తీసుకోవడం వల్ల.. వాళ్లలో గుండె జబ్బులు తగ్గాయని తేలిందట.
అంటే.. మధుమేహం ఉన్నవాళ్లు ఎగ్స్ ను నిరభ్యంతరంగా తినొచ్చు. అందులో ఎటువంటి సందేహం లేదు. మధుమేహం ఉన్నవాళ్లు గుడ్లను తింటే.. గుండె జబ్బుల ముప్పు చాలావరకు తగ్గిందట. అలాగే.. గుడ్లలో ఎన్నో పోషకాలు ఉంటాయి. అవి ఆరోగ్యానికి మంచిదే. ఒంట్లో శక్తి లేని వాళ్లు, నీరసంగా ఉన్నవాళ్లు, పోషకాలు తక్కువ ఉన్నవాళ్లు షుగర్ ఉన్నా సరే.. నిత్యం ఉడకబెట్టిన గుడ్డును తింటే.. చాలామంచిది అని నిపుణులే సూచిస్తున్నారు. గుడ్డులో ఉండే ప్రొటీన్స్, సూక్ష్మ పోషకాలు.. మధుమేహం పేషెంట్లకు ఎంతో ఉపయోగపడతాయట. అది అసలు సంగతి.
ఇది కూడా చదవండి ==> అన్నంతో పాటు పచ్చి ఉల్లిగడ్డను తింటున్నారా? ముందు ఇది చదవండి..!
ఇది కూడా చదవండి ==> బొడ్డు మీద నూనె రాస్తే ఇన్నిలాభాలు ఉన్నాయా? వెలుగులోకి సంచలన నిజాలు
ఇది కూడా చదవండి ==> ఈ మూడు లక్షణాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా షుగర్ వచ్చినట్టే? అవేంటో ఇప్పుడే తెలుసుకోండి..!
ఇది కూడా చదవండి ==> రాత్రిపూట టీకాఫీలు తెగ తాగేస్తున్నారా? ముందు ఇది తెలుసుకోండి.. లేకపోతే ప్రాణాలకే ప్రమాదం