Chapati : గోధుమ పిండితో చేసిన రోటీలను ఈ సమస్యలు ఉన్నవాళ్లు అస్సలు తినకూడదు
Chapati : మనిషి ఆరోగ్యంగా ఉండాలి అంటే.. మంచి ఆహారం తీసుకోవాలి. పౌష్ఠికాహారం తినాలి. లేదంటే లేనిపోని సమస్యలు వస్తాయి. చాలామంది డైట్ అని పాటిస్తుంటారు. అంటే.. మంచి ఆహారం తీసుకోవడమే డైట్. శరీరంలో ఉండే చెడు కొలెస్టరాల్ ను తగ్గించడమే డైట్. మనిషికి ఒక జీవన శైలి ఉంటుంది. ఒక స్టయిల్ ఉంటుంది. ఆహారపు అలవాట్లు ఉంటాయి. ఆ అలవాట్లు తప్పాయంటే ఇక అంతే. ఆరోగ్యం పరంగా ఎన్నో సమస్యలు వస్తాయి.
చాలామందికి ఈ మధ్య గ్లూటెన్ సెన్సిటివిటీ అనే సమస్య వస్తోంది. దీనికి కారణం.. గ్లూటెన్ అనే పదార్థం ఉన్న ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం. ఇది గోధుమ పిండి, మైదా పిండిలో ఎక్కువగా ఉంటుంది. ఈ ఆహార పదార్థాలు తీసుకుంటే.. గ్లూటెన్ శరీరంలో ఎక్కువ స్థాయిలో ఉంటుంది. దీని వల్ల చాలా సమస్యలు వస్తాయి. కడుపు నొప్పి, అలసట, డిప్రెషన్, తలనొప్పి, డయేరియా లాంటి సమస్యలు వస్తుంటాయి.
Chapati : గ్లూటెన్ సెన్సిటివిటీ ఉందని ఎలా తెలుసుకోవాలి?
చాలామందికి తమలో గ్లూటెన్ సెన్సిటివిటీ సమస్య ఉందని తెలుసుకోరు. ఎందుకంటే.. మనం తినే ఆహారంలో గ్లూటెన్ సెన్సిటివిటీ సమస్య ఉందని తెలుసుకోవడం ఎలా అంటే.. నిత్యం కడుపు నొప్పిగా ఉన్నా… డిప్రెషన్ తో ఉన్నా.. మానసిక ప్రశాంతత లేకున్నా.. మలబద్ధకం ఉన్నా.. కడుపు ఉబ్బరంగా ఉన్నా.. ఇలాంటి సమస్యలు నిత్యం వేధిస్తున్నా ఖచ్చితంగా గ్లూటెన్ సెన్సిటివిటీ సమస్య ఉన్నట్టే. అది ఉంటే.. ఇక మీరు తినే ఆహారంలో అస్సలు గ్లూటెన్ ఉండకూడదు. మీరు గ్లూటెన్ ఉండే ఆహార పదార్థాలను తీసుకోగానే మీకు పైన చెప్పిన సమస్యలు వస్తాయి. దీంతో గ్లూటెన్ సెన్సిటివిటీ సమస్య ఉందని గ్రహించాలి.
అటువంటి సమస్యతో బాధపడుతున్నవాళ్లు గోధుమ పిండితో చేసిన రోటీలను, చపాతీలను అస్సలు తినకూడదు. గోధుమ పిండి బదులు.. గ్లూటెన్ లేని జొన్న పిండితో చేసిన రొట్టెలు, రాగి పిండితో చేసిన రొట్టెలను తీసుకోవాలి. అలాగే.. అవి ఆరోగ్యానికి ఎంతో మంచివి కూడా. ఎంతో మేలు చేస్తాయి.
ఇది కూడా చదవండి ==> అన్నంతో పాటు పచ్చి ఉల్లిగడ్డను తింటున్నారా? ముందు ఇది చదవండి..!
ఇది కూడా చదవండి ==> బొడ్డు మీద నూనె రాస్తే ఇన్నిలాభాలు ఉన్నాయా? వెలుగులోకి సంచలన నిజాలు
ఇది కూడా చదవండి ==> ఈ మూడు లక్షణాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా షుగర్ వచ్చినట్టే? అవేంటో ఇప్పుడే తెలుసుకోండి..!
ఇది కూడా చదవండి ==> రాత్రిపూట టీకాఫీలు తెగ తాగేస్తున్నారా? ముందు ఇది తెలుసుకోండి.. లేకపోతే ప్రాణాలకే ప్రమాదం