Milk : ప్యాకెట్ పాలు కొనుక్కొని తాగుతున్నారా? అసలు.. ఏ పాలు మంచివో తెలుసుకోండి..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Milk : ప్యాకెట్ పాలు కొనుక్కొని తాగుతున్నారా? అసలు.. ఏ పాలు మంచివో తెలుసుకోండి..!

 Authored By jagadesh | The Telugu News | Updated on :16 July 2021,10:00 am

Milk : మిల్క్.. పాలు ఇవి లేని వంటిల్లు ఉండదు. ప్రతి కిచెన్ లో పాలు ఖచ్చితంగా ఉండాల్సిందే. అవి లేనిదే రోజు గడవదు. ఉదయం లేవగానే చాయ్ తాగడం దగ్గర్నుంచి.. రాత్రి పడుకునే ముందు పాలు తాగి పడుకోవడం వరకు.. పాలను మనం వాడుతూనే ఉంటాం. చిన్నపిల్లలకు కూడా ఎక్కువగా పాలు తాగిపిస్తుంటాం. ఏదో ఒక రూపంలో అందరూ పాలను తీసుకుంటూనే ఉంటారు. అయితే.. పాలల్లోనూ చాలా రకాలు వచ్చాయి. ప్రస్తుతం మార్కెట్ లో పాలు చాలా రూపాల్లో దొరుకుతున్నాయి. అయితే.. ఏ పాలు తాగాలి? చిన్నపిల్లలకు అయితే ఏ పాలు మంచివి? పెద్దలు ఏ పాలు తాగాలి అనే విషయం చాలామందికి తెలియదు.

raw milk vs packet milk which is healthier

raw milk vs packet milk which is healthier

ఉదయం లేవగానే.. మార్కెట్ కు వెళ్లడం.. అక్కడ పాల ప్యాకెట్ ను తీసుకురావడం.. వాటిని తాగేయడం. ప్రతి రోజు మన ఆహారంలో పాలు ఇంత ముఖ్యం అయినప్పుడు.. తాగే పాలు.. మంచివి ఉండాలి కదా. క్వాలిటీ పాలు ఉండాలి కదా. ఆరోగ్యానికి మంచిగా ఉండే పాలు ఉండాలి కదా. అందుకే.. ఏ పాలు తాగితే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.

Milk : ఏ పాలు తాగాలి? ఏ పాలు తాగకూడదు?

చాలామంది ప్యాకెట్ పాల కన్నా కూడా.. టెట్రా ప్యాక్ లో లభించే పాలు సురక్షితం అని చెబుతుంటారు. వాటినే కార్టన్ మిల్క్ అని కూడా అంటారు. ఎందుకంటే.. ఈ టెట్రా ప్యాక్ ను అల్ట్రా హైటెంపరేచర్ పద్ధతిలో ప్యాక్ చేస్తారు. అంటే.. ఈ పాలను ముందు.. హైటెంపరేచర్ లో వేడి చేశాక.. ఆ తర్వాత చల్లబరిచి మళ్లీ ప్యాక్ చేస్తారు. అలా చేయడం వల్ల.. ఆ పాలల్లో ఉన్న మైక్రో బ్యాక్టీరియా, ప్యాథోజెన్స్ ను నశిస్తాయి. అందువల్ల.. ఆ పాలను తాగితే.. ఎటువంటి సమస్య ఉండదని నిపుణులు సూచిస్తున్నారు.

raw milk vs packet milk which is healthier

raw milk vs packet milk which is healthier

చాలామంది డైరెక్ట్ గా బర్రె పాలను, ఆవు పాలను కొనుక్కొని తాగుతుంటారు. వాటినే పచ్చి పాలు అని అంటారు. చాలామంది ఇంటికి వచ్చి బర్రె పాలు కానీ.. ఆవు పాలు కానీ పితకగానే పోసి వెళ్తుంటారు. వాటిలో ఎటువంటి కల్తీ జరగకపోతే.. ఆ పాలు తాగడం చాలా బెటర్. పిల్లలకు కూడా ఆ పాలనే తాగించడం బెటర్. అవి ఆరోగ్యానికి ఎంతో మంచిది. అవి పాశ్చరైజేషన్ చేయని పాలు. కాబట్టి.. ఆ పాలను నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. కాకపోతే కల్తీ జరగకుండా చూసుకోవాలి.

raw milk vs packet milk which is healthier

raw milk vs packet milk which is healthier

ప్రస్తుతం అందరూ ఆర్గానిక్ ఆహారం వైపు పరిగెడుతున్నారు. అలాగే.. ఆర్గానిక్ మిల్క్ కూడా ప్రస్తుతం ఆదరణ పొందుతున్నాయి. ఆర్గానికి పాలు అంటే.. ఆవులు, బర్రెలు.. వాటికి వేసే దాణా ఆర్గానిక్ గా ఉంటుంది. అప్పుడు అవి ఇచ్చే పాలు కూడా ఆర్గానిక్ పాలు అవుతాయి. వాటికి పెట్టే ఆహారంలో ఎటువంటి రసాయనాలు కలవని ఫుడ్ ఉంటుంది. అలాగే.. వాటికి ఎటువంటి ఇంజెక్షన్లు కూడా ఇవ్వరు. పూర్తిగా ఆర్గానిక్ పద్ధతిలో పాలను వచ్చేలా చేస్తారు. ఈ పాలను కూడా నిరభ్యంతరంగా తాగొచ్చు. కాకపోతే.. అవి నిజంగానే ఆర్గానికా? కాదా? అనే విషయం ముందే తెలుసుకోవాల్సి ఉంటుంది.

raw milk vs packet milk which is healthier

raw milk vs packet milk which is healthier

చాలామంది ప్యాకెట్ పాలవైపు మొగ్గు చూపుతుంటారు. అయితే.. ప్యాకెట్ లో ఉండే పాలను.. ఒక టెంపరేచర్ వద్దనే పాశ్చరైజ్ చేస్తారు. దాని వల్ల.. కేవలం మైక్రో ఆర్గానిజమ్స్ మాత్రమే నశిస్తాయి కానీ.. ప్యాథోజెన్స్ నశించవు. అందుకే.. ప్యాకెట్ పాల లైఫ్ టైమ్ కూడా చాలా తక్కువగా ఉంటుంది.

మీరు ఉండే ప్రాంతాల్లో వేరే పాలు దొరకకపోతే.. ఆప్షన్ లేకపోతేనే ప్యాకెట్ పాలు తీసుకోండి. అది కూడా వాటిని వెంటనే వాడాలి. లేకపోతే లేనిపోని సమస్యలు వస్తాయి. మీరు ఉన్నప్రాంతంలో ఏ పాలు అయితే బెస్ట్ అని అనిపిస్తాయో.. ఆ పాలనే తాగండి. ఏ పాలు పడితే ఆ పాలు తాగి.. ఆరోగ్యాన్ని మాత్రం నాశనం చేసుకోకండి.

ఇది కూడా చ‌ద‌వండి ==> అన్నంతో పాటు పచ్చి ఉల్లిగడ్డను తింటున్నారా? ముందు ఇది చదవండి..!

ఇది కూడా చ‌ద‌వండి ==> బొడ్డు మీద నూనె రాస్తే ఇన్నిలాభాలు ఉన్నాయా? వెలుగులోకి సంచలన నిజాలు

ఇది కూడా చ‌ద‌వండి ==> ఈ మూడు లక్షణాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా షుగర్ వచ్చినట్టే? అవేంటో ఇప్పుడే తెలుసుకోండి..!

ఇది కూడా చ‌ద‌వండి ==> రాత్రిపూట టీకాఫీలు తెగ తాగేస్తున్నారా? ముందు ఇది తెలుసుకోండి.. లేకపోతే ప్రాణాలకే ప్రమాదం

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది