Breakfast : ఉదయం అల్పాహారంగా దీన్ని తింటే.. ప్రాణాలకే ప్రమాదం..!
Breakfast : ఉదయం అల్పాహారం తీసుకోవడం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే.. రాత్రిపూట తిన్నాక పడుకొని ఉదయం లేస్తాం. అంటే.. మధ్యలో కనీసం 10 గంటల గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ లో ఏం తినం కాబట్టి.. కడుపు ఖాళీగా ఉంటుంది. అందుకే.. ఉదయమే తొందరగా ముఖం కడుక్కొని ఏదో ఒకటి తినాలంటారు ఆరోగ్య నిపుణులు. అందుకే.. ఏదో ఒక అల్పాహారం తీసుకోవాలి. లేదంటే శరీరం నీరసించిపోతుంది. అయితే.. ఈ విషయం తెలియక చాలామంది ఉదయం అల్పాహారాన్ని […]
Breakfast : ఉదయం అల్పాహారం తీసుకోవడం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే.. రాత్రిపూట తిన్నాక పడుకొని ఉదయం లేస్తాం. అంటే.. మధ్యలో కనీసం 10 గంటల గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ లో ఏం తినం కాబట్టి.. కడుపు ఖాళీగా ఉంటుంది. అందుకే.. ఉదయమే తొందరగా ముఖం కడుక్కొని ఏదో ఒకటి తినాలంటారు ఆరోగ్య నిపుణులు. అందుకే.. ఏదో ఒక అల్పాహారం తీసుకోవాలి. లేదంటే శరీరం నీరసించిపోతుంది. అయితే.. ఈ విషయం తెలియక చాలామంది ఉదయం అల్పాహారాన్ని కూడా స్కిప్ చేస్తారు. డైరెక్ట్ గా లంచ్ చేస్తుంటారు. అలా అస్సలు చేయకూడదు. ఉదయం 9 లోపే అల్పాహారాన్ని తీసుకోవాలి. అల్పాహారం పేరుకే కానీ.. తినేదేదో మంచిగా ఫుల్లుగా తినేయాలి.
అయితే.. చాలామంది ఉదయం అల్పాహారంగా దోశ, ఇడ్లీ, వడ, మైసూర్ బోండా, ఉప్మా లాంటివి చేసుకొని తింటారు. ఉద్యోగాలు చేసేవాళ్లు, బిజీ లైఫ్ గడిపే వాళ్లు మాత్రం సెరల్స్ ను తింటుంటారు. మార్కెట్ లో సెరల్స్ ను కొనుక్కొని వచ్చి దాని నిండా పాలు పోసుకొని ఓ బౌల్ లో వేసుకొని వాటినే గబగబా తినేసి పనులకు పరిగెడుతుంటారు. అయితే.. ఇలా తినడం మంచిది కాదట. ఏదో ఒక్కసారి.. అత్యవసర పరిస్థితుల్లో.. టిఫిన్ అందుబాటులో లేని పరిస్థితుల్లో సెరల్స్ ఓకే కానీ.. నిత్యం సెరల్స్ నే తింటే మాత్రం ప్రాణాలకే ప్రమాదం అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
Breakfast : సెరల్స్ ను ఎందుకు బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోవద్దు?
సెరల్స్ ను ఎందుకు బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోకూడదో.. దానికి కారణాలు కూడా చెబుతున్నారు. సెరల్స్ అంటే అవి ధాన్యాలతో తయారు చేసినవి. వాటిని నిత్యం తీసుకుంటే.. ఒత్తిడి ఎక్కువవుతుందట. మూడ్ కూడా మారుతుందట. మూడ్ స్వింగ్స్ వస్తాయట. డయాబెటిస్ కూడా వస్తుందట. బ్లడ్ లో షుగర్ లేవల్స్ ఒక్కసారిగా పెరిగిపోతాయని దాని వల్ల షుగర్ వ్యాధికి గురికావాల్సిందేనని చెప్పుకొచ్చారు. అలాగే.. వీటిలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. దాని వల్ల త్వరగా బరువు పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే.. వీటిలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. ఎక్కువ కార్బోహైడ్రేట్స్ కూడా శరీరానికి మంచిది కాదు. దాని వల్ల లేనిపోని సమస్యలు వస్తాయి.
ఒకవేళ ఖచ్చితంగా సెరల్స్ ను తినాలి అని అనుకుంటే మాత్రం.. కొంత మేరకే సెరల్స్ ను తీసుకొని.. వాటికి తగినట్టుగా పాలు పోసుకొని తినాలని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు. లేదంటే.. అప్పుడప్పుడు సెరల్స్ తీసుకుంటూ.. మధ్యమధ్యలో ఇతర రకాల బ్రేక్ ఫాస్ట్ లను కూడా తినాలని చెబుతున్నారు. లేదంటే.. అనవసరంగా లేనిపోని సమస్యలను కోరి తెచ్చుకున్నట్టేనని హెచ్చరిస్తున్నారు.
ఇది కూడా చదవండి ==> అన్నంతో పాటు పచ్చి ఉల్లిగడ్డను తింటున్నారా? ముందు ఇది చదవండి..!
ఇది కూడా చదవండి ==> బొడ్డు మీద నూనె రాస్తే ఇన్నిలాభాలు ఉన్నాయా? వెలుగులోకి సంచలన నిజాలు
ఇది కూడా చదవండి ==> ఈ మూడు లక్షణాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా షుగర్ వచ్చినట్టే? అవేంటో ఇప్పుడే తెలుసుకోండి..!
ఇది కూడా చదవండి ==> రాత్రిపూట టీకాఫీలు తెగ తాగేస్తున్నారా? ముందు ఇది తెలుసుకోండి.. లేకపోతే ప్రాణాలకే ప్రమాదం