Pink Banana : ప్రతిరోజు ఇలాంటి అరటిపండు ఒకటి ఖాళీ కడుపుతో తింటే చాలు… ఎలాంటి వ్యాధులైన పరార్…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Pink Banana : ప్రతిరోజు ఇలాంటి అరటిపండు ఒకటి ఖాళీ కడుపుతో తింటే చాలు… ఎలాంటి వ్యాధులైన పరార్…!

 Authored By ramu | The Telugu News | Updated on :28 March 2024,10:00 am

ప్రధానాంశాలు:

  •  Pink Banana : ప్రతిరోజు ఇలాంటి అరటిపండు ఒకటి ఖాళీ కడుపుతో తింటే చాలు... ఎలాంటి వ్యాధులైన పరార్...!

Pink Banana : అరటిపండు అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఎంతో ఇష్టంగా ఉంటారు.. అయితే అసలు అరటి పండ్లు ఎన్ని రకాలు ఉన్నాయో చాలామందికి తెలియదు. అరటిలో 1000 కి పైగా రకాలు ఉన్నాయి. వీటిలో కొన్ని రకాల ఆరోగ్యకరమైన పోషకాలు ఉంటాయి. వీటిని ఆహారంలో తీసుకుంటే అద్భుతమైన ప్రయోజనాలు పొందవచ్చు.. ఎరుపు అరటిపండు ఆగ్నేయసియాలో పెరిగే కొరిందకాయ రుచిని కలిగి ఉంటుంది. ఇది జీవక్రియను మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. అలాగే రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయకారిగా ఉంటుంది. ఎర్ర అరటి పండ్లు ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.. అధిక బరువుతో బాధపడుతున్న వారు తగ్గాలని అనుకుంటే ఆహారం దినచర్యపై మనసు నిర్దేశిస్తే అది ఖచ్చితంగా జరుగుతుంది.

వివిధ రకాల వ్యాయామలు ఆహారం మొదలైన వాటిని వినియోగించి శరీర బరువును కంట్రోల్ చేయవచ్చు. మనం తీసుకునే కొన్ని ఆహార పదార్థాలు, కూరగాయలు, పండ్లు బరువు తగ్గడానికి ఎంతగానో దోహదపడతాయి. దానిలో ఒకటి ఎర్ర అరటిపండు దీని రోజు ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల కచ్చితంగా బరువు తగ్గుతారు. దీని వివరాలు గురించి పూర్తిగా తెలుసుకుందాం..

కంటి ఆరోగ్యం :అరటి తొక్క ఎరుపు రంగులో కెరుటోనాయిడ్స్ ఉండడం వల్ల వస్తుంది. ఇది కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కెరీటోనాయుడ్,లుటీన్ బీటాకే రోటీన్ అని పిలుస్తారు. ఇది వయసు సంబంధిత మచ్చల క్షీణతను తగ్గిస్తుంది. లుటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఏఎండి ప్రమాదాన్ని 25% తగ్గించవచ్చని పరిశోధనలు తెలుపుతున్నాయి. ఎర్రటి అరటిపండు లోని బీటా కెరోటిన్ కంటెంట్ ఇతర పండ్ల కంటే ఎక్కువగా కంటి ఆరోగ్యాన్ని రక్షిస్తుంది.

రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుంది : ఎర్రటి అరటిపండ్లు ఉండే మెగ్నీషియం, పొటాషియం రక్తనాళాలను సడలించి రక్త ప్రసరణ జరిగేలా చేస్తుంది. అరటి పండ్లు రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.

రోగనిరోధక శక్తిని పెంచడంలో చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కొల్లజన్ ఉత్పత్తి చేయడంలో విటమిన్ సి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఎన్నో రకాల ప్రయోజనాలను కలిగిస్తుంది.
ఈ ఎర్రటి అరటి పండ్లు విటమిన్ సి విటమిన్ b6 యాంటీ ఆక్సిడెంట్ ఫైబర్ క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఆరోగ్యకరమైన ఆహారంలో ఈ పోషకాలన్నీ చాలా ముఖ్యం. ప్రతిరోజు ఈ ఎర్ర అరటి పండ్లు తీసుకుంటే అది ఆరోగ్యం ఇస్తుంది. అలాగే జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. గుండె ఆరోగ్యాన్ని రక్షిస్తుంది.

మధుమేహం రక్తపోటు నిర్వహణ : రక్తపోటు మధుమేహం నిర్వహణతో పాటు ఇది పూర్తి ఆరోగ్య నిర్వహణకు సహాయపడుతుంది. ఎర్ర అరటి పండు పోషక విలువలు దాని ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. దీనిలో కేలరీలు 90% గా ఉంటాయి. ప్రోటీన్ 1.1 గ్రామ్ కొవ్వు 0.3 గ్రామ కార్బోహైడ్రేట్లు 22.8 గ్రాములు పొటాషియం 350 మిల్లీగ్రాములు, ఫాస్పరస్ 22 మిల్లు గ్రాములు, ఫైబర్ 2.6 మిల్లీగ్రాములు, విటమిన్ బి 9 2.6 మిల్లీగ్రాములు క్యాల్షియం 5mg ,సోడియం 1.3 ఎంజి, విటమిన్ సి 5 మిల్లీగ్రాములు గా ఉంటుంది. ఇన్ని పోషకాలు ఉన్న అరటిపండును ప్రతిరోజు ఖాళీ కడుపుతో తీసుకుంటే మీ ఆరోగ్యం సురక్షితంగా ఉంటుంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది