Pomegranate Peel : తొక్కే కాదా అని పారేస్తున్నారా… దీనిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Pomegranate Peel : తొక్కే కాదా అని పారేస్తున్నారా… దీనిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు…!

Pomegranate Peel ” మనం రోజువారి జీవితంలో ఎన్నో రకాల పండ్లను తీసుకుంటూ ఉంటాము. వాటిలలో దానిమ్మ పండు ఒకటి. అయితే ఈ దానిమ్మ నుండి గింజలు తీసివేసిన తర్వాత తొక్కను పారేస్తూ ఉంటాము. కానీ దానిమ్మ గింజలు మాత్రమే కాక తొక్కలో కూడా ఎన్నో పోషకాలు మరియు ఎంతో ఆరోగ్యకరమైన లక్షణాలతో నిండి ఉన్నాయని మీకు తెలుసా. ఆయుర్వేద ప్రకారం చూసినట్లయితే, ఈ దానిమ్మ తొక్కలో ఉండే లక్షణాలు బరువును నియంత్రించడానికి మరియు ఆరోగ్యాన్ని,అందాన్ని పెంచుకోవడంలో […]

 Authored By ramu | The Telugu News | Updated on :12 July 2024,7:00 am

ప్రధానాంశాలు:

  •  Pomegranate Peel : తొక్కే కాదా అని పారేస్తున్నారా... దీనిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు...!

Pomegranate Peel ” మనం రోజువారి జీవితంలో ఎన్నో రకాల పండ్లను తీసుకుంటూ ఉంటాము. వాటిలలో దానిమ్మ పండు ఒకటి. అయితే ఈ దానిమ్మ నుండి గింజలు తీసివేసిన తర్వాత తొక్కను పారేస్తూ ఉంటాము. కానీ దానిమ్మ గింజలు మాత్రమే కాక తొక్కలో కూడా ఎన్నో పోషకాలు మరియు ఎంతో ఆరోగ్యకరమైన లక్షణాలతో నిండి ఉన్నాయని మీకు తెలుసా. ఆయుర్వేద ప్రకారం చూసినట్లయితే, ఈ దానిమ్మ తొక్కలో ఉండే లక్షణాలు బరువును నియంత్రించడానికి మరియు ఆరోగ్యాన్ని,అందాన్ని పెంచుకోవడంలో కూడా ఎంతో బాగా మేలు చేస్తుంది. అయితే సాధారణంగా జ్యూసీ దానిమ్మ గింజలు మాత్రమే మేలు చేస్తాయి అని అంటూ ఉంటారు. కానీ దానిమ్మ ప్రయోజనాలు వాటి విత్తనాలకు పరిమితం కాదు. ఈ దానిమ్మ తొక్కలు అనేవి ఆరోగ్యానికి మాత్రమే కాక అందానికి కూడా ఎంతో బాగా మేలు చేస్తుంది. ఈ దానిమ్మ తొక్క వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

దానిమ్మ తొక్కలో ఉండే పోషకాలు, లక్షణాలు : ఈ దానిమ్మ తొక్కలో ప్రోటీన్లు, విటమిన్లు,కాల్షియం, ఇతర కనిజాలు, ఫ్లేవనాయిడ్స్, టానిన్లు,పొటాషియం, పాలి ఫైనల్స్ లాంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఇవి మాత్రమే కాక యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమెంటరీ లక్షణాలు కూడా దీనిలో ఉన్నాయి. ఇవి శరీరంలో ఉన్న ఎంతో హానికరమైన ఫ్రీ రాడికల్స్ ను నాశనం చేయటంతో ఆక్సీకరణ ఒత్తిడిని మరియు మంటను నియంత్రించడంలో ఎంతో హెల్ప్ చేస్తుంది. అలాగే జలుబు మరియు ఎన్నో రకాల ఆరోగ్య సమస్యల నుండి కూడా ఉపశమనాన్ని కలిగిస్తుంది. దానిమ్మ తొక్కల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు : దానిమ్మ గింజలు మాత్రమే కాక దాని తోక్కలో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది ఆరోగ్యం మరియు అందానికి సంబంధించిన సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది అని ముంబైకి చెందినటువంటి ఆయుర్వేద వైద్యురాలు మనీషా కాలే తెలిపారు. దానిమ్మ తొక్కలను ఆరబెట్టుకొని పొడి చేసి దానిని ఎన్నో రకాలుగా వాడవచ్చు. ఇది బరువును నియంత్రించడంలో ఎంతో హెల్ప్ చేస్తుంది. అలాగే గుండె మరియు జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచటం లో కూడా ఎంతో మేలు చేస్తుంది.

దానిమ్మ తొక్కలను వాడడం వలన జీర్ణ సమస్యలలో ఎంతో ఉపయోగకరంగా పనిచేస్తుంది. ఈ దానిమ్మ తొక్కలను పొడిచేసి వేడి నీళ్లల్లో కలుపుకొని తాగినట్లయితే జీర్ణ వ్యవస్థ అనేది బలపడి విరోచనాలు,గ్యాస్, అజీర్ణం లాంటి సమస్యల నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఇది పేగులను క్లీన్ చేయటంలో మరియు జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచటంలో కూడా ఎంతో సహాయం చేస్తుంది. దానిమ్మ తొక్కలలో యాంటీ ఆక్సిడెంట్లు మరియు యాంటీ ఇన్ఫ్లోమెంటరీ గుణాలు అధికంగా ఉన్నాయి. ఇవి చర్మవ్యాధుల నుండి వెంటనే ఉపశమనాన్ని కలిగిస్తాయి. ఈ దానిమ్మ తొక్కలను పొడి చేసుకొని దానిలో రోజ్ వాటర్ లో కలిపి ముఖానికి కనుక అప్లై చేసుకున్నట్లయితే చర్మం ఎంతో కాంతివంతంగా మెరుస్తుంది. అలాగే మొటిమలు మరియు మచ్చలు లాంటి సమస్యల నుండి కూడా వెంటనే ఉపశమనాన్ని కలిగిస్తుంది. అంతేకాక ముడతలు కూడా దగ్గు ముఖం పడతాయి. ఇది సూర్యుడి నుండి వచ్చే హానికరమైన కిరణాల నుండి కూడా చర్మాన్ని ఎంతగానో రక్షిస్తుంది. ఈ దానిమ్మలో విటమిన్ సి మరియు ఎన్నో ముఖ్యమైన పోషకాలు కూడా ఉన్నాయి. అలాగే జుట్టు సమస్యలకు కూడా ఈ దానిమ్మ తొక్క ఎంతో ఉపయోగంగా ఉంటుంది.

Pomegranate Peel తొక్కే కాదా అని పారేస్తున్నారా దీనిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

Pomegranate Peel : తొక్కే కాదా అని పారేస్తున్నారా… దీనిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు…!

దీని పొడిని కొబ్బరి నూనెతో గనుక కలిపి జుట్టుకు రాసుకుంటే వెంట్రుకలు అనేవి బలపడి జుట్టు రాలటం లాంటి సమస్య తగ్గుతుంది. ఇది చుండ్రు ను కూడా తగ్గించగలదు. అలాగే జుట్టుకు సహజమైన మెరుపును కూడా అందిస్తుంది. బరువులు నియంత్రించడంలో కూడా ఈ దానిమ్మ తొక్క ఎంతో ఉపయోగకరంగా పనిచేస్తుంది. దీనిలో ఉండే ఫైబర్,యాంటీ ఆక్సిడెంట్లు జీవక్రియను పెంచి శరీరంలో పేర్కొన్న కొవ్వును నియంత్రించడంలో కూడా ఎంతో సహాయం చేస్తుంది. అయితే గోరువెచ్చని నీటితో తీసుకోవడం వలన బరువు తొందరగా తగ్గుతారు. దానిమ్మ తొక్క పొడి దంతాలు మరియు చిగుళ్ళ సమస్యలకు కూడా ఎంతో మేలు చేస్తుంది. దీనిలో యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు దంతా క్షయం, చిగుళ్ల వాపులను నియంత్రిస్తుంది. ఈ దానిమ్మ తొక్కల పౌడర్ తో దంతాలు చిగుళ్ళు ఆరోగ్యం కోసం ప్రతిరోజు బ్రెష్ చేసుకోవటం వలన దంతాల తెల్లదనాన్ని రక్షిస్తుంది. అలాగే చిగుళ్ళను బలంగా చేస్తుంది…

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది