Rama Phala Fruit : ఈ పండు తో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా..? ఇది ఆరోగ్యానికి శ్రీరామరక్ష..!!
ప్రధానాంశాలు:
Rama Phala Fruit : ఈ పండు తో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా..? ఇది ఆరోగ్యానికి శ్రీరామరక్ష..!!
Rama Phala Fruit : మనం రోజు ఆరోగ్యం కోసం ఎన్నో రకాల పండ్లు తీసుకుంటూ ఉంటాం. అందులో ఒకటి రామఫలం. ఈ రామఫలం పేరు అనేది చాలామందికి తెలియదు. సీతాఫలం గురించి తెలుసు. కానీ ఈ రామ ఫలం గురించి ఎవరికీ తెలియదు. ఇది సీతాఫలం వలె ఉంటుంది. ఈ ఫలం ఆరోగ్యానికి శ్రీరామరక్షగా పనిచేస్తుంది. దీనిలో ఉన్న ఎన్నో ఔషధ గుణాలు మనసుకు ఉత్తేజాన్నిస్తుంది. సీతాఫలం అందరికీ తెలుసు. కానీ రామఫలం ఎవరికి తెలియదు. సీతాఫలం లాగే రామ ఫలం. ఇది పేరుకు తగ్గట్టుగానే ఎంతో ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇందులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ పండుని ఇండియన్ చెర్రీ అని కూడా పిలుస్తారు. ఈ పండులో ప్రత్యేకమైన రుచి ఉంటుంది.
ఇది శరీరానికి కావలసిన ఎన్నో రకాల విటమిన్స్, మినరల్స్ వంటి పోషకాలు ఉన్నాయి. కావున దీనిని ప్రతినిత్యం తీసుకోవడం వలన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందిఅని వైద్య నిపుణులు తెలిపారు. ఇప్పుడు రామఫలం వలన కలిగే లాభాలు ఏంటో తెలుసుకుందాం. రామ ఫలం లో యాంటీ బ్యాక్టీరియల్ ,యాంటీసెప్టిక్ వంటి ఈ పండులోని పోషకాల వలన ఆరోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చు. మలేరియా ,క్యాన్సర్ వంటి వ్యాధులను నివారించే శక్తి ఈ పండులో ఉంది. దీనిలో ప్రోటీన్, డైటరీ ,ఫైబర్ ,కార్బోహైడ్రేట్ ఎక్కువగా ఉన్నాయి. ఇందులో విటమిన్ బి1, బి2, బి3, బి5,బి6, కాల్షియం ,ఐరన్, సోడియం, పొటాషియం వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి.
ఇది రక్తంలోని గ్లూకోజ్ శాతం తగ్గిస్తుంది. ప్రతిరోజు దీనిని తీసుకోవడం వలన రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుంది. ఈ పండులోని పోషకాల వలన హానికరమైన బ్యాక్టీరియా, వైరస్ నుండి రక్షిస్తుంది. ఇందులోని అనాసిన్, అనుకాటలిన్ వంటి క్యాన్సర్ కణాలను తగ్గిస్తుంది. ఈ పండుని తీసుకోవడం వలన వృద్ధాప్య చాయాల నుండి దూరంగా ఉంచుతుంది. రామ ఫలం లో ఉండే అస్కర్టిక్ యాసిడ్ చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈ ఫలం లో క్వినో లోన్స్, ఆల్కలాయిడ్స్, యాంటీ మైక్రోబియన్ కలిగి ఉంటుంది. దీనిలో విటమిన్ c ఎక్కువ మోతాదులో ఉంటుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఎంతో ఉపయోగపడుతుంది. ఈ పండులో బీ కాంప్లెక్స్, విటమిన్ సి ,పిరిడాక్సిన్ ఎక్కువ శాతం ఉండి మొటిమలు తగ్గిస్తుంది. వీటిలోని పీరియడ్స్ వలన మెదడు కణాలలోని అవసరమైన రసాయనాలను ఉంచటంలో ఎంతో మేలు చేస్తుంది.