Health Benefits ; ఈ రామ ఫలం లో ఉన్న పోషక విలువలు మీకు తెలిస్తే మీరు షాక్ అవ్వాల్సిందే…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Health Benefits ; ఈ రామ ఫలం లో ఉన్న పోషక విలువలు మీకు తెలిస్తే మీరు షాక్ అవ్వాల్సిందే…!!

 Authored By prabhas | The Telugu News | Updated on :19 January 2023,7:00 am

Health Benefits : రామఫలం ఈ పండు గురించి చాలామందికి తెలిసి ఉండదు.. ఈ రామఫలం సీతాఫలంతో పోలిస్తే దీనిలో గింజలు చాలా తక్కువగా ఉంటాయి. అయితే ఈ రామఫలంతో చేసిన జ్యూస్ శరీరానికి ఎన్నో పోషకాలను అందిస్తుందట. ఇది మిగతా పండ్ల కంటే ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది. అలాగే క్యాన్సర్కు అలాగే మలేరియా కు చాలా బాగా సహాయపడుతుంది. శరీర ఆరోగ్యాన్ని కాపాడేందుకు దానికి కావలసిన పోషకాలను అందించడంలో ఎంతో ముఖ్యం. అన్ని రకాల ప్రోటీన్స్, విటమిన్లు కార్బోహైడ్రేట్స్ శరీరానికి సరిగా అందకపోతే పోషక ఆహార లోపం వస్తుంది. అంతేకాక ఎన్నో రకాలుగా ఆరోగ్య ప్రయోజనాలు కూడా దీని నుంచి పొందవచ్చు. పోషకాహార లోపం వలన ఎన్నో ఆరోగ్య సమస్యలు మనల్ని వెంటాడే అవకాశం ఉంటుంది. కావున పోషకాలు పోషకలంగా ఉండే పండ్లను కూరగాయలను తీసుకోవాలి. ఈ పండులో ఉండే పోషకాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. తమిళనాడు, కర్ణాటక, ఛత్తీస్గడ్, కేరళ రాష్ట్రాలలో ఇవి బాగా పండుతాయి.

గుండె ఆకారంలో ఎరుపు రంగులో ఉండడమే కాకుండా జాక్ ఫ్రూట్ కంటే మెత్తగా ఉంటుంది. దీని నెట్టేడ్ సీతాఫలం, బుల్లాఖాట్, బుల్ హాట్ అని కూడా పిలుస్తుంటారు.. ఈ రామ ఫలం మన ఇండియాలో కాకుండా యూరోప్లో అమెరికాలో కూడా బాగా పండిస్తూ ఉంటారు. సీతాఫలంతో పోలిస్తే రామఫలములు గింజలు తక్కువగా ఉంటాయి. ఈ పండులో ఎటువంటి ఆరోగ్య ఉపయోగాలు ఉన్నాయి ఇప్పుడు మనం చూద్దాం.. కీళ్ల నొప్పులకు ఉపశమనం : కీళ్ల నొప్పులతో ఇబ్బంది పడే వారికి రామ ఫలం గొప్ప ఔషధంలా ఉపయోగపడుతుంది. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ శరీరంలో ఫ్రీ రాడికల్స్ వలన కలిగే నష్టంతో పోరాడడానికి ఉపయోగపడుతుంది. కావున కీళ్ల నొప్పులు ఉపశమనాన్ని కలిగించే గుణం దీనిలో ఉంది. జుట్టు, చర్మం సంరక్షణ : చిట్లిన జుట్టు మటుములతో ఇబ్బంది పడుతున్న వారికి ఈ రామ ఫలం ఒక ఔషధం. ఇది జుట్టు చర్మం రెండిటిని ఆరోగ్యంగా ఉంచడంలో ఉపయోగపడుతుంది. దీనిలో బి కాంప్లెక్స్ విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. మొటిమలు తగ్గించడంలో కూడా ఈ పండు చాలా ఉపయోగపడుతుంది.

Health Benefits of Ramphal

Health Benefits of Ramphal

మెదడు కణాల్లో అవసరమైన రసాయనాలను స్థిరంగా ఉంచడానికి కూడా ఉపయోగపడుతుంది. శరీరంలోని ఫ్రీ రాడికల్స్ను తొలగించడంలో ఇది బాగా సహాయపడుతుంది. రోగ నిరోధక శక్తి : విటమిన్ సి తో పాటు రామ ఫలంలో విటమిన్ ఏ, బి విటమిన్లు ఉన్నాయి. ఇవి నిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే శరీరంలోని మంటను కూడా తగ్గిస్తుంది. మధుమేహం ఉన్నవారికి ఎంతో మేలు : మధుమేహంతో ఇబ్బంది పడేవారు ఎన్నో ఆహార నియమాలు ఇక వాళ్లు వీటిని తినాలి వీటిని తినకూడదు. అనే విషయంపై చాలా రకాల అపోహలు ఉంటాయి. అయితే ఈ రామ ఫలం ఒక ఐ ఫర్ లోకల్ ఫ్రూట్ రక్తంలోని గ్లూకోస్ ను తగ్గించే గుణం ఈ రామ ఫలానికి ఉంది ఇది మధుమేహాన్ని కంట్రోల్ చేసేందుకు కావలసిన మినరల్స్ ఈ పండులో పుష్కలంగా ఉంటుంది. దీనిలో క్యాన్సర్ నిరోధక గుణాలు కూడా ఉన్నాయి. తీపి విషయానికొస్తే సీతాఫలం కంటే ఈ పండులో తక్కువ స్వీట్ ఉంటుంది. కావున షుగర్ వ్యాధి గ్రస్తులు ఈ పండుని ఎటువంటి అనుమానం లేకుండా తీసుకోవచ్చు…

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది